ఈ తమిళ ఓవర్ యాక్షన్ మండిపోనూ
Publish Date:Jun 15, 2015
Advertisement
ఈ తమిళ సాంబర్ తంబీల ఓవర్ యాక్షన్ సినిమా తెరమీదే చూడలేక అల్లాడతాం. రియల్ లైఫ్‌లో వాళ్ళ ఓవర్ యాక్షన్ చూడాలంటే రెండు కళ్ళు చాలవు... ఉదాహరణ కావాలంటే మొన్నామధ్య ఏపీలో జరిగిన ఎర్రచందనం దొంగల ఎన్‌కౌంటర్ని గుర్తు చేసుకోవచ్చు. ఎర్రచందనం దుంగలతోపాటు అడ్డు వచ్చిన అధికారులను కూడా అడ్డంగా నరికేసే హంతక ముఠా అది. ఆ ముఠాని ఎన్‌కౌంటర్ చేసేస్తే దానిమీద తమిళనాడులో ఈ సాంబారు తంబీలు చేసిన గొడవ అంతా ఇంతా కాదు. ఆంధ్రుల ఆస్తులను ఎంత ధ్వంసం చేసింది, అక్కడి రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ మీద ఎంత దుమ్మెత్తి పోసిందీ చూశాం. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఎర్రచందనం దొంగలకు రెండేసి లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి అక్కడి ప్రభుత్వం తరిస్తే, ఎన్‌కౌంటర్ చేసిన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక్కొక్కరికి ఐదులక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఓవర్ యాక్షన్ డిమాండ్ చేసిన గొప్పోళ్ళు వాళ్ళు. ఇంత ఓ.యా. ఉంది కాబట్టే శ్రీలంకలో వీళ్ళు ఉండటానికి వీల్లేదని తన్ని తరిమేశారు. వీళ్ళని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్న ప్రభాకరన్‌ని ఫ్యామిలీతో సహా లేపేశారు. పాపం తోటి భారతీయులను అలా అనడం తప్పు కదూ అనిపించవచ్చు. అయితే వారు చేసే ఓవర్ యాక్షన్ చూస్తుంటే వాళ్ళని ఏమి అన్నా తప్పు లేదని అనిపిస్తూ వుంటుంది.
నరహంతకులు, ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల పరువు తీసిన ప్రభాకరన్ విగ్రహాన్ని తమిళనాడులో ఎక్కడో ఏర్పాటు చేస్తే తమిళ పోలీసులు దాన్ని తీసి అవతల పారేశారు. దాంతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఓ తమిళ సంస్థకి కోపం వచ్చేసింది. తమిళనాడులో ప్రభాకరన్ విగ్రహం వుండటం తప్పయితే, ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి విగ్రహాలేవీ వుండకూడదని తీర్మానించేసింది. అలాంటప్పుడు వేరే రాష్ట్రం నుంచి వచ్చి తమిళ సినిమా రంగాన్ని ఏలి, తమిళనాడు ముఖ్యమంత్రిగా హవా నడిపించిన ఎంజీఆర్ విగ్రహాలు ఎక్కడైనావుంటే వాటిని ధ్వంసం చేసి వాళ్ళ ముచ్చట తీర్చుకోవచ్చు. కానీ వాళ్ళ చూపు చెన్నైలో వున్న శోభన్ బాబు విగ్రహం మీద పడింది. దాన్ని ధ్వంసం చేస్తామని బెదిరింపు హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. శోభన్ బాబు విగ్రహం జనాల డబ్బుతో, ఏ రోడ్డు మధ్యలోనో ఏర్పాటు చేసింది కాదు. ఆయన సొంత స్థలంలో, ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ విగ్రహం. ఆ విగ్రహం మీదకన్ను పడిన తమిళ సాంబారోళ్ళని ఏమనాలి? లక్షలాది మంది మరణించడానికి కారణమైన ప్రభాకరన్‌కి, కళాకారుడిగా జీవించిన శోభన్‌బాబుకు లింకుపెట్టిన వీళ్ళని ఎలా తిడితే ఆవేశం తగ్గుతుందంటారు?
http://www.teluguone.com/news/content/shobhan-babu-statue-45-47429.html





