పవన్ కేసీఆర్‌ని ప్రశంసించానికి కారణం ఏంటీ?

Publish Date:Apr 11, 2016

Advertisement

సంచలనాలకు కేంద్ర బిందువైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన ప్రసంగంతో సంచలనం సృష్టించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలైన సందర్భంగా పవన్ వివిధ ఛానెళ్లకు ఇంటర్వూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో పవన్ తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది రాజకీయ వర్గాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.  కేసీఆర్ సమర్థ పాలన అందిస్తున్నారని.. రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌లో  సెటిలైన  సీమాంధ్రులకు  సమప్రాధాన్యమిస్తూ సానకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సెటిలర్లను కంటికి రెప్పలాగా కాపాడుతున్నారని, వారిపై ఈగ వాలనీయడం లేదని అన్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ నాయకత్వ పటిమ బాగుందని అన్నారు.

 

ఇదే పవన్ జనసేన ఆవిర్భావ సభతో పాటు 2014 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌పైనా ఆయన కుటుంబంపైనా మాటల తుటాలు పేల్చారు. వరంగల్ సభలో తెలంగాణ నడిబొడ్డున నిలబడి చెబుతున్నా..నీ తాట తీస్తా అని పవన్ హెచ్చరించారు. దానికి కౌంటర్‌గా కేసీఆర్ కూడా తెలంగాణ గడ్డ మీద నిలబడి కేసీఆర్‌దే తాట తీస్తనంటున్నాడు వాడెంతున్నాడు. చిటికెస్తే వెయ్యితునకలు అవుతాడు అంటూ ఘాటుగానే విమర్శించారు. ఇలా కొంతకాలంపాటు కేసీఆర్ కుటుంబం పవన్‌ని టార్గెట్ చేసింది. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో టీఆర్ఎస్ వరుస విక్టరీలు తదితర కారణాలతో పవన్ ఆలోచనలో పడ్డారు. దీంతో దూకుడు తగ్గించి కేసీఆర్ కుటుంబం పట్ల మెత్తబడినట్టు కనిపిస్తోంది. అందుకే ప్రెస్ మీట్‌లో కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.