ఉగ్రవాదులకు సేఫ్ జోన్‌గా తెలుగు రాష్ట్రాలు..

Publish Date:Jul 18, 2016

Advertisement

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపై ఉగ్రవాదం బుసకొడుతోంది. ఈ భయం భారతదేశాన్ని ఎప్పటి నుంచో వెంటాడుతోంది. దేశంలోని ప్రతి రాష్ట్రం ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉంది. నిఘా వర్గాలు ఎంతగా పహారా కాస్తున్నప్పటికి ఉగ్రవాదులు ఎప్పుడు, ఎక్కడ విరుచుకుపడతారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం పేరు చెబితేనే తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఉగ్రవాదం "ఇస్లామిక్ స్టేట్" ప్రభావంతో జిల్లాలకు విస్తరించింది. ఇటీవల హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపేందుకు ఐసిస్ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది.

 

ఉగ్రవాదానికి..భాగ్యనగరానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకు ముందు దేశంలో జరిగిన చాలా పేలుళ్ల మూలాలు హైదరాబాద్‌లోనే దొరికాయి. చాలా ఉగ్రవాద సంస్థలకు హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ క్యాంపస్‌లా మారిపోయింది. రీసెంట్‌గా ఉగ్రవాదాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న ఐఎస్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై గట్టిగానే పడింది. అందుకే రాజధానిని దాటి జిల్లాల్లో ఉగ్రజాడలు వెలుగు చూస్తున్నాయి. సిరియా వెళ్లేందుకు ప్రయత్నించిన నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను పుణేలో అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఒక యువకుడు ఇప్పటికే సిరియాలో జరుగుతున్న యుద్ధంలో మరణించాడు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ ఐసిస్ కదలికలు ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్రంగా మారుతున్న గుంటూరు జిల్లాలో ఉగ్రవాదుల జాడలు బయటపడటం అప్పట్లో కలకలం రేగింది. జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఐఎస్‌లో పనిచేస్తున్నారు. వారు ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన తల్మిజూర్ రెహమన్ అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడి నుంచి సిరియా చేరుకుని అక్కడ యుద్ధంలో మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెహమాన్ మరణించలేదని తేలింది. అలాగే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల్లో కొందరు ఆయుధాల కోసం అనంతపురంలో బస చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇలా నిజామాబాద్ నుంచి అనంతపురం వరకు ప్రతి ప్రాంతం ఉగ్రవాదులకు సేఫ్‌జోన్‌గా మారడంతో ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. అయితే అదృష్టవశాత్తూ చాలా కుట్రలను నిఘా వర్గాలు విజయవంతంగా ఛేదించగలిగాయి. కానీ తెలియకుండా ఇంకా అనేకం జరుగుతూ ఉండవచ్చని..వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదమేనని పోలీసులు భావిస్తున్నారు. 

By
en-us Political News

  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.