విదేశీ గడ్డపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు: రాహుల్ తీరుపై బీజేపీ మండిపాటు.!

Publish Date:Nov 20, 2026

Advertisement

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు, ఆ పర్యటనల్లో ఆయన చేసే వ్యాఖ్యలూ వివాదాస్పదం కావడం కద్దు. దేశంలో పార్లమెంటు వేదికగా ప్రస్తావించాల్సిన అంశాలను ఆయన నిస్సంకోచంగా విదేశీ గడ్డపై మాట్లాడటం పట్ల గతంలోనూ పలు మార్లు వివాదాస్పదమైంది. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆయన ధోరణి మారడం లేదని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదనీ.. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలూ అంటున్నాయి. తాజాగా ఆయన విదేశీ గడ్డపై నుంచి భారత విదేశాంగ విధానంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన తన అమెరికా పర్యటనలో భాగంగా చికాగో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టకు భంగకరంగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా  ఇంకా చెప్పాలంటే ప్రేక్షకురాలిగా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.   ప్రపంచ వ్యవహారాల్లో భారత్ పాత్ర ప్రాధాన్యత దిగజారిందని వ్యాఖ్యానించారు.   భౌగోళిక రాజకీయాలపై స్పష్టమైన అవగాహనతో పాటు సొంత ఆలోచనా విధానంతో ఉండే భారత్ ఇప్పుడు అలా ఉండటం లేదని విమర్శించారు.  ఇతర దేశాలతో సంబంధాలు, భాగస్వామ్యాలు ఉన్నప్పటికీ స్వతంత్ర నిర్ణయాలకు ప్రాధాన్యత ఉండేదని, అయితే ఇప్పుడు పాకిస్థాన్ వంటి దేశం అమెరికా, ఇరాన్‌లతో చర్చలు జరుపుతుండగా భారత్ మాత్రం కీలక చర్చల నుంచి దూరంగా నిలిచిపోవడం విస్మయం గొలుపుతోందని రాహుల్ అన్నారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ విధానం తీరును  రాహుల్ గాంధీ తప్పుపట్టారు. అంతర్జాతీయ సంబంధాలు కేవలం వ్యక్తిగత స్నేహాల ప్రాతిపదికన కొనసాగవని, భౌగోళిక రాజకీయాల్లో స్నేహం కంటే విధానాలకే అధిక ప్రాధాన్యత ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు.  మోదీ తరచూ విదేశీ నేతలతో తన స్నేహం గురించి చెబుతుంటారని, కానీ వ్యక్తిగత స్నేహాలతో విదేశాంగ విధానం నడుస్తుందని భావించడం సరికాదన్నారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. విదేశీ గడ్డపై ప్రసంగిస్తూ  దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్..  రాహుల్ గాంధీ వ్యాఖ్యలు  అభ్యంతరకరమైనవని, అంతర్జాతీయ రాజకీయాలపై ఆయనకు కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు.   మోదీ నాయకత్వంలో ఇండియా ప్రపంచ వేదికపై ఏకాభిప్రాయాన్ని సాధించే శక్తిగా ఎదుగుతోందని, ఈ ఎదుగుదలను రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.  అలాగే  మరో బీజేపీ నేత ప్రదీప్ భండారీ   అంతర్జాతీయ వేదికలపై   రాహుల్ గాంధీ పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాకిస్థాన్ అంశంపై రాహుల్‌కు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నిస్తూ, విదేశీ వేదికలపై ఆయన తీరును తప్పుపట్టారు.  

ఇది కూడా చదవండి:  విదేశీ గడ్డపై దేశ వ్యతిరేక వ్యాఖ్యలా: రాహుల్ తీరుపై సర్వత్రా విమర్శలు.!​

చికాగోలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ వేడిని పెంచేశాయి.   రాబోయే రోజుల్లో భారత విదేశాంగ విధానం, అంతర్జాతీయ వేదికలపై దేశ పాత్రకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. 

మొత్తంమీద తటస్థులు కూడా విదేశీ గడ్డపై దేశం గురించిన విమర్శలు సరికాదని రాహుల్ కు హితవు చెబుతున్నారు.  రాహుల్ గాంధీకి మోడీ విదేశాంగ విధానాలపై అభ్యంతరాలు ఉంటే దేశీయంగా చట్టసభల్లో ప్రస్తావించడం ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించాలని కానీ, విదేశీ పర్యటనల్లో దేశ విధానాలను పలుచన చేసే విధంగా ప్రసంగాలు చేయడం అనుచితమని అంటున్నారు.  

మీకు నచ్చవచ్చు:  విదేశీగడ్డపై ఇవేం వ్యాఖ్యలు.. రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. మోదీకి అన్నీ తెలుసు: రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్.!

[Rahul Gandhi, Chikago varsity speac, Contrvarsy, India  foreign policy,  Prime Minister Modi,TeluguOne]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.