విద్యార్థుల ముందే టీచర్‌ను కాల్చి చంపిన దుండగుడు.. ఆపై ఆత్మహత్య..!

Publish Date:Sep 21, 2026

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన దారుణ సంఘటన వెలుగు చూసింది. పాఠశాల గదిలో అందరూ చూస్తుండగానే విద్యార్థుల ముందే ఒక మహిళా ఉపాధ్యాయురాలిని అతి దారుణంగా కాల్చి చంపాడో దుండగుడు. ఈ హేయమైన చర్యకు పాల్పడిన అనంతరం నిందితుడు కూడా అక్కడే తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ భయానక ఘటనతో పాఠశాలలోని చిన్నారులు, తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హిదాయత్ నగర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల నిషాత్ ఫాతిమా గత ఏడాది కాలంగా లఖింపూర్ ఖేరీలోని చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

సోమవారం ఉదయం సరిగ్గా 11:30 గంటల సమయంలో ఫాతిమాకు పూర్వ పరిచయం ఉన్న 28 ఏళ్ల మహమ్మద్ సౌద్ అనే వ్యక్తి నేరుగా ఆ పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించాడు. పాఠశాల కారిడార్‌లో ఉపాధ్యాయురాలు నిషాత్ ఫాతిమాను కలుసుకుని కొంతసేపు మాట్లాడిన ఆ వ్యక్తి, ఎవరూ ఊహించని విధంగా తన వెంట తెచ్చుకున్న దేశీ తుపాకీని బయటకు తీశాడు. క్షణాల వ్యవధిలో ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఫాతిమా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలింది. ఉపాధ్యాయురాలి ప్రాణాలు తీసిన ఆవేశంలోనే నిందితుడు సౌద్ తన గన్‌తో తన తలపై కాల్చుకుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. 

పాఠశాల వేళల్లో విద్యార్థుల కళ్ల ముందే జరిగిన ఈ హత్య-ఆత్మహత్య ఉదంతంతో చిన్నారులు భయంతో వణికిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భయాందోళనలో ఉన్న విద్యార్థులను వెంటనే సురక్షితంగా ఇళ్లకు పంపించివేశారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి పాఠశాల కారిడార్‌లోని ఆధారాలను క్షుణ్ణంగా సేకరించారు. అనంతరం మృతిచెందిన ఉపాధ్యాయురాలు నిషాత్ ఫాతిమా, నిందితుడు సౌద్ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ప్రాథమిక విచారణలో భాగంగా ఫాతిమా, సౌద్‌లకు చాలా కాలంగా ఒకరికొకరు తెలుసని, నిత్యం మాట్లాడుకునేవారని పోలీస్ అధికారిణి ఖ్యాతి గార్గ్ వెల్లడించారు. అయితే, సౌద్ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడటానికి అసలు కారణాలు ఏమిటనే దానిపై ప్రస్తుతం లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఇరు కుటుంబాల సభ్యులు, పాఠశాల యాజమాన్యం, ప్రత్యక్ష సాక్షులైన ఉపాధ్యాయులను విచారిస్తున్నామని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

 

 

[ lakhimpur kheri news, woman teacher shot dead, up school crime, teacher murder uttar pradesh, school shooting india, lakhimpur kheri incident, Crime news ]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.