చంద్రబాబుకు ఈ చెత్త అవసరమా?

Publish Date:Dec 23, 2014

Advertisement



తెలుగుదేశం పార్టీలోకి చెత్త వచ్చి చేరుతోంది. అవును... నిజంగానే చెత్త. ఎందుకూ పనికిరాని చెత్త వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతోంది. ఈ చెత్తవల్ల తెలుగుదేశం పార్టీ కలుషితమైపోవడం తప్ప ప్రయోజనం ఏమీ వుండదు. అయినప్పటికీ, చంద్రబాబుకు ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ చెత్తని పార్టీలో చేరనిస్తున్నారు. ఇతర పార్టీలతో అవసరాలు తీరిపోయి, అవకాశాలు లేకుండా వున్న ‘స్క్రాప్’ అదను చూసుకుని తెలుగుదేశం పార్టీలో కలసిపోవడానికి సిద్ధంగా వుంది. కొంత చెత్త ఇప్పటికే కలసిపోయింది. ఈ పరిణామం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి తెలిసీ జరగడమే పార్టీ శ్రేణులకు ఆవేదన కలిస్తోంది. ఈ చెత్తంతా తెలుగుదేశం పార్టీకి అవసరమా అని వారందరూ ఆవేదన చెందేలా చేస్తోంది.


తెలుగుదేశం పార్టీ పదేళ్ళు అధికారానికి దూరంగా వుంది. ఈ పదేళ్ళ కాలంలో అధికారమే పరమావధిగా భావించిన అనేక మంది స్వార్థపరులైన నాయకులు తెలుగుదేశం పార్టీని విడిచి పోయారు. కష్టకాలంలో అండగా నిలవకుండా దూరమైపోవడమే కాదు... ఇతర పార్టీల్లో చేరి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బొడ్డుకోసి పేరు పెట్టిన గోదావరి జిల్లాకి చెందిన ఓ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఎన్నో హోదాలు అనుభవించారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో జంప్ జిలానీలా మారిన ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని తిట్టని తిట్టు లేదు. ఇప్పుడు మళ్ళీ నానా తంటాలు పడి, ఎన్నెన్నో రికమండేషన్లు చేయించుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూల నుంచి ఆ మూల వరకు కాంగ్రెస్, వైసీపీలకు చెందిన ఎంతోమంది నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి తహతహలాడుతున్నారు. వీళ్ళంతా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంతో నష్టం చేసినవాళ్ళే. అలాంటి ‘చెత్త’ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి మళ్ళుతూ వుండటం ఇంతకాలం పార్టీని భుజాలమీద మోసిన నాయకులు, కార్యకర్తలకు ఆవేదన కలిగిస్తోంది.


చెరువులో నీరు వస్తే చేరే కప్పల్లాగా తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్న వారిని చంద్రబాబు నాయుడు ఆదరించడం మంచిది కాదన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో  వ్యక్తమవుతోంది. వీరంతా పార్టీకి గతంలో ద్రోహం చేసిన వారు, భవిష్యత్తులో నష్టం చేసేవారే తప్ప ఉపయోగపడేవారు కాదన్న ఆవేదనను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చేవారిలో కొంతమంది ఉత్తములు, పార్టీకి ఉపయోగపడేవారూ లేరని కాదు.. అయితే ఎందుకూ పనికిరాని వాళ్ళే ఎక్కువగా వుండటం గమనార్హం. అందువల్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గతంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని, అవినీతిపరులను, వివాదాస్పదమైన వ్యక్తులను పార్టీలోకి తీసుకోకపోవడం మంచిదన్న అభిప్రాయాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని మన్నించి పార్టీని ద్రోహుల నుంచి కాపాడాలని కోరుతున్నారు.

By
en-us Political News

  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.