జగన్ గ(క)డపలో టీడీపీ పాగా..?

Publish Date:Jul 25, 2016

Advertisement

కడప..ఈ పేరు చెబితే మొదటగా గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.  ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా వైఎస్‌దే హవా. తన రాజకీయ చతురతతో కాంగ్రెస్‌కు తప్ప మరోపార్టీకి కడపలో స్థానం లేకుండా చేశారు వైఎస్. గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా కలెక్టర్ వరకూ వైఎస్, ఆయన కుటుంబసభ్యుల మాట వినవలసిందే. ఇక వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం హవా గురించి చెప్పవలసిన అవసరం లేదు. అధికారం అంటే ఎలా ఉంటుందో..అధికారం ఎలా అనుభవించాలో ఆయన, ఆయన కుటుంబసభ్యులు చేసి చూపించారు. జిల్లాకు పవర్ సెంటర్‌లా మారి దాదాపు ప్రతిపక్షాన్ని అణచివేశారు వైఎస్. అలా కడప జిల్లా అంటే కాంగ్రెస్‌కు కంచుకోట అన్నట్లుగా తీర్చిదిద్దారు. అయితే ఆయన అకాల మరణంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

 

కాంగ్రెస్ అధిష్టానం తనను అవమానిస్తోందన్న ఆగ్రహంతో వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి హస్తానికి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవ్యాంధ్రలో తెలుగుదేశానికి వైసీపీ ధీటైన ప్రత్యామ్నాయంగా ఎదిగింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచినా కడపలో ఫ్యాన్ గాలి ముందు సైకిల్ నిలవలేకపోయింది. ఆది నుంచి పట్టున్న జిల్లా కావడం..పైగా సొంత జిల్లా కావడంతో వైసీపీ అధిపత్యం స్పష్టంగా కనిపించింది. మొత్తం 10 శాసనసభ స్థానాల్లో తొమ్మిదింటిని గెలుచుకుని జగన్ తన ఆధిక్యత చాటారు. అయితే కడపను కంచుకోటగా చేసుకున్న వైసీపీ సామ్రాజ్యంపై తెలుగుదేశం జెండా రెపరెపలాడించేందుకు ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహలు రచిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ తాజాగా స్థానిక సంస్థల ప్రతినిధులపై దృష్టిసారించింది.

 

ఇప్పటికే కడప, ప్రొద్దుటూరులో వైసీపీ కౌన్సిలర్లు, కార్పోరేటర్లు సైకిలెక్కారు. ఇక మండల, జిల్లా పరిషత్‌లపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో స్థానిక ప్రజాప్రతినిధుల నియోజకవర్గం నుంచి ఎన్నికలు కూడా జరగనుండటంతో మరిన్ని సమీకరణలు చేపట్టనున్నట్లు సమాచారం. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరడంతో అక్కడ స్థానిక బలం పెరిగింది. బద్వేల్‌లో ఇలాంటి పరిస్థితులపై దృష్టి సారించనున్నారు. మున్సిపాలిటీల్లో సంఖ్యాబలం పెంచుకుంటున్న టీడీపీ కొన్ని చోట్ల ఆ పీఠాలను చేజిక్కించుకునే అవకాశాల కోసం అన్వేషిస్తోంది. ఇందుకు తోడు కొందరు ముఖ్యనేతలు, సీనియర్లుగా ఉన్నవారు టీడీపీ వైపు మొగ్గుచూపుతుండటంతో ఆ పరిస్థితులు తెలుగుదేశానికి కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి చేరిక ఖరారైతే వార్డు స్థాయి నుంచి పార్టీకి మరికొంత  బలం పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దగ్గరుండి నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

 

లోకేష్ కృషి ఫలితంగానే కడప నగరంలో వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరారు. ఈ నెల 29న ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు జిల్లాకు రానుండటంతో సమీకరణాలు మారే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే తాతల నుంచి వస్తోన్న ఆధిపత్యాన్ని వేరొకరికి ఇవ్వడానికి ఒప్పుకోని జగన్ "ఇజ్జత్ కా సవాల్" అన్న చందంగా సర్వశక్తులు ఒడ్డి టీడీపీపై ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నేత వరకు సైకిల్‌ వైపు చూస్తోన్న తరుణంలో జగన్ మాటలు ఎవరూ వినే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమీకరణాలన్నింటి బట్టి కడప గడపలో టీడీపీ పాగా ఖాయంగా కనిపిస్తోంది.

By
en-us Political News

  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.