టీటీడీ ఈవోగా శ్యామలరావుకు స్థాన చలనం.. మ్యాటరేంటంటే..?

Publish Date:Sep 9, 2025

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావును తప్పించి.. ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా తప్పించినా శ్యామలరావుకు అంతకంటే ప్రధానమైన, ముఖ్యమైనా.. ఒక రకంగా చెప్పాలంటే పోలిటికల్ గా కీలకమైన జీఏడీ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. అయితే ఎంత ముఖ్యమైనదైనా, కీలకమైనదైనా జీఏడీ పదవికి టీటీడీ ఈవోకు ఉన్న క్రేజ్, డిమాండ్ ఉండదు. ఏ ఐఏఎస్ అయినా సరే టీటీడీ ఈవోగా పని చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. అటువంటిది రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఏరికోరి నియమించుకున్న శ్యామలరావును ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పించి మళ్లీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పని చేసిన అనిల్ కుమార్ సింఘాల్ ని నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలేంటి?   అనిల్ కుమార్ సింఘాల్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీఈవోగా సమర్ధంగా విధులు నిర్వహించారు. ఆ తరువాత వచ్చిన జగన్ సర్కార్ కూడా ఆయనను  అదే పదవిలో  కొంత కాలం కొనసాగించినా, జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడిన ధర్మారెడ్డి కోసం ఆయనను తప్పించిందని అంటారు. అయితే టీటీడీఈవోగా ఐఏఎస్ అన్న సంప్రదాయాన్ని వెంటనే బ్రేక్ చేయడం ఎందుకు అనుకుందో ఏమో కానీ.. తొలుత ధర్మారెడ్డిని డిప్యూటీ ఈవోగా తీసుకువచ్చింది. మొత్తం పెత్తనం అంతా ఆయనకే కట్టబెట్టి అనిల్ కుమార్ సింఘాల్ ను డమ్మీ చేసింది. అది కూడా ఎక్కువ కాలం కొనసాగనీయలేదు.. అనిల్ కుమార్ సింఘాల్ ను తప్పించి జవహర్ రెడ్డిని తీసుకువచ్చింది. అయితే ఆ వెంటనే ఆయనను సీఎస్ ను చేసి.. ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా నియమించింది.  టీటీడీ చరిత్రలో ఐఏఎస్ కాని వ్యక్తి ఈవో కావడం బహుశా ఇదే తొలిసారి. ఆయన హయాంలో టీటీడీ పవిత్రతకు భంగం వాటిల్లిందన్న  ఆరోపణలు వెల్లువెత్తాయి. 

అయితే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలుత తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించారు. టీటీడీ ఈవోగా శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. తిరుమలలో ప్రక్షాళన ఆరంభమైంది. ప్రస్తుతం తిరుమలలో పవిత్రత, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  మరి టీటీడీ ఈవోగా శ్యామలరావును ఎందుకు తప్పించారు. తప్పించారు సరే మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్  కే అ పోస్టు ఎందుకు కట్టబెట్టారు...

ముందుగా టీటీడీ ఈవోగా శ్యామలరావుకు స్థాన చలనం గురించి చెప్పుకుంటే.. ఆయనకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి మధ్య విభేదాలే శ్యామలరావుకు స్థాన చలనానికి కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇరువురి మధ్యా విభేదాలు తొలి సారి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలోనే బహిర్గతమయ్యాయి. అప్పట్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సమీక్షకు తిరుమల వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఇరువురూ వాగ్వాదానికి దిగారు.  అయితే అప్పట్లో చంద్రబాబు ఇద్దరినీ మందలించి సర్ది చెప్పినా.. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి గోశాలలో అవుల మృతి వ్యవహారంలో వైసీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని సరిగా హ్యాండిల్ చేయడంలో శ్యామలరావు విఫలమయ్యారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అంతే కాకుండా తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఆపడంలో కూడా శ్యామలరావు విఫలమయ్యారని, ఈ విషయంలో టీటీడీ చైర్మన్ తో సమన్వయంతో వ్యవహరించకుండా ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇక తాజాగా చంద్రగ్రహణం సందర్భంగా టీటీడీ చైర్మన్ నిర్వహించిన  సంప్రదాయక కార్యక్రమానికి టీటీడీ ఈవోగా హాజరు కావలసిన శ్యామలరావు ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టడం కూడా ఇరువురి మధ్యా విభేదాలను అద్దంపట్టింది. దీంతో ప్రభుత్వం శ్యామలరావును టీటీడీ ఈవోగా తొలగించాలన్న నిర్ణయానికి వచ్చి ఆయనను బదిలీ చేసింది.  

ఇక ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ నే టీటీడీ ఈవోగా ప్రభుత్వం నియమించడానికి కారణాలేమిటన్న విషయానికి వస్తే.. టీటీడీఈవోగా గతంలో ఆయన సమర్ధంగా పని చేయడంతో పాటు చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉండటం కూడా ఒక కారణమంటారు. టీటీడీ ఈవో పోస్టు కోసం ఎందరో పోటీ పడుతున్నా.. ఆ పదవి ఆయననే వరించడానికి మరో ప్రధాన కారణంగా కేంద్రం స్థాయిలో ఆయనకు ఉన్న పలుకుబడి, అక్కడ నుంచి వచ్చిన ఒత్తిడీ కూడా కారణంగా చెప్పుకోవచ్చు. 

By
en-us Political News

  
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.