భారత్ పై యుద్ధ వ్యూహాలు: పాకిస్థాన్, చైనా చెట్టాపట్టాల్..!

Publish Date:Nov 20, 2026

Advertisement

భారత్ పై యుద్ధానికి పాకిస్థాన్, జైనాలు జమిలిగా వ్యూహాలు రచిస్తున్నాయా? అంటే యుద్ధ నిపుణులు, సరిహద్దు పరిశీలనా పర్యవేక్షకులు ఔననే విశ్లేషిస్తున్నారు. ఇందుకు ఉదాహరణలుగా జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 

తాజా పరిణాలను ఒక సారి అవలోకిస్తే..  నవంబర్ 11న కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా మిర్ బజార్ సమీపంలోని అఖ్రాన్ సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్‌పై ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వెంటనే అదనపు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి.   ఆ సమయంలో జిల్లాలో అధికారిక కార్యక్రమంలో ఉన్న జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉగ్రవాదులపై కఠిన చర్యలకు ఆదేశించారు.   దీనికి కొనసాగింపుగా నవంబర్ 12న కిష్టావర్ జిల్లా దచ్చాన్ ప్రాంతంలో ఇద్దరు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) పోలీసు అధికారులు ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. బాబీ చంద్ (57), రాష్పాల్ కుమార్ (47) అనే ఇద్దరు జమ్మూ కశ్మీర్ పోలీస్ అధికారులు రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపులో ఉన్న సహచరులకు రిలీఫ్ ఇచ్చేందుకు వెళ్తూ మార్గమధ్యంలో కనిపించకుండా పోయారు. వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో  అధికారులు గాలింపు చేపట్టగా, మరుసటి రోజు ఉదయం పర్వత ప్రాంతంలోని దట్టమైన అడవిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. తూటాల గాయాలతో మృతి చెందిన వారి ఆయుధాలు కనిపించకపోగా.. ఈ  ఘటనకు ముందు రోజు   పదో తరగతి విద్యార్థి ఒకడు వారి వద్దకు వచ్చి హెచ్చరించినట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ బాలుడి కోసం గాలింపు ప్రారంభించారు.   

అదలా ఉంటే..  నవంబర్ 14న సిక్కిం భూభాగంపై పాతిక వేల అడుగుల ఎత్తులో చైనాకు చెందిన ఫైటర్ జెట్ దాదాపు పాతిక నిముషాల పాటు గగనతలంలో ఎగిరినట్లు నివేదికలను ఉటంకిస్తూ.. అధికారులు వెల్లడించారు. ఆ విమానం ఏ మోడల్‌కు చెందినదనే వివరాలు  తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా పాకిస్థాన్ సైనిక సన్నద్ధత, ఆయుధ సేకరణలపై రక్షణ రంగ విశ్లేషకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆగస్టు నెలలో టర్కీ నుంచి కే2 టాక్టికల్ లోయిటరింగ్ మ్యూనిషన్, అసిస్‌గార్డ్ సోంగర్ డ్రోన్ వ్యవస్థలు, శాట్‌కామ్ ఆధారిత బైరాక్టర్ టీబీ2 డ్రోన్లు, టీఏఐ అంకా,   మానవరహిత యుద్ధ విమానం, సూపర్ సిమ్‌సెక్ డ్రోన్ల వంటి ఆయుధాలను పాకిస్థాన్ దిగుమతి చేసుకుంది. అలాగే చైనా నుంచి అప్‌గ్రేడ్ చేసిన హెచ్‌క్యూ9బీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పరికరాలను సమకూర్చుకుందని, వీటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో సౌదీ అరేబియా సహకారం ఉందనీ అంటున్నారు.   ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్, చైనాలు సంయుక్తంగా వ్యూహాత్మక కదలికలు చేస్తున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలు, సీఐఏ సమాచారం వంటి అంశాలపై భద్రతా నిపుణులు దృష్టి సారించారు. 

మరోవైపు, కుల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన నిందితుడిగా భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్, అతని సహచరుడు ఉమర్ నిసార్ దార్‌లను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాయి. కుల్గామ్ జిల్లాలోని ఒక మసీదులో స్థానికుల సహాయంతో వీరు తలదాచుకున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ జరిగింది.    

ఇది కూడా చదవండి:

రాబోయే రోజుల్లో జమ్మూ కశ్మీర్‌లోని సున్నిత ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యే అవకాశం ఉంది. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ), వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి గగనతల, భూతల నిఘాను మరింత బలోపేతం చేయడంపై భద్రతా యంత్రాంగం దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది.  

ఉగ్రవాద ముప్పును సమర్థంగా అరికడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగాల్సి ఉంది. మొత్తం మీద పాకిస్థాన్, చైనాల నుంచి యుద్ధముప్పు గతంలో కంటే ఎక్కువ తీవ్రంగా ఉందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. 

మీకు నచ్చవచ్చు: 


 [Kashmir Terror attacks,   Chinese jetm  Sikkim, ChinaPak, Joint War, Stratagies, TeluguOne] 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.