ముగుస్తున్న టీటీడీ పాలక మండలి పదవీ కాలం: నూతన పాలకమండలిపై సర్కార్ కసరత్తు.!

Publish Date:Oct 30, 2026

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానం   మండలి పదవీకాలం ముగియనుండటంతో ఇప్పుడు కొత్త పాలక మండలిపై సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు. అదలా ఉంచితే. 

ప్రస్తుత బోర్డు హయాంలో చేపట్టిన పలు సంస్కరణలు, భక్తులకు కల్పించిన వసతులు,  వివాదాలపై  సమీక్ష జరుగుతుండగానే, మరోవైపు కొత్త అధ్యక్షుడి ఎంపికపై  చర్చ సాగుతోంది. ఎలాంటి విమర్శలకు,వివాదాలకూ  తావులేకుండా,  పాలనా దక్షత,  ఆధ్యాత్మిక భావన మెండుగా ఉన్న అనుభవజ్ఞుడైన వ్యక్తికి  టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నాయకులు, పారిశ్రామిక ప్రముఖుల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

ముఖ్యంగా కష్టకాలంలో పార్టీకి ఎల్లప్పుడూ అండగా నిలిచిన సీనియర్ నేతలతో పాటు, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ప్రముఖులకు ఈ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటే, ఇప్పటికే టీటీడీ చైర్మన్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. 

ప్రస్తుత టీటీడీ పాలక మండలి  ఈ రెండేళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల విజయవంతం, భక్తుల రద్దీని నియంత్రించేందుకు తీసుకున్న చర్యలు, క్యూలైన్లలో వసతులు మెరుగుపరచడం వంటి అంశాలు ఒకవైపు ప్రశంసలు అందుకోగా,  రాజకీయ వివాదాలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, రాబోయే రోజుల్లో సంస్థ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేలా సమర్థవంతమైన నాయకత్వాన్ని వ్యక్తికి టీటీడీ చైర్మన్  పగ్గాలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొత్త టీటీడీ ధర్మకర్తల మండలిని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కొత్త ఛైర్మన్‌తో పాటు పూర్తి స్థాయి సభ్యుల జాబితాను  ఒకేసారి వెల్లడించాలని ప్రభుత్వం భావిస్తోంది.  


[TTD Board tenure Coming To End, TTD Chairman, Tirumala Tirupati Devasthanams, Andhra Pradesh, CM Chandrababu, New board, Telugu One]  

By
en-us Political News

  
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.