రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి: సీఎం చంద్రబాబు

Publish Date:Oct 21, 2026

Advertisement

శాంతిభద్రతల పరిరక్షణలో ఏపీ పోలీసు శాఖ దేశానికే ఆదర్శంగా నిలవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు. నేరస్తులకు పోలీసు యూనిఫాం చూస్తే భయం కలగాలని, బాధితులకు భరోసా ఏర్పడాలని ముఖ్యమంత్రి  అన్నారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగించే పరిస్థితులు కల్పించాలని పోలీస్ శాఖకు సూచించారు.  మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో బుధవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. 

అనంతరం పోలీసులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఖాకీ అంటే బాధ్యత.. పోలీసు అంటే భరోసా అని సీఎం పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి పోలీసులే ధైర్యం, స్థైర్యమని అన్నారు. ప్రమాదం జరిగినా, నేరం జరిగినా ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులేనని చెప్పారు. ప్రజల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేందుకు పోలీసులు తమ కుటుంబాల పండుగలకు దూరమవుతున్నారని అన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్, వీఐపీల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు.

 

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దసరా ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా ప్రజలు నిర్వహించు  కోవటంలో పోలీసుల నిరంతర శ్రమ అభినందనీయమని అన్నారు. 1959 అక్టోబరు 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ పదిమంది పోలీసులు వీరమరణం పొందారని, వారి త్యాగానికి గుర్తుగా ఏటా ఈ రోజును పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను స్మరించుకోవడం కేవలం సానుభూతి కాదని, సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.

 శాంతిభద్రతలతోనే పెట్టుబడులు.!

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని చంద్రబాబు అన్నారు. గతంలో ఫ్యాక్షన్‌ను నియంత్రించడంలో, నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో, మత కలహాలను అరికట్టడంలో పోలీసులు అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని గుర్తుచేశారు. శాంతిభద్రతలు, అభివృద్ధి, ఉపాధి, ప్రజల సుఖసంతోషాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని చెప్పారు. భద్రతపై నమ్మకం ఉన్న ప్రాంతాలకే పెట్టుబడులు వస్తాయని, పరిశ్రమలు ఏర్పాటై ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. 

అందుకే తాను అధికారంలో ఉన్నప్పుడల్లా శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ఇటీవల ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దేశ భద్రతకు భంగం కలిగించే కుట్రలను ఛేదించి పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచిందని అభినందించారు. పోలీసు విధుల్లో ధైర్యంతోపాటు మానవత్వం కూడా అవసరమని సీఎం సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో వస్తారని, కొందరు భయంతో, మరికొందరు కన్నీళ్లతో వస్తారని చెప్పారు. 

వారి సమస్యలను సానుభూతితో విని, గౌరవంగా వ్యవహరించి, సత్వర పరిష్కారం చూపాలని కోరారు. పోలీసుల తక్షణ స్పందన ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని పేర్కొన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షించకూడదని, రాజకీయాలు నేరస్థులకు రక్షణ కల్పించకూడదని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీలు, సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తత.!

నేరాలకు పాల్పడే పద్ధతులు మారుతున్నందున దర్యాప్తు విధానాల్లోనూ మార్పులు రావాలని చంద్రబాబు అన్నారు. ఒక్క ఫోన్‌కాల్‌, లింక్‌, సందేశంతో జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్‌ నేరగాళ్లు దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్నవారు సైతం ఈ మోసాలకు బలి అవుతున్నారని అన్నారు. నేరాలను ఛేదించడం పోలీసుల సమర్థతకు నిదర్శనమైతే, అవి జరగకుండా నివారించడం అత్యుత్తమ పోలిసింగ్ కు నిదర్శనమని పేర్కొన్నారు. 

సీసీ కెమెరాల ద్వారా నేరాలను గుర్తించడంతోపాటు, డేటా విశ్లేషణతో వాటి వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీయాలని సూచించారు. డ్రోన్ల వినియోగాన్ని నిఘా సహా వివిధ అవసరాలకు విస్తరించాలని చెప్పారు. ఏఐ లాంటి సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఏపీ పోలీసులే అగ్రగాములనే గుర్తింపు దేశవ్యాప్తంగా రావాలని ఆకాంక్షించారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్య సాధనలో పోలీసుల పాత్ర కీలకమని సీఎం పేర్కొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్‌ బృందం చేస్తున్న కృషిని అభినందించారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మహిళలకు భద్రత కల్పించ లేకపోతే ప్రయోజనం లేదని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడాలంటేనే నేరస్థులు భయపడే పరిస్థితి తీసుకురావాలని సూచించారు.

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా.!

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని చెప్పారు. తీవ్ర ఒత్తిడితో పనిచేసే పోలీసులు యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. పోలీసు అమర వీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

అమరుల త్యాగాలకు ఘనమైన నివాళి అర్పించాలంటే ప్రజలకు నిరంతర భద్రత కల్పించడమే మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగల పూడి అనిత, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా తదితరులు అమర జవాన్‌ స్మృతిచిహ్నం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. షహీద్‌ పుస్తక్‌ టోలీ, అమరులు వారు పుస్తకాలను ఆవిష్కరించారు. పోలీసు సంస్మరణ నిధికి సీఎం విరాళం అందించారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి, ఫోరెన్సిక్‌, విపత్తు నిర్వహణ పరికరాలు, ఆక్టోపస్‌ సహా ఇతర విభాగాల ఆధునిక ఆయుధాల వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు. నిఘా వ్యవస్థలో డ్రోన్ల వినియోగాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు.

 

 

 

[ Police Commemoration Day, CM Chandrababu Naidu, Home minister Anitha, Andhra Pradesh Police, Police Commemoration Day, Law and Order, Mangalagiri APSP Battalion, Cybercrime Prevention, Telugu One,Telugu News ]


 

By
en-us Political News

  
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
  అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఉప్పాడ  తీరంలో సముద్రం ప్రళయ భీకరంగా మారింది. రాకాసి అలల తాకిడికి  బీచ్ రోడ్డు కోతకు గురైంది. బండరాళ్లు సైతంకొట్టుకుపోయాయి. పల్లిపేట, రంగంపేట గ్రామాలను సముద్ర నీరు ముంచెత్తింది.  తుపాను తీరం దాటినా దాని ప్రభావం మరో 12 గంటల పాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఆరువేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇంచుమించుగా జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ దాదాపు స్తంభించిపోయింది.
అర్నబ్ తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
మూడు దశాబ్దాల తర్వాత కడప జడ్పీ పీఠం టీడీపీకి దక్కేనా.?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.