సినిమా క్రియేటివ్ గా తీస్తాడు! పబ్లిసిటీ కన్నింగ్ గా కొట్టేస్తాడు!

Publish Date:Dec 3, 2016

Advertisement

 

రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఓ స్పెషల్ ఇమేజ్! ఆయన రాక ముందు మన సినిమాలు ఒకలా వుంటే ఆయన వచ్చాక మరోలా మారాయి. అసలు ఇప్పుడు వారానికో హారర్ సినిమా జనం ముందుకి వస్తోందంటే అందుకు రాము తీసిన ఎన్నో దెయ్యం సినిమాలే కారణం! ఆర్జీవీకి ముందు టాలీవుడ్లో వయోలెంట్ మూవీస్, హారర్ మూవీస్ లేనే లేవా అంటే ... అదేం కాదు. కాని, వర్మ వచ్చాక ఆ జానర్ మూవీస్ కి భీభత్సంగా క్రేజ్ వచ్చింది!


రాము తన పాతికేళ్ల కెరీర్ లో సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువగా వివాదాలతో పేరు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా, సోషల్ మీడియా వచ్చాక ఆయన వివాదాన్ని కూడా తన పబ్లిసిటీ క్యాంపైన్ లో భాగం చేసేసుకున్నాడు! ఎలాంటి సినిమా తీసినా దానికి సంబంధించి ఏదో ఒక గొడవ రాజేయటం వర్మ స్టైల్. అది హిందీలో తీసిన సత్య అయినా, సర్కార్ అయినా, తెలుగులో తీసిన రక్త చరిత్ర అయినా, కొంత కాలం కింద జనంపైకి వదిలిన బెజవాడ అయినా... వివాదమే ఆయనే కలెక్షన్స్ సీక్రెట్!


సాధారణంగా తెలుగు సినిమా జనాలు గొడవలు అంటే భయపడిపోతారు. ఏ చిన్న కాంట్రవర్సీ అయినా తమ సినిమాకు నష్టం అని భావిస్తారు. కాని, రామ్ గోపాల్ వర్మ రివర్స్. కాంట్రవర్సీనే కాసులుగా మార్చేసుకునే టాలెంట్ ఆయనది. తాజాగా వంగవీటి సినిమా హడావిడి అలాంటిదే! ఆడియో రిలీజ్ దాకా వచ్చేసిన రౌడీయిజం బ్యాక్ డ్రాప్ మూవీ ఇప్పుడు వివాదంగా మారింది. స్వయంగా వెళ్లి వంగవీటి రంగా కూమారుడు వంగవీటి రాధను కలిసిన వర్మ... ట్విట్టర్ లో మాత్రం బేటి అంత గొప్పగా జరగలేదని పెదవి విరిచాడు. అంతే కాదు, తనను నవ్వుతూ బెదిరించే ప్రయత్నం చేశారని అన్నాడు! కాని, తాను ఇలాంటి స్మైలింగ్ వారెంట్ లకు జడవనని చెప్పుకొచ్చాడు!


అసలు వంగవీటి సినిమా విషయంలో ఎవరికి అభ్యంతరాలున్నా ఇంత కాలం సినిమా షూటింగ్ హ్యాపీగా జరిగేదే కాదు. ఎందుకంటే, ఆర్జీవీ ముహూర్తం షాట్ నుంచీ అన్నీ చెప్పే చేస్తున్నాడు. కాని, మొత్తం అంతా అయిపోయాక ఆడియో టైంలో వంగవీటి ఫ్యామిలీని కలవటం, దేనికి సంకేతం? దాని వల్ల ఉపయోగం ఏంటి? వాళ్లు వారెంట్ ఇవ్వటం, వర్మ భయపడకపోవటం... ఇవన్నీ మీడియాలో సినిమా పేరును మార్మోగేలా చేసేవే తప్ప మరేం కాదు! గతంలో రక్త చరిత్ర సమయంలో కూడా అనేక మంది సినిమా గురించి అనేక కామెంట్లు చేశారు. రామూ కూడా ఇరు వైపుల వున్న కుటుంబాల్ని కలిసి మీడియా కెమెరాలకి బోలెడు ఫీడ్ ఇచ్చాడు! తనకు కావాల్సిన ఫ్రీ పబ్లిసిటీ రాబట్టుకున్నాడు!


రాంగోపాల్ వర్మ తన ప్రతీ సినిమా ముందు ఏదోలా వార్తల్లో వుంటూ పబ్లిసిటీ సంపాదించుకోవటం తప్పా? అస్సలు కాదు. ఆ మధ్య వచ్చిన లో బడ్జెట్ మూవీ ఐస్ క్రీం విషయంలో కూడా వర్మ పెద్ద గొడవే చేశాడు. అప్పుడు అతి చేసే రివ్యూవర్లని ఏకీపారేశాడు. ఆ దెబ్బకి ఐస్ క్రీం సినిమా వచ్చిందని  కూడా తెలియని వారికి సైతం మ్యాటర్ తెలిసి పోయింది. బెజవాడ రౌడీలు అంటూ కూడా అలాగే చేశాడు. చివర్లో రౌడీలు అనే పదం తీసేసి థియేటర్స్ లో వదిలాడు. మొత్తం మీద ఇది మంచి తెలివైన పద్ధతనే చెప్పుకోవాలి! ఒక్క వివాదం ఇచ్చే ఫ్రీ పబ్లిసిటీ బోలెడు ట్రైలర్స్, వాల్ పోస్టర్స్, ఇంటర్వ్యూస్ ... ఏవీ తెచ్చి పెట్టవు! ఆ విషయం రామూకి బాగా తెలుసు... 
 

By
en-us Political News

  
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.