2019 టార్గెట్‌గా కేసీఆర్‌ కొత్త గేమ్‌... కాంగ్రెస్‌, బీజేపీల్లో కలవరం

Publish Date:Apr 11, 2017

Advertisement

 

ఆపరేషన్‌ ఆకర్ష్‌... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయ్‌, అంతలా ఉంది దాని ఎఫెక్ట్‌. ఆపరేషన్‌ ఆకర్ష్‌ దెబ్బకి పార్టీల మనుగడే ప్రశ్నార్ధకంగా మారగా... కొన్ని పార్టీలైతే మొత్తం తుడిచిపెట్టుకునిపోయే పరిస్థితి. ఇటు తెలంగాణలో కేసీఆర్... అటు ఏపీలో చంద్రబాబునాయుడు... ఇద్దరూ ఆపరేషన్‌ ఆకర్ష్‌లతో ప్రత్యర్ధి పార్టీలను దెబ్బకొట్టినవాళ్లే. అయితే ఏపీలో చంద్రబాబు దెబ్బకు వైసీపీ తట్టుకుని నిలబడినా, తెలంగాణలో మాత్రం కేసీఆర్‌ స్ట్రాటజీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు టీడీపీ కుదేలైపోయాయి. తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణలో కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. నలుగైదుగురు ఒకరిద్దరు మినహా ముఖ్యనేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. అయితే మరోసారి ఆపరేషన్‌ ఆకర్ష్‌కు కేసీఆర్‌ ముహూర్తం ఫిక్స్‌ చేశారనే టాక్‌ వినిపిస్తోంది. దాంతో ప్రతిపక్షాల్లో కలవరం మొదలైంది.

 

కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష్ దెబ్బకి కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి 12మంది, సీపీఐ నుంచి ఒక్కరు, వైసీపీ నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే గులాబీ కండువా కప్పేసుకోగా, ఇప్పుడు తాజాగా మరికొందరు కారెక్కడానికి రెడీగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ రోజు వీళ్లంతా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ సీనియర్లతో టచ్‌లో ఉన్నారనే చెబుతున్నారు. ఇటీవల డీకే అరుణ, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డితో పాటు ఎంపీ నంది ఎల్లయ్యలు... ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలవడం అనుమానాలకు తావిచ్చింది. పేరుకు పాలమూరు ప్రాజెక్టులపై కలిసినా, ఇంటర్నల్‌గా టీఆర్‌ఎస్‌లో చేరడంపైనే చర్చలు జరిగాయనే టాక్ బయటికొచ్చింది. దాంతో మలిదశ ఆపరేషన్ ఆకర్ష్‌‌కు బూస్ట్ ఇచ్చినట్లైంది.

 

కేసీఆర్‌ను కలిసిన పాలమూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో అందరూ కారెక్కకపోయినా, ఇద్దరు మాత్రం కచ్చితంగా ప్లీనరీ రోజు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటివరకూ బీజేపీని టచ్‌ చేయని కేసీఆర్‌... ఈసారి కమలం పార్టీని కూడా టార్గెట్‌ చేశారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో పుంజుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోన్న బీజేపీని దెబ్బకొట్టేందుకు, కమలం పార్టీ ఎమ్మెల్యేలపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రం ప్రయోగించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ వలలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు పడ్డారని, వాళ్ల కూడా త్వరలోనే కారెక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

 

2019 ఎన్నికలే టార్గెట్‌‌గా కేసీఆర్‌ మళ్లీ ఆపరేషన్‌ ఆకర్ష్‌‌కు తెరతీశారన్న సమాచారంలో ప్రతిపక్షాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది. మరి కేసీఆర్‌ కొత్త గేమ్‌లో ఈసారి ఎన్ని వికెట్లు పడతాయో చూడాలి.

By
en-us Political News

  
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.