రెండు దశాబ్దాలు.. 30 ట్రాన్స్ ఫర్లు.. లేడీ ఐపీఎస్ ఉద్యోగ ప్రస్థానం.!

Publish Date:Sep 21, 2026

Advertisement

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ సర్వీస్‌లో నిబద్ధతతో, రాజీలేని తత్వంతో వ్యవహరిస్తే ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందనడానికి కర్ణాటకకు చెందిన  ఐపీఎస్ అధికారి డీ.రూపా  నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు చట్టాన్ని పక్కాగా అమలు చేయడంలో  రాజీలేని ఆమె తీరు కారణంగా రెండు దశాబ్దాల తన కెరీర్లో 40 బదిలీలను ఎదుర్కొన్నారు. రాజకీయ,  ఇతరత్రా తీవ్రమైన ఒత్తిళ్లను ఇసుమంతైనా లెక్క చేయకుండా,  పారదర్శకంగా విధినిర్వహణలో ఆమె సాగిస్తున్న ప్రయాణం, ప్రస్థానం దేశ వ్యాప్తంగా  చర్చనీయాంశంగా మారింది. 

2000వ  ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన  డీ.రూపా, సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 43వ ర్యాంకు సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో   శిక్షణ సమయంలోనూ  ప్రతిభ కనబరిచి,  5వ ర్యాంకును సొంతం చేసుకున్నారు.   విధి నిర్వహణలో   చట్టాన్ని వినా   ప్రాతిపదికగా  ఎటువంటి వత్తిళ్లు, బెదరింపులకు వెరవలేదు. వెనకడుగు వేయలేదు.  ఫలితంగా ఆమె కెరీర్‌లో దాదాపు 40 సార్లు బదిలీలను ఎదుర్కొన్నారు.   ఈ బదిలీలలో  సాధారణ పరిపాలనా పరమైనవి చాలా తక్కువ. అత్యధిక బదలీలు మాత్రం విధినిర్వహణలో ఒత్తిడులకు లొంగకుండా, బెదరింపులకు వెరవకుండా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఆమె తీసుకున్న నిర్ణయాలే కారణం.  ఎన్ని బదలీ వేటులు పడినా, ఎక్కడ, ఏ పోస్టింగ్ ఇచ్చినా రూప మాత్రం   తనదైన శైలిలో వేగంగా, చురుగ్గా పనిచేస్తూనే ఉన్నారు. అదే ఆమెకు దేశవ్యాప్తంగా జనబాహుల్యంలో గుర్తింపు తీసుకువచ్చింది. ప్రజాభిమానాన్ని చూరగొంది. 

 రూపా కెరీర్‌లో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి.  విధి నిర్వహణలో ఉన్న సమయంలో అధికారంలో ఉన్న ఒక మంత్రిని అరెస్టు చేయడానికి ఆమె వెరవక పోవడం,  ఆ తర్వాత  ప్రభుత్వ వర్గాల్లో తలెత్తిన పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అప్పట్లో ఆమె తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయం ప్రభుత్వ ఉన్నత వర్గాలకే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పెద్ద సవాల్‌గా మారింది.  తనను బదిలీ చేసేందుకు అధికారిక ఉత్తర్వులు టైప్ చేసేలోపే ఆమె తన విధులను వేగంగా పూర్తి చేయడం ఆమె తెగువకు అద్దం పడుతుంది.

 ప్రభుత్వ సర్వీసుల్లో నిబద్ధతతో, నిజాయితీతో  పనిచేసే అధికారులకు నిరంతరం అడ్డంకులు ఎదురుకావడం కద్దు.  రాజకీయ నాయకులు అయితే  రూపా లాంటి అధికారులు ఆ అడ్డంకులు, అవాంతరాలు, బెదరింపులు, బదలీలను లెక్క చేయకుండా మొక్కవోని ధైర్యంతో.. నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెడుతుంటారు. రూపా వంటి అధికారుల వ్యవహార శైలి అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు గడగడలాడే పరిస్థితి వస్తుంటుంది.  ఇక ఐపీఎస్ రూపా విషయానికి వస్తే.. ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ప్రజా ప్రయోజనం, చట్టబద్ధత స్పష్టంగా కనిపిస్తాయని  తోటి అధికారులు చెబుతుంటారు. 

ఒక వైపు తరచూ బదిలీలు ఎదురవుతున్నప్పటికీ, ఆమె తన పనితీరును ఇసుమంతైనా మార్చుకోలేదు. ఎక్కడికి వెళ్లినా శాఖాపరమైన క్రమశిక్షణను కఠినంగా అమలు చేయడమే కాకుండా, తన కింద పనిచేసే సిబ్బంది కూడా అదే పద్ధతిని అనుసరించేలా  చర్యలు తీసుకునేవారు. కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, సమాజంలో ఉన్నత విలువలను కాపాడటంలో పోలీస్ శాఖ పాత్ర ఎంత కీలకమో ఆమె తన చేతల ద్వారా నిరూపించారు. ఒక మహిళా అధికారిగా ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, అధిగమించిన అడ్డంకులు యువతకు, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేయాలనుకునేవారికి స్ఫూర్తి దాయకం, మార్గదర్శకం అనడంలో సందేహం లేదు.    ప్రజల పక్షాన నిలబడి చట్టం అమలులో ఒత్తిడులను, సవాళ్లను ఎదుర్కొని రూప సాగించిన ప్రస్థానం దేశంలోని ఎంతోమంది యువ అధికారులకు ధైర్యాన్ని ఇస్తోంది.  

[Roopa IPS, Karnataka Police Officer, 40 Transfers,20 Years Service, Lady IPS, UPSC Success Story]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.