ఎవరీ క్యాష్‌గిరిబాబు..? పవర్ బ్రోకర్స్ యాక్టివ్ అయ్యారా? 

Publish Date:Aug 26, 2024

Advertisement

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

వెల్‌కమ్ టు జర్నలిస్ట్ లాండ్రి. చంద్రబాబు పాలనలో ఒక అవినీతి అనకొండ గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. ఎం.వి.శేషగిరిబాబు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. శేషగిరిబాబును ఆయన కింద పనిచేసే సిబ్బంది ప్రేమతో ‘క్యాష్‌గిరిబాబు’ అని పిలుచుకుంటారంట. అత్యంత వివాదాస్పద అధికారిగా ఆయన పేరు గడించారు. తన శాఖలోని సిబ్బందిని అంతులేని వేధింపులకు గురిచేస్తారని ‘మంచి’ పేరు వుంది. గతంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి మీ సామాజికవర్గం అంటే ఇష్టం వుండదు. మీకు మీరు కోరుకునే పోస్టింగ్‌లపై ఆశ వదులుకోండి అని అధికారుల మొహమ్మీదే చెప్పేంత తెంపరితనం ఈ ఐఏఎస్ సొంతం. కేవలం జగన్‌ రెడ్డికి ఆ సామాజికవర్గం అంటే ఇష్టం వుండదు కాబట్టి, శేషగిరి అలా మాట్లాడ్డం కాదు. ఈయనగారిక్కూడా కమ్మ సామాజికవర్గం అంటే నరనరానా అంతులేని ద్వేషం అని చెప్పుకుంటారు. నిజానికి ‘క్యాష్‌గిరిబాబు’ జగన్ రెడ్డికి వీరభక్తుడు. జగన్ పాలనలో కొత్త విద్యా విధానాలు, బడులకు రంగులు వేయడం వంటి జగన్ లేకి పనులకు గొప్ప సంస్కరణలు అంటూ బహిరంగ సమావేశంలో మైకు ముందు విపరీతంగా పొగిడిన వీరభక్తుడు ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఒక బహిరంగ సమావేశంలో ‘క్యాష్‌గిరిబాబు’ నోటి నుంచి రాలిన ముత్యాలు ఇవిగో... ‘‘విద్యారంగంలో పలు విప్లవాత్మకమైన, వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి, సామాన్యులకు కూడా నాణ్యమైన విద్య అందించాలనే తపనతో, ప్రత్యేక శ్రద్ధతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, పాఠశాలలను, కళాశాలలను ఆధునీకరించడం, డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిటల్ బోధనను ప్రవేశపెట్టడం లాంటి అనేక వినూత్న సంస్కరణలతో  ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యకు అనేక అంశాల్లో కేటాయింపులు చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు’’. భజన పీక్స్‌లో వుంది కదూ!

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన స్థాయి తగ్గించుకుని మరీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్‌గా వచ్చారు. ఎవరైనా కావాలని స్థాయి తగ్గించుకుంటారా? మరి శేషగిరి ఎందుకు తగ్గించుకున్నారు? ఎందుకంటే, ముందే చెప్పుకున్నట్టు ఆయన క్యాష్‌గిరి కాబట్టి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఏ స్థాయిలో అవినీతి వుంటుందో మీకు తెలియనిది కాదు. ఈయన గారిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్‌గా ఎవరి సిఫారసుతో నియమించారు? ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియకుండా లేదా రెవెన్యూ మంత్రికి తెలియకుండా నియామకం జరిగిందా? ఒక పవర్ బ్రోకర్‌కు పైసలు చెల్లించి ఈ స్థానంలోకి వచ్చారనే వార్త పెద్ద ఎత్తున ప్రచారంలో వుంది. కమిషనర్ పదవిలోకి వచ్చీ రాగానే సబ్ రిజిస్ట్రార్ల పోస్టింగ్‌లో కాసుల కమీషన్ల వేట ప్రారంభించారు. ఆ కలెక్షన్ కోసం తన సామాజికవర్గానికి చెందిన ఒక ఆడిట్ రిజిస్ట్రార్‌ను తన ఏజెంట్‌గా నియమించుకుని, రెవిన్యూ మంత్రికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియకుండా సబ్ రిజిస్ట్రార్ల బదిలీల ప్రక్రియ వేగవంతం చేశారు. రాష్ట్రంలో అత్యంత ఆదాయాన్నిచ్చే విజయవాడ బెంజ్ సర్కిల్ సబ్ రిజిస్ట్రార్‌ను బదిలీ చేశారు. దానికి పాత డిప్యుటేషన్లు రద్దు చేస్తున్నాం అని కలరింగ్ ఇచ్చారు. వాస్తవానికి అక్కడ పనిచేస్తున్న అధికారి గతంలో వైసీపీ వేధింపుల దాష్టీకానికి గురైన వ్యక్తి కావడం విశేషం. హైకోర్టు అతని సర్వీసు రికార్డును పరిశీలించి, ప్రభుత్వానికి అతని ద్వారా వందల కోట్ల పన్ను రాబడి తెచ్చిన తీరు చూసి, ఇటువంటి అధికారిని వేధించడమా అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, మళ్ళీ అదే బెంజ్ సర్కిల్లో అతనికి పోస్టింగ్ ఇవ్వండి అంటూ ఆదేశించింది. జగన్ రెడ్డికి, శేషగిరిబాబుకు నచ్చని సామాజికవర్గం వ్యక్తి కాబట్టి బదిలీవేటు వేశారు. తనకు నచ్చినవారిని బెంజ్ సర్కిల్లో సబ్ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్‌లోకి తెచ్చారు. ఈ ఒక్క పోస్టింగ్ కోసం ఎన్ని కోట్లు చేతులు మారాయో మీ ఊహకు అందదు. రెవిన్యూ మంత్రికి తెలిసే జరిగిందా? శేషగిరిబాబు మొత్తం క్యాష్ చేసుకున్నారా అనేది తెలియాల్సివుంది. అంతేకాదు, రాష్ట్రంలో జల్లెడ పట్టి మరీ తనకు నచ్చని సామాజికవర్గానికి చెందిన ఉద్యోగస్తులను వేధింపులకు గురిచేసే పనిలో నిమగ్నమైనట్టు విశ్వసనీయ సమాచారం. 

విజయవాడలో గుణదల, గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న కృష్ణప్రసాద్, చైతన్యలను టార్గెట్ చేసి, ఆ స్థానాల నుంచి వారిని పంపించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. గతంలో వైసీపీ ప్రభుత్వానికి వీరిద్దరు అంటకాగి పనిచేసినట్టుగా వీరిద్దరిపై ఆకాశరామన్న లేఖతో ప్రచారం జరుగుతోంది. ఈ ఆకాశరామన్న ఉత్తరాన్ని గుణదల సబ్ రిజిస్ట్రార్ కృష్ణప్రసాద్‌కు రిజిస్టర్ పోస్టులో పంపించారు. ఆకాశరామన్న ఉత్తరం కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ మాత్రం పి.సురేష్, గూడవల్లివారి వీధి, డోర్ నంబర్ 27-33-43, టూ టౌన్ గవర్నర్‌పేట అని అని వుంది. వాస్తవానికి ఇది ఫేక్ అడ్రస్. ఈ ఆకాశరామన్న ఉత్తరం వెనుక పెద్ద కుట్రే వున్నట్టు తెలుస్తోంది. ఉత్తరంలో ప్రభుత్వానికి, ఏసీబీకి నివేదించామని బెదిరింపులు వున్నాయి. బలవంతపు బదిలీలకు మానసికంగా సిద్ధం చేయడం కోసమే ఈ బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. ఈ ఆకాశరామన్న ఉత్తరంలో వీళ్ళిద్దరినీ టార్గెట్ చేయడానికి అందులో పొందుపరిచిన అంశాలే అందుకు కారణం.  ప్రధానంగా ఈ ఇద్దరినీ గత ప్రభుత్వానికి తొత్తులుగా అభివర్ణించడం పరమ వింత! రాష్ట్రంలో అధిక ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా గుణదల, గాంధీనగర్‌లను పదే పదే ప్రస్తావించడం వెనుక కుట్రకోణం బయటపడుతోంది. వీరంతా కిందటి ఐజీగా పనిచేసిన రామకృష్ణకు శిష్యులుగా అపవాదు మోపారు. వైసీపీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరులంటూ పేర్కొన్నారు. మరోవైపు వీరు కమ్మకులం పేరు చెప్పుకుని, లోకేష్ పేరును చెడగొడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఇద్దరికీ కిందటి వైసీపీ ప్రభుత్వంలో మంచి పలుకుబడి వుందని, ఏసీపీని కూడా వీళ్ళు మేనేజ్ చేసేవారని చెప్పుకునేవారని... ఇలా ఒకదానికి మరొకదానికి పొంతన లేకుండా లేఖలో పొందుపరిచారు. ఈ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి పేరు పర్వతనేని నాగరాజు, పటమట పేరుతో ముగించారు. పటమటలో పర్వతనేని నాగరాజు లేరు. రిజిస్ట్రేషన్ శాఖలో ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కూడా లేవు. లేని వ్యక్తి ఎలా ఫిర్యాదు చేశారో తేలాల్సిన విషయం. కాపీ టు ఏసీబీ అని వున్న ఈ ఉత్తరం నిజంగా ఏసీబీకి పంపారో లేదో తెలియదుగానీ, గుణదల సబ్ రిజిస్ట్రార్ కృష్ణప్రసాద్‌కు పోస్టులో పంపారు. ఇలా పంపటం కూడా పైస్థాయి అవినీతి అధికారుల మైండ్ గేమ్‌లో భాగమని తెలుస్తోంది. 

By
en-us Political News

  
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.