ఒక గూటి శత్రువులు ఇంకో గూటికి.. మనగలరా..?

Publish Date:Jan 25, 2016

Advertisement

తెలంగాణ అధికార పార్టీలోకి వలసల పర్వం ఎప్పటినుండో సాగుతూనే ఉంది. ఉన్న పార్టీపై అసంతృప్తి చెందో.. పార్టీలో తమకు ప్రాధాన్యత లేదనో.. తమకు నేతల నుండి సపోర్టు రావడం లేదనో కారణం ఏదైనా కానీ.. తమ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు  నాయకులు. ఇప్పటికే చాలా మంది నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టీడీపీ నేతలు ఎక్కువగా టీఆర్ఎస్ లోకి చేరినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఒక పార్టీలోనే విభిన్న వాదనలు ఉండి.. ఒకరంటే ఒకరికి పడని.. ఒకరికి పదవి దక్కకుండా మరోకరు అడ్డుపడి.. ఇలా శత్రవులుగా ఉన్నవారందరూ ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా కృష్ణయాదవ్ టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరిన తలసాని యాదవ్ కి.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్న కృష్ణయాదవ్ కి గతం నుండే అభిప్రాయభేదాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినా కూడా.. ఎవరో ఒకరే మంత్రిగా ఉండే అవకాశం ఉండేది. తరువాత 2003 లో కృష్ణయాదవ్ స్టాంపుల కుంభకోణంలో చిక్కుకొని జైలుకి వెళ్ల్రారు. అనంతరం  కృష్ణయాదవ్ జైలు నుంచి వచ్చిన తరువాత టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకునేందుకే తలసాని ప్రయత్నించారు. కానీ తలసాని ఎత్తులను అడ్డుకొని చివరికి ఆయ‌న టీడీపీలో చేరారు. కానీ తనకు అనుకున్న ప్రాధాన్యత కల్పించలేదు. ఆ తరువాత తలసాని యాదవ్ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. టీడీపీ నుండి గెలుపొందిన తలసాని యాదవ్ ఆ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లోకి చేరి ఆపార్టీలో మంత్రిగా కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా కోర్టులో ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి.

అయితే ఎప్పుడైతే టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తలసాని టీఆర్ఎస్ లో చేరారో అప్పటి వరకూ ప్రాధాన్యత లేని కృష్ణయాదవ్ కు తలసాని పదవి లభించింది. అయితే ఇక్కడ కూడా రాజకీయాలు చేసి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణయాదవ్ ఆ పదవికి పనికిరాడని చెప్పి.. మాగంటి గోపీనాథ్‌కు ఆపదవిని కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో కంటోన్మెంటు ఎమ్మెల్యే జి. సాయన్న ప్రధాన పాత్ర పోషించారు. అయితే సాయన్న కూడా ఎప్పుడో టీఆర్ఎస్ లో చేరారు. అంతేకాదు ఇటీవల టీఆర్ఎస్ లోకి చేరిన విజయ రామారావుకి కూడా.. ఈ నేతలతో విభేధాలు ఉండేవి.

మరి గత పార్టీలో పరస్పరం విబేధాలు ఉన్న నేతలందరూ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అలాంటి నేతలు మరి ఇప్పుడు ఆ పార్టీలో కలిసి మనగలరా..? లేక గతంలో లాగానే అంటీ ముట్టనట్టు ఉంటారా అని అనుకుంటున్నారు. అయితే మన ఇంట్లో ఏం చేసినా చెల్లుతుంది కానీ.. పక్కింట్లోకి వెళ్లి ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే కుదరదు కదా.. అలానే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు తమ ఆటలు సాగించిన పార్టీ నేతలు.. పక్క పార్టీ అయినా టీఆర్ఎస్ లోకి వెళ్లి గతంలో లాగానే చేస్తానంటే కుదరదు కదా.. అందునా టీఆర్ఎస్ అధినేతే కేసీఆర్ ముందు కుప్పిగంతులు అంటే కష్టమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఎంతవరకూ కలిసి ఉంటారో చూడాలి.

By
en-us Political News

  
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.