పౌరసత్వానికి ముందే ఓటర్ లిస్టులో సోనియా పేరు? కోర్టులో మళ్లీ విచారణ..!

Publish Date:Sep 21, 2026

Advertisement

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించిన ఓటర్ జాబితా వివాదంలో ఢిల్లీ కోర్టు ఒక కీలకమైన తీర్పు వెలువరించింది. ఆమె భారతీయ పౌరసత్వం పొందడానికి ముందే ఓటర్ జాబితాలో పేరు చేర్చారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా, దాన్ని ఢిల్లీలోని ద్వాకా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే తోసిపుచ్చారు. పాత మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైన కారణాలు లేనివని  అవి 'నాన్-స్పీకింగ్ ఆర్డర్' అని స్పష్టం చేస్తూ ఆ తీర్పును పక్కన పెట్టారు. ఈ కేసుకు సంబంధించి తగిన విచారణ జరిపి, పోలీసుల నుంచి స్టేటస్ రిపోర్ట్ తెప్పించుకుని, ఇరుపార్టీల వాదనలు విన్న తర్వాతే కొత్తగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్  కోర్టును ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 29వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.

ఈ మొత్తం వివాదం వెనుక దరఖాస్తుదారు వికాస్ త్రిపాఠి అనే న్యాయవాది ఉన్నారు. సెంట్రల్ ఢిల్లీ కోర్ట్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న వికాస్ త్రిపాఠి ఈ రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆయన వాదన ప్రకారం, సోనియా గాంధీ ఏప్రిల్ 30, 1983 వ సంవత్సరంలో అధికారికంగా భారతీయ పౌరసత్వాన్ని పొందారు. అయితే, ఆమె పౌరసత్వం పొందడానికి సరిగ్గా మూడు సంవత్సరాల ముందు అనగా 1980వ సంవత్సరంలోనే న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్ జాబితాలో ఆమె పేరు చేర్చబడిందని ఆరోపించారు. అంతేకాకుండా, 1982లో ఆ పేరు తొలగించబడి, మళ్లీ 1983లో తిరిగి చేర్చబడిందని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ పత్రాలను ఉపయోగించి ఈ అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాలని ఆయన కోరారు.

మరోవైపు, సోనియా గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.ఎస్. చీమా వాదనలు వినిపిస్తూ ఈ ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించారు. ఈ పిటిషన్ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, నిరాధారమైనదని మరియు చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఎలాంటి ప్రాథమిక పత్రాలు లేదా ఆధారాలు చూపకుండా, కేవలం మీడియాలో వచ్చిన ఊహాజనిత కథనాల ఆధారంగా ఈ ఫిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు.

 

 పౌరసత్వానికి సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, ఓటర్ జాబితా వివాపాలు ఎన్నికల సంఘం పరిధికి చెందుతాయని గతంలో మెజిస్ట్రేట్ కోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయితే, నేరం జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు జరపకుండా పౌరసత్వం వైపు మళ్లడం సరికాదని తాజా తీర్పులో ప్రత్యేక న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 175(3) నిబంధనలను పాటించకుండా మెజిస్ట్రేట్ కోర్టు గతంలో ఏకపక్షంగా వ్యవహరించిందని కోర్టు తప్పుపట్టింది. సెప్టెంబర్ 29న జరగనున్న విచారణలో ఈ వివాదంపై ఎలాంటి కొత్త మలుపులు వస్తాయోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

 

 

 

[ Sonia Gandhi, Voter roll case, Delhi court, Citizenship controversy, fresh hearing, Legal news, Rahul gandhi, Congress party, BJP, R.S. Cheema, Telugu One, Telugu News ]


 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.