కడప వైసీపీలో ముసలం

Publish Date:Apr 6, 2015

Advertisement


వైసీపీ నాయకుడు జగన్ వైఖరి రాష్ట్ర ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది. ఇటీవలి కాలంలో మరీ ముదిరిపోయిన ఆయన వ్యవహార శైలి జనానికి చిరాకు తెప్పిస్తోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఈ ప్రాజెక్టుల విషయంలో జగన్ తీరును తప్పుపడుతున్నారు. రాయలసీమ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే జగన్ మాత్రం ఆ ప్రాజెక్టువల్ల రాయలసీమకు ఎంతమాత్రం ఉపయోగం లేదని వాదించడం మొదలుపెట్టడంతోపాటు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి, పట్టిసీమ ప్రాజెక్టు వేస్టు అని చెప్పడం ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను వ్యతిరేకించడంతోపాటు ఆ ప్రాజెక్టులను ఇరుగు పొరుగు రాష్ట్రాలు అడ్డుకునేలా ఐడియాలు కూడా ఇస్తున్న జగన్ని ఏమనాలో అర్థంకాక ఆయన వైఖరిని గమనిస్తూ వున్నారు. అయితే జగన్ వ్యవహార శైలి ప్రజలకు ఎంత ఇబ్బందిగా మారిందో, ఆయన పార్టీలోని నాయకులకు కూడా అంతే ఇబ్బందిగా మారింది. జగన్ ఎలాంటి వృధా ఆందోళనలు చేసినా ఆయన వెంట నిలిచిన ఎమ్మెల్యేల్లోనే ఇప్పుడు తిరుగుబాటు వస్తోంది. ముఖ్యంగా పట్టిసీమ విషయంలో రాయలసీమలోని వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వైఖరిని సమర్థించడం లేదు. మొన్నటి వరకూ గుంభనంగా వున్న ఆ నిరసన ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అది వైసీపీ పాలిట ముసలంగా మారే అవకాశాలను కూడా తీసిపారేయలేం.

వైఎస్ జగన్ పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ ఎమ్మెల్యే జగన్ వైఖరికి వ్యతిరేకంగా గళం విప్పారు. జగన్ కంచుకోటగా భావించే కడప జిల్లాకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు) జగన్ వైఖరిని పరోక్షంగా తప్పుపడుతూ, పట్టిసీమ ప్రాజెక్టుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు మేలు జరుగుతుందని ఘంటాపథంగా చెప్పడంతోపాటు పట్టిసీమ కోసం ప్రత్యేక నిధుల కేటాయించాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  పట్టిసీమపై ప్రత్యేక చట్టం తెచ్చి ప్రాజెక్టును పటిష్టం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జగన్‌కి వ్యతిరేకంగా ఆదినారాయణరెడ్డి పట్టిసీమను సమర్థించడం జగన్‌కి పెద్ద షాక్. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి ఒక్కరే బయటపడ్డారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా జగన్ వైఖరిని వ్యతిరేకిస్తున్నారని, సమయం, సందర్భం చూసుకుని వారు కూడా జగన్ని వ్యతిరేకిస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ జగన్ పార్టీలో ముసలం పుట్టింది... ఇక ముందు ముందు ఏం జరగబోతోందో వేచి చూడాలి.

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.