చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు బాధ ప‌డి లాభ‌మేంటి ట్రంప్?

Publish Date:Sep 6, 2025

Advertisement

ట్రంప్ కి ఎవ‌రైనా అర్జెంటుగా చ‌ద‌రంగం నేర్పించాల్సి ఉంది. కార‌ణం ఏంటంటే ఆయ‌న‌కు తాను వేసే స్టెప్ కి అనుకూలంగానే రిజ‌ల్ట్ వ‌స్తుంద‌న్న పిచ్చి భ్ర‌మ‌ల్లో బ‌తికేస్తున్నారు. ఈ భూ ప్ర‌పంచం మీద ఇలాంటి వ్య‌క్తి  అమెరికా అధ్య‌క్ష పీఠం ఎక్క‌డం బ‌హుశా ఇదే తొలిసారేమో అంటారు ఆ దేశంలోని ఆయ‌న సొంత పార్టీ నేత‌లే.

మాములుగా అమెరికా దాని స్వ‌రూప స్వ‌భావాలు ఎలాంటివంటే, ఆ దేశం త‌న ప్ర‌యోజ‌నాల కోసం ఈ ప్ర‌పంచంలో ఉన్న ఖ‌నిజ వ‌న‌రులే కాదు, మాన‌వ వ‌న‌రుల‌ను కూడా భారీ ఎత్తున వాడుకుని వాటి ద్వారా.. అది అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించింది. ఒక‌ప్పుడు రూపాయ క‌న్నా త‌క్కువ విలువ గ‌ల డాల‌ర్ నేడు.. అంచెలంచెలుగా ఎదిగి రూపాయ‌ను నేడు అత్యంత క‌నిష్ట స్థాయికి ప‌డ‌వేసిందంటే అందుకు కార‌ణం ఈ ఫార్ములానే. ఈ మొత్తం గ్రోత్ లో ఉన్న‌దంతా వ‌లస శ‌క్తి సామ‌ర్ధ్యాలేనంటారు నిపుణులు.

మాములుగా ట్రంప్ ఏమంటారంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. కానీ అది ఇమ్మిగ్రెంట్స్ తో మాత్ర‌మే సాధ్య‌మ‌న్న‌ది ఆయ‌న‌కు తెలియ‌క పోవ‌డం విచార‌క‌రంగా చెప్పుకొస్తారు చాలా మంది. తాను కూడా ఒక  స్టాటిష్ జ‌ర్మ‌న్ మూలాలు గ‌ల వ్య‌క్తిగా ఈ అస‌లు విష‌యం గ్ర‌హించ‌లేక పోతున్నారాయ‌న‌. అమెరిక‌న్లంతా ఎవ‌రంటే ఆయా యురోపియ‌న్ దేశాల నుంచి వ‌ల‌స‌ వ‌చ్చిన వారు. అలాంటి అమెరిక‌న్లు ఫ‌క్తు యూరోపియ‌న్ మైండ్ సెట్ క‌లిగి ఉంటారు. వీరంతా దాదాపు రాయ‌ల్ లైఫ్ లీడ్ చేయాల‌న్న  ఆలోచ‌న ఎక్కువ‌గా క‌లిగి ఉంటారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ అమెరిక‌న్ ప్రెసిడెంట్లు త‌మ త‌మ ప్ర‌జ‌లను ఒళ్లు కందకుండా చూసుకోవ‌డంతో పాటు.. అన్నీ వారి కాలి ముందుకు వ‌చ్చేలా చేశారు. అదే ట్రంప్ ఏమ‌నుకుంటారంటే.. వీరి ఒళ్లు ఒంచి ప‌ని చేసేలా చేసి.. ఆపై అమెరికాను అగ్ర‌స్థానంలో నిల‌బెట్టాల‌నుకుంటున్నారు. ఇది ఎప్ప‌టికీ సాధ్యం కాని ప‌ని. ఇన్నాళ్ల పాటు ఆయా దేశాల నుంచి నాణ్య‌మైన సేవ‌ల‌ను అందుకుని సుఖ ప‌డ్డ స‌గ‌టు అమెరిక‌న్ ప్ర‌జ‌లు ఇప్ప‌టికిప్పుడు క‌ష్ట‌ప‌డి ప‌ని  చేయాలంటే ఎలా సాధ్యం?? ఈ విష‌యంలో పూర్తిగా బోల్తా కొట్టారు ట్రంప్.

మీరు కావాలంటే చూడండి.. ప్ర‌పంచంలోనే అతి పెద్ద దేశాల్లో ఒక‌టైన అమెరికాలో ఎప్పుడు ఖ‌నిజ వ‌న‌రుల కోసం త‌వ్వ‌కాలు జ‌ర‌గ‌వు. అక్క‌డెన్ని నిధి నిక్షేపాలు, చ‌మురు నిల్వ‌లున్నా స‌రే వాటిని విప‌రీతంగా తవ్వి పోయాల‌ని చూడ‌రు. కార‌ణ‌మేంటంటే.. వారి భౌగోళిక స్వ‌రూప స్వ‌భావం పూర్తిగా చెడిపోతుంద‌ని. అంత‌గా ప‌ర్యావ‌ర‌ణ ప్రేమ క‌న‌బ‌రుస్తారు. అదే గ‌ల్ఫ్ త‌దిత‌ర దేశాల నుంచి పెట్రో నిల్వ‌ల‌ను.. ఉక్రెయిన్, చైనాల నుంచి ఖ‌నిజ నిల్వ‌ల‌ను తీసుకుంటారు. ఇక చైనా నుంచి  ప్ర‌తి ప్రోడ‌క్ట్ దిగుమ‌తి చేసుకుంటారు. ఇండియ‌న్స్ నుంచి మేథో ప‌ర‌మైన సేవ‌లు, మెక్సిక‌న్ల నుంచి గొడ్డుచాకిరీ.. ఇలా ప్ర‌తిదీ ఇంపోర్ట్ చేసుకోవ‌ల్సిందే. వాళ్లు  కేవ‌లం పైపై మెరుగుల కార్లు వ‌గైరా మాత్ర‌మే ప్రొడ్యూస్ చేస్తూ త‌మ డాల‌ర్ ని తెలివిగా పెంచి పెద్ద‌ది చేసి.. ఇత‌ర దేశాల‌ను అంత‌కంత‌కూ పిండేసుకుంటూ ఆపై సంప‌న్న దేశంగా అంత‌కంత‌కూ ఎదుగుతుంటారు.

అమెరికా దేని మీద ఆధార ప‌డి  బ‌తుకుతూ ఉంటుందంటే అప్పుల మీద‌. క్రెడిట్ లేనిదే అక్క‌డ ఏ డెబిట్ కార్డూ ప‌ని చేయ‌దు. విచ్చ‌ల విడిగా అప్పు చేయ‌డం, ఆపై ప్ర‌భుత్వం ద్వారా రుణ మాఫీ చేయించుకోవ‌డం ఇదే స‌గ‌టు అమెరిక‌న్లు చేసే అస‌లు సిస‌లైన ప‌ని. 

ఈ క్ర‌మాన్ని పూర్తిగా మ‌ర‌చి.. భార‌త్ వంటి దేశాల‌ను దూరం చేసుకుని ట్రంప్ సాధించేది ఏటంటే మేక్ అమెరికా డౌన్ అగైన్ త‌ప్ప మ‌రోటి కాదంటారు సామాజిక విశ్లేష‌కులు. దానికి తోడు అమెరిక‌న్ల ప‌ని చేసే వారి  వ‌య‌సు వ్య‌త్యాసం కూడా చాలానే ఉంది. ఇన్నాళ్ల పాటు ఏ కాయ క‌ష్టం చేయ‌ని ఆ శ‌రీరాలు అత్యంత సుఖంగా, కావ‌ల్సినంత ఎక్కువ కాలం జీవించేలాంటి వెస‌లుబాటు క‌లిగి ఉన్నాయి. ఈ క్ర‌మంలో అమెరిక‌న్ల ఆయు ప్ర‌మాణం నానాటికీ  పెరిగుతూ వ‌స్తోంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో.. కుటుంబ వ్య‌వ‌స్థ చిన్నాభిన్నం కావ‌డం వ‌ల్ల‌.. జ‌న‌నాల సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గుతూ వ‌స్తోంది.

ఇప్పుడెలాంటి  ప‌రిస్తితి దాపురిస్తోందంటే.. అక్క‌డ స‌హ‌జీవ‌నాల‌ను దాటి పోయి గే, లెస్బియ‌న్ క‌ల్చ‌ర్ పెర‌గ‌టం  మొదలైంది. దీంతో మాన‌వ వ‌న‌రులు క్ర‌మేపీ అడుగంటి పోతున్నాయ్. 1960 త‌ర్వాత యూఎస్ లో వ‌ల‌స రేటు భారీగా త‌గ్గింది. స్టూడెంట్స్. ట్ర‌క్ డ్రైవ‌ర్ల‌తో స‌హా.. చివ‌రికి టూరిస్టుల‌ను కూడా అలౌ చేయ‌డం లేదు. కేవ‌లం భార‌తీయ స్టూడెంట్స్ వ‌ల్ల 25 బిలియ‌న్ డాల‌ర్ల మేర ఏటా ల‌బ్ధి చేకూరుతోంది. అంతెందుకూ ప‌క్క‌నే ఉన్న కెన‌డా  నుంచి వ‌చ్చే ఒక్కో టూరిస్టూ మినిమంలో మినిమం 4 వేల డాల‌ర్ల మేర ఖ‌ర్చు చేస్తారు. చివ‌రికి కెన‌డా మీద కూడా 51వ రాష్ట్రంగా మాలో క‌లిసిపోండంటూ అవాకులు చ‌వాకులు పేలి ట్రంప్ ఎంత చేటు తెచ్చాడంటే, అమెరికాకు, కెన‌డా వారు   విహారంగా రావ‌డ‌ం కూడా మానేసేంతగా.  దీంతో టూరిజం, హోట‌ల్ ఇండ‌స్ట్రీలో ఏకంగా రెండున్న‌ర ల‌క్ష‌ల మేర ఉద్యోగాలు పోయాయని చెబుతున్నాయి స‌రిహ‌ద్దు ప‌ర్యాట‌క గ‌ణాంకాలు.

అంతెందుకూ ఇదే విష‌యం మీద ట్రంప్ పై పెద్ద ఎత్తున కేసులు కూడా న‌మోద‌య్యాయి. మీ టారీఫుల కార‌ణంగా దేశానికి విప‌రీత‌మైన ఆర్ధిక న‌ష్టం క‌లుగుతోంద‌ని అప్పీళ్ల కోర్టు  తీర్పునిచ్చింది. కానీ తాను సుప్రీం కోర్టుకెళ్లి పంతం నెగ్గించుకుంటాన‌ని మంకు ప‌ట్టు ప‌డుతున్నారు ట్రంప్.

ఇలా చెప్పుకూంటూ పోతే ట్రంప్ అమెరికా అభివృద్ధి పాలిట పిడుగులా ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం అమెరికా ఆర్ధిక ప‌టిష్ట‌త వ‌చ్చే రోజుల్లో ఏమంత స‌జావుగా సాగేలా క‌నిపించ‌డం లేదని అంటారు ఆర్ధిక రంగ నిపుణులు. కావాల‌ని యుద్ధాల‌ను పుట్టించి, వాటిని తానే ఆపాన‌ని చెప్పుకుంటూ.. నోబుల్ శాంతి బ‌హుమ‌తి కోసం వెంప‌ర్లాడుతున్న ట్రంప్ కార‌ణంగా.. అమెరికా గ్రేట్ అగైన్ ప‌రిస్థితేమోగానీ ఫేట్ మాత్రం దారుణంగా మారేలా తెలుస్తోందని వాపోతున్నారు స‌గ‌టు అమెరిక‌న్లు.

ఒక‌టీ రెండు కాదు అన్నింటా ఆయ‌న తీసుకుంటున్న స్వార్ధ‌పూరిత‌ త‌ప్పుడు నిర్ణ‌యాల కార‌ణంగా  పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లుతోంది. పాక్ తో కుటుంబ సంస్థ ద్వారా వ్యాపారాల‌ను చేయించాల‌న్న ఆలోచ‌న‌తో ఆ దేశ ఆర్మీచీఫ్ ని ద‌గ్గ‌ర‌కు చేర్చుకోవ‌డంతో భార‌త్ మ‌న‌సు కూడా విరిగిపోయింది. ఇప్పుడు చూస్తే భార‌త్ దూర‌మై పోయింద‌ని బాధ ప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం అమెరికా అనేది అనేక దేశాల స‌హాయ స‌హ‌కారాల స‌మాహారం. అంతెందుకు ఆయుధాలు, స్పేస్ విష‌యంలోనూ ర‌ష్యాతో పోటీ అనేది ఒక స్ఫూర్తిగా ప‌ని చేసి నేడు ఆయా విభాగాల్లో ఈ స్థాయిలో ఉంది అమెరికా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్ కంట్రీస్ స్పాన్స‌ర్డ్ కంట్రీగా పేరున్న యూఎస్.. ప్ర‌స్తుతం తానేదో ప్ర‌పంచ  అగ్ర రాజ్యం అని మిడిసిప‌డుతోంది కానీ, గ్లేసియ‌ర్స్ క‌రిగాక కొండ మాత్ర‌మే మిగిలితే ఎలా ఉంటుందో వ‌చ్చే రోజుల్లో యూఎస్ తెలుసుకోవ‌డం ఖాయంగా అంచ‌నా వేస్త‌న్నారు అంత‌ర్జాతీయ దౌత్య వ్య‌వ‌హారాల నిపుణులు.

By
en-us Political News

  
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.