హమ్మయ్య హస్తినలో ఊపిరి పీల్చుకోవచ్చు: ఢిల్లీలో తగ్గిన వాయు కాలుష్యం.!

Publish Date:Nov 18, 2026

Advertisement

దేశ రాజధాని నగరం ఢిల్లీ, అలాగే  నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో వాయుకాలుష్యం తగ్గింది. దీంతో హస్తిన వాసులకు ఉపశమనం లభించింది. హాయిగా గాలి పీల్చుకోవచ్చంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు దేశ రాజధాని ప్రజలు. ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి,  ఇతర పర్యవేక్షణ సంస్థల సమాచారం ప్రకారం, ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచీ  204కు పడిపోయింది. కాలుష్య స్థాయిలు కొంతవరకు మెరుగై  పేలవమైన కేటగిరీకి చేరడంతో, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) మూడో దశ నిబంధనలను సీఏ క్యూయం ఎత్తివేసింది.

తాజా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు తొలగిపోవడంతో నిర్మాణ రంగ పనులు, వాహనాల రాకపోకలపై విధించిన  నిషేధాలు తొలగిపోయాయి. అయితే, శీతాకాలం కొనసాగుతున్నందున కాలుష్య ముప్పు పూర్తిగా తొలగిపోలేదని ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మోడో దశనిబంధనలు తొలగించినప్పటికీ  జీఆర్ఏపీ తొలి రెండు దశల ఆంక్షలు, నిబంధనలూ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 

గతంలో దీపావళి పండుగ సమయంతో పాటు ఆ తర్వాతి రోజుల్లో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరింది. అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు ప్రమాదకర మార్కును దాటిపోవడంతో నగరమంతా దట్టమైన విషపూరిత ధూమపటలం అలుముకుంది. ఆ సమయంలో ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇన్ని రోజుల తరువాత వాయుకాలుష్యం ఒకింత మెరుగుపడటంతో ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: హస్తినను కమ్మేసిన వాయు కాలుష్యం

ప్రస్తుతం వాతావరణంలో కనిపిస్తున్న ఈ స్వల్ప మెరుగుదల తాత్కాలికం మాత్రమే కావచ్చని పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. చలి తీవ్రత పెరిగే కొద్దీ గాలి వేగం మందగించి కాలుష్య కారకాలు మళ్లీ పేరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

రాబోయే వారాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా మారతాయనే దానిపై అధికారులు నిరంతరం నిఘా ఉంచారు.ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు తీసుకుంటున్న చర్యలతో పాటు పౌరుల భాగస్వామ్యం కూడా కాలుష్య నియంత్రణకు ఎంతో అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రజలు   బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు.

 మీకు నచ్చవచ్చు:   Air Pollution: సరిగ్గా వాడితే ప్రాణవాయువు.. అతి చేస్తే కాలకూట విషం.!

కాలుష్య భారతం: కాలుష్య నగరాల జాబితాలో ఇండియా టాప్.!

[Delhi, Airpollution,  GRAP,  Stage3Lifted, AQI 20, DelhiNCR,TeluguOne]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.