వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం: కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య.. రాజకీయ సన్యాసమేనా.?

Publish Date:Nov 19, 2026

Advertisement

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. వయోభారం కారణంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీలో దిగనని పేర్కొన్నారు. గతంలో కూడా ఈ విషయాన్ని ఆయన చెప్పినప్పటికీ, ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన చేసిన తాజా ప్రకటన సంచలనంగా మారింది.  మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 

మొత్తంగా సిద్దరామయ్య ఈ ప్రకటన రాజకీయ సన్యాసానికి సంకేతమా అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ హై కమాండ్ వద్ద పలుకుబడి తగ్గడం, ఇటీవల సోనియాగాంధీ ఆటోబయోగ్రఫి ది బిలాంగింగ్ ఆవిష్కరణ సభలో సిద్దరామయ్యకు ముందు వరుసలో చోటు దక్కకపోవడం తదితర అంశాలను ప్రస్తావిస్తూ పరిశీలకులు సిద్దరామయ్య తాజా ప్రకటన ఆయన రాజకీయ కెరీర్ ముగిసినట్లేనని విశ్లేషిస్తున్నారు. 

అయితే  సోనియా పుస్కకావిష్కరణ కార్యక్రమంలో   తాను వెనుక వరుసలో కూర్చున్న దృశ్యాలపై వస్తున్న విమర్శలు, ఊహాగానాలకు  సిద్ధరామయ్య ఈ సందర్భంగా వివరణ ఇస్తూ,  తాను వేదిక వద్దకు ఆలస్యంగా చేరుకోవడం వల్లే వెనుక సీటులో కూర్చోవాల్సి వచ్చిందని స్పష్టత ఇచ్చారు.  పార్టీ నాయకత్వం తనను పక్కన పెట్టిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేద పునరుద్ఘాటించారు.

సీనియర్ నేతగా సుదీర్ఘ కాలం పాటు కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సిద్ధరామయ్య, ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటానని గతంలోనే సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి తన వయసు ఎనభై పైనే ఉంటుందని, గతంలో మాదిరిగా పూర్తి ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం, పోటీ బాధ్యతలు నిర్వహించడం కష్టతరమని ఆయన తాజాగా కూడా మీడియా సమావేశంలో పునరుద్ఘాటించారు. మరోవైపు కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పిడి, నాయకత్వ మార్పు అనంతర పరిణామాల నేపథ్యంలో సిద్ధరామయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సంబంధాలు, పార్టీలో సిద్ధరామయ్య ప్రాధాన్యత వంటి అంశాలను ప్రస్తావిస్తూ పరిశీలకులు సిద్దరామయ్య పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేసినట్లేనని విశ్లేషిస్తున్నారు. 

ఇది కూడా చదవండి:  బొటా బొటిగ గెలిచిన సిద్ద రామయ్య...​

ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, ప్రజా సమస్యలపై తన గళం వినిపిస్తూ ప్రజా జీవితంలో కొనసాగుతారని ఆయన అభిమానులు చెబుతున్నప్పటికీ రాజకీయ సన్యాసం అన్న చర్చ కొనసాగుతూనే ఉంది.   కర్ణాటకలో  అసెంబ్లీ ఎన్నికలకు 2028లో జరుగుతాయి. అందుకుఇంకా చాలా సయమం ఉన్నప్పటికీ సిద్దరామయ్య ఎన్నికలలో పోటీ చేసే అంశంపై స్పష్టత ఇవ్వడంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ సమీకరణాలపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎన్నికల్లో పోటీకి దూరం అన్న సిద్దరామయ్య ప్రకటనతో.. రానున్న  రోజుల్లో సిద్ధరామయ్య క్రియాశీల రాజకీయాల్లో ఏ విధంగా కొనసాగుతారు, పార్టీ కార్యక్రమాలలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై కార్యకర్తలు, ప్రజల్లో చర్చోపచర్యలు జరుగుతున్నాయి. మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని పునరుద్ఘాటించడం ద్వారా  చేయడం ద్వారా సిద్ధరామయ్య తన వైఖరిపై ఎలాంటి సందిగ్ధత కుండబద్దలు కొట్టేసినట్లైంది.  

మీకు నచ్చవచ్చు:  కర్నాటకం.. సీఎం మార్పు ఖాయమేనా?​
రసకందాయంలో కర్నాటకం.. సీఎం సిద్దరామయ్య రాజీనామా?

[Siddaramaiah, Karnataka, Politics, Election, Contest TeluguOne] 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.