కాలాపాని నుంచి హుస్సేనీవాలా సమాధి వరకూ.. చరిత్ర గుర్తించని యోధుడు బటుకేశ్వర్ దత్.!

Publish Date:Nov 17, 2026

Advertisement

బటుకేశ్వర్ దత్ జయంతి సందర్భంగా  ప్రత్యేక వ్యాసం

స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో  అసమాన ధైర్యసాహసాలతో చెరగని ముద్ర వేసిన విప్లవ వీరుడు బటుకేశ్వర్ దత్ జయంతిని నవంబర్ 18న దేశవ్యాప్తంగా  జరుపుకుంటూ ఆయనను స్మరించుకుంటున్నారు. 1910 నవంబర్ 18న జన్మించిన బటుకేశ్వర్ దత్..షాహీద్ భగత్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు,  పోరాట సహచరుడు.  బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో వణుకు పుట్టించిన మహాయోధుడు కూడా.   1929 ఏప్రిల్ 8న బ్రిటిష్ పాలకులు తీసుకువచ్చిన ప్రజావ్యతిరేక చట్టాలకు నిరసనగా భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ కలిసి ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. 

అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగకూడదనే ఉద్దేశంతో ఖాళీ బెంచీల వద్దే వారు ఈ పేలుడుకు పాల్పడ్డారు. ఆ తరువాత అక్కడ నుంచి తప్పించుకుపోవడానికి ఉన్న అవకాశాన్ని కాదనుకుని ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలు చేస్తూ.. విప్లవ కరపత్రాలను గాలిలోకి వెదజల్లారు. భారత స్వాతంత్ర్య కాంక్షను గుర్తించకుండా గుడ్డి దర్బార్ గా వ్యవహరిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యావాదుల కళ్లు తెరిపించడం, స్వాతంత్ర్య నినాదాలను వినకుండా చెవిటి దర్బార్ నడుపుతున్న   బ్రిటిష్ పాలకుల చెవుళ్లో తుప్పు వదిలి దేశం గొంతు వినిపించాలన్న ఉద్దేశంతోనే బటుకేశ్వర్ దత్, భగత్ సింగ్ లు సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు పేల్చారు. ప్రాణహాని కలిగించడం వారి ఉద్దేశం కాదు. బ్రిటిష్ పాలకులకు దేశ స్వాతంత్ర్య సంగ్రామ సింహనాదాన్ని వినిపించడమే వాలక్ష్యం. 

సరే సెంట్రల్ అసెంబ్లీలో  బాబులు విసిరిన  ఘటన తరువాత  పోలీసులు బటుకేశ్వర్ దత్, భగత్ సింగ్ లను అదుపులోనికి తీసుకున్నారు. విచారణ తరువాత భగత్ సింగ్ కు ఉరి శిక్ష అమలు చేశారు. బటుకేశ్వర్ దత్ ను అండమాన్‌లోని సెల్యులార్ జైలుకు  (కాలాపానీ) తరలించారు. అక్కడ దాదాపు పద్నాలుగేళ్ల పాటు ఆయన నరకయాతనను అనుభవించారు. 

దేశ స్వాతంత్ర్య సాధన లక్ష్యాన్ని మరచి క్షమాభిక్ష కోరడానికి మాత్రం అంగీకరించలేదు.  పిన్న వయస్సులోనే మరణశిక్షకు గురైనందున  భగత్ సింగ్  విప్లవ ప్రతీకగా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అంతకు ఇసుమంతైనా తక్కువ కాని త్యాగం చేసిన బటుకేశ్వర్ సింగ్ కు మాత్రం చరిత్రలో తగినంత గుర్తింపు రాలేదు. 

ఇది కూడా చదవండి

అండమాన్ జైలు శిక్ష పూర్తి  చేసుకుని బయటకు వచ్చిన  బటుకేశ్వర్ దత్  ను స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత కూడా నెహ్రూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.  ఉపాధి,   ఆదరణ లేక ఆ మహావీరుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.చివరి రోజుల్లో క్షయవ్యాధితో బాధపడిన బటుకేశ్వర్ సింగ్.. 1965 జూలై 20న ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. మరణానికి ముందు తనను తన ప్రాణమిత్రుడు భగత్ సింగ్ సమాధి పక్కనే ఖననం చేయాలని చివరి కోరికగా అడిగారు.  ఆయన చివరి కోరిక మేరకు పంజాబ్‌లోని హుస్సేనివాలాలో భగత్ సింగ్ సమాధి పక్కనే బటుకేశ్వర్ దత్ అంత్యక్రియలు నిర్వహించి స్మారకాన్ని నిర్మించారు.  

 దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఇలాంటి అజ్ఞాత వీరుల చరిత్రను నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా పాఠ్యపుస్తకాల్లో  ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్సాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా ఆయన జయంతి, వర్ధంతులకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి బటుకేశ్వర్ దత్ త్యాగాలను గుర్తించి, ఆయన అసమాన పోరాట చరిత్రను నేటి తరానికి పరిచయం చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి.

మీకు నచ్చవచ్చు:


 [Batukeshwar Dutt, Birth anniversary, Bhagat Singhassociate, Freedom fighter, Hussainiwala memorial, TeluguOne] 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.