రాజస్థాన్ లో కాంగ్రెస్ జోష్: స్థానిక పోరులో తిరుగులేని ఆధిక్యం.. బీజేపీ కుదేలు.!

Publish Date:Nov 21, 2026

Advertisement

రాజస్థాన్‌లో   స్థానిక సంస్థల ఎన్నికల్లో  కాంగ్రెస్   స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది.  సాధారణంగా స్థానిక ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఏపీ సహా పలు రాష్ట్రాలలో అదే జరిగింది. జరుగుతోంది. అయితే అందుకు భిన్నంగా రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ట్రెండ్ మేరకు పంచాయతీ సమితి వార్డుల్లో  కాంగ్రెస్ పార్టీ 3,351 వార్డుల్లో ఆధిక్యంలో నిలవగా, బీజేపీ 1,995 వార్డులతో సరిపెట్టుకుంది. ఆర్ఎల్పీ 459 వార్డుల్లో ఆధిక్యత సాధించింది.  జిల్లా పరిషత్ ఎన్నికల లో కూడా కాంగ్రెస్ దూసుకుపోతోంది.  ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు జడ్పీ వార్డుల్లో కాంగ్రెస్ 222 చోట్ల ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 127వార్డుల్లో మాత్రమే ఆధిక్యత కనబరిచింది. నిస్సందేహంగా ఈ ఫలితాలు అధికార బీజేపీకి షాక్ అనే చెప్పాలి. 

రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ ఫలితాలు   ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల్లో సానుకూలత ఉంటుందనే భావనకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాలతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది.

కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే బలంగా ఉన్న కాంగ్రెస్..  ఇప్పుడు కీలకమైన ఉత్తరాది రాష్ట్రమైన రాజస్థాన్‌లోనూ పుంజుకోవడం.. పార్టీ హైకమాండ్ లోనూ, శ్రేణుల్లోనూ కూడా కొత్త జోష్ ను నింపుతుందనడంలో సందేహం లేదు.  స్థానిక సంస్థల స్థాయిలో ఓటర్ల నాడి కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటోందనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇది కూడా చదవండి:   రాజస్థాన్ కాంగ్రెస్ ఇక గాడిన పడినట్లేనా?

ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్బలంగా పుంజుకుందనడానికి సంకేతంగా చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందనడానికి తార్కానంగా చెబుతున్నారు. 

పూర్తిస్థాయి ఫలితాలు వెలువడిన తర్వాత జిల్లా పరిషత్‌లు, పంచాయతీ సమితుల పాలకమండళ్ల ఏర్పాటుపై స్పష్టత రానుంది. కాగా ఈ ఆధిక్యతతో కాంగ్రెస్ తదుపరి వ్యూహాలపై  దృష్టి సారించింది. ఈ ఫలితాలు  రాజస్థాన్  లో బీజేపీ ప్రతిష్ఠ మసకబారిందని తేటతెల్లం చేస్తున్నాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.  

మీకు నచ్చవచ్చు:  జడ్పీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభంజనం: 26 జిల్లా పరిషత్ కు కైవసం.!

ఒకే కుటుంబం: ముగ్గురు ప్రజా ప్రతినిథులు.. ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ.!

[Rajasthan local body elections, Congress,   BJP Defeat,   ZP results, Panchayat trends, TeluguOne]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.