మాతృభూమిని మరిచారా..?

Publish Date:Aug 2, 2016

Advertisement

హరితహారం. ఇప్పుడు తెలంగాణ అంతా మారుమోగుతున్న నినాదం. వర్షాకాలం మొదలు కావడంతో సర్కార్ భారీ ఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో..ఆ మాటకొస్తే కోట్లాది మొక్కల్ని నాటి, వాటిని చెట్లుగా, మహా వృక్షాలుగా మలిచెయ్యాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి ఆలోచన..దీనిలో భాగంగా పెద్ద సంఖ్యలో తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేశారు. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తున్నపుడు అందరూ తలో చెయ్యి వేయడం అలవాటే. అలాగే సినీ ప్రపంచం కూడా రంగంలోకి దూకింది. సీఎం గారు అలా పిలుపునిచ్చారో లేదో ఆ తెల్లారేసరికి హీరోలు, హీరోయిన్లు తోటమాలి అవతారం ఎత్తారు నవ్వులు విరజిమ్ముతూ ఒక చేతిలో మొక్క, మరో చేతిలో వాటర్ క్యాన్ పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు.

 

ఇక్కడ వరకు బాగానే ఉంది కాని ..మొక్కలు నాటి రాష్ట్రం మొత్తాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశ్చయించారు, ఈ ఉద్ధేశ్యంతో "వనం-మనం" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యంలో ప్రజలంతా భాగస్తులై విజయవంతం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆయన పిలుపు మేరకు ప్రజలంతా తమ తమ ప్రాంతాల్లో మొక్కలు నాటుతూ బాగానే సహకరిస్తున్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు.. ఒక్క సినిమా ప్రముఖుడు కూడా ఆంధ్రలో అడుగుపెట్టలేదు..ఒక్క మొక్క నాటలేదు. హైదరాబాద్‌లోనే ఆస్తులన్ని ఉన్నాయి కాబట్టి..ఆ సర్కార్‌ అవసరం ఉంది కాబట్టి..ఆ భయంతో పిలవకపోయినా వెళ్లి మొక్కలు నాటొచ్చారు. ఆంధ్రతో..అక్కడి ప్రజలతో అవసరం ఏముందిలే అనుకుని రావడం లేదా..?

 

నిజానికి తెలుగు సినిమాకు పోషకులు, మహారాజా పోషకులు ఆంధ్రులే. కోస్తా అయినా, సీమ అయినా సినిమా మీద కాస్త ఎక్కువ అభిమానం చూపేది ఆంధ్రా వారే. గత కొన్నేళ్లుగా నైజాంలో కలెక్షన్స్ పెరిగినా అవి ముఖ్యంగా హైదరాబాద్ నుండి వచ్చేవే. ఆ హైదరాబాద్‌లో ఎక్కువ శాతం ఉన్నది ఆంధ్రా వారే. ఆంధ్రా, సీడెడ్‌లు కలిసి 60 శాతం కలెక్షన్స్‌ను అందిస్తే, నైజాం 40 శాతం కలెక్షన్స్‌ ఇస్తుంది. ఆ 40 శాతంలో 15 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. అలాంటి ఆంధ్రులపై ఇంతటి చిన్నచూపా. సినిమా వాళ్లు లైమ్ లైట్‌తో ఉన్నవారితో సాంగత్యం చేయడానికి ఇష్టపడతారు. తెలుగు ప్రజల ఆరాధ్యధైవం స్వర్గీయ ఎన్టీఆర్ హయాంను పక్కన బెడితే..చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు యావత్ తెలుగుచిత్ర పరిశ్రమ ఆయన ముందు సాగిలపడింది. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కామెడియన్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు "జై జన్మభూమి".. "జై తెలుగుదేశం".."జై చంద్రబాబు" అన్నారు.

 

2004లో టీడీపీ ఓటమిపాలవ్వడంతో వైఎస్ ముఖ్యమంత్రి కావడంతో టాలీవుడ్ ప్రముఖులు ఆయన కళ్లలో పడటానికి పాకులాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు ఏర్పడి తెలంగాణకు కేసీఆర్, నవ్యాంధ్రకు చంద్రబాబు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే చిత్రపరిశ్రమ హైదరాబాద్‌లో నెలకొని ఉండటంతో సినీ పెద్దలు ఇక్కడి ప్రభుత్వాన్ని మంచి చేసుకోవడానికి అపసోపాలు పడుతున్నారు. ఇక్కడ ఇళ్లు, ఆస్తులు, స్టూడియోలున్నాయి కాదనం..కానీ మీరు పుట్టింది...పెరిగింది..ఓనమాలు దిద్దింది..ఆంధ్రాలో..అంటే అది మీకు మాతృభూమి. "జననీ జన్మభూమిశ్చ స్వర్గదపి గరియసీ" అన్న సూక్తి ప్రకారం కన్నతల్లి, మాతృభూమి స్వర్గం కంటే గొప్ప. మాతృభూమిని మరిచిపోయారంటే కన్నతల్లిని మరచినట్లే.

By
en-us Political News

  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.