ప్రధాని టీ తాగిన కప్పు దేవుడి మందిరంలో: రికవరీ ఏజెంట్లు గుమ్మంలో.. దయనీయంగా మీరా మాఝీ కుటుంబం.!

Publish Date:Nov 11, 2026

Advertisement

అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ స్దయంగా వారి ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి ఇల్లాలు మీరా మాఝీ స్వయంగా తయారు చేసి ఇచ్చిన టీ తాగారు. ఆమె తయారు చేసిన టీ రుచిని పొగిడారు. వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా వారి అర్హతను బట్టి అన్ని పథకాలూ అందిస్తానని హామీ ఇచ్చారు.

దేశ ప్రధాని స్వయంగా తమ ఇంటికి వచ్చి తేనీరు తాగి యోగక్షేమాలు అడగడం, బాధలు తీరుతాయనీ, పథకాలు వస్తాయనీ హామీ ఇవ్వడంతో ఆ కుటుంబం ఆనందంతో పొంగిపోయింది. ఆయన టీ తాగిన కప్పును భద్రంగా, ఒక మాన్యుమెంట్ గా దాచుకుంది మీరా మాఝీ.

ఇక ప్రస్తుతానికి వస్తే.. మీరా మాఝీ కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రుణం చెల్లించాలంటూ బ్యాంకు రికవరీ ఏజెంట్లు ఆ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నాయి. వారికి ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రధాని మోడీ వారి ఇంటికి వచ్చి టీ తాగి వెళ్లడమే. ఔను నిజమే.. ఆ కారణంగానే వారి కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.

 అందుక వారి అమాయకత్వం, అవిద్య కూడా ఒక కారణమనుకోండి. అది వేరే సంగతి.  ఇంతకూ మోడీ రాకకు, వారి కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయి సతమతమవ్వడానికీ లింకేమిటంటారా?.. ఆ విషయం తెలియాలంటే, మోడీ రాక, ఆ తరువాత పరిణామాల గురించి వివరంగా తెలుసుకోవాలి. ఆ వివరాల్లోకి వెడితే..

ఇది చదవండి: అద్వానీ ప్రస్థానం అసాధారణం.. ఆయన సేవలను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ.!

 2023 డిసెంబర్ 30న అయోధ్యలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చెందిన మీరా మాఝీ ఇంటికి వెళ్లి ఆమె తయారు చేసి ఇచ్చిన టీ తాగి వారితో ముచ్చటించారు. ఆ సమయంలో ప్రధాని టీ తాగిన కప్పును ఆ కుటుంబం ఇప్పటికీ పూజా గదిలో భద్రంగా కాపాడుకుంటోంది. ఈ విషయం ముందే చెప్పుకున్నాం కదా.. ఆ తరువాత ఆ కుటుంబానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు, ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ మంజూరయ్యాయ్యి. మోడీ తమ ఇంటికి రావడం వల్లే ఆ రెండూ తమకు వచ్చాయని మీరా మాఝీ కుటుంబం మురిసిపోయింది. . ఇక   మీరా మాఝీ భర్త సూరజ్ కుమార్ మాఝీ సరయు నదిలో  వద్ద పడవ నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. మోడీ వచ్చి వెళ్లిన తరువాత అధికారులు పీఎంఈజీపీ   కింద మీరా మాఠీ కుటుంబానికి రెండు రుణాలు మంజూరు చేశారు. స్థానిక అధికారి ఒకరు మీరా మాఝీ భర్త చేత బిజినెస్ పెట్టిస్తామని కూడా చెప్పారు. దీంతో తమకు వారు ఆర్థిక సాయం చేశారని భావించారు. అంతే తప్ప అది రుణం అని వారికి తెలియదు. ఆ తరువాత.. రుణం బకాయిలు చెల్లించాలంటూ నోటీసుల మీద నోటీసులు రావడం ప్రారంభమైంది. ఒత్తిడి పెరిగింది. 

ఇప్పుడు మీరా మాఝీ కుటుంబం ఏమంటోందంటే.. మోడీ మా ఇంటికి రాకుండా ఉన్నా బాగుండేదని. ఆయన రాక ముందు తమ పరిస్థితి ఎంతో బాగుండేదనీ మీరా మాఝీ చెప్పారు. ఆయన వచ్చిన వెళ్లిన తరువాతే తమకు కష్టాలు మొదలయ్యాయని చెబుతున్నారు. అధికారులు అనవసర ఆర్భాటంతో తాము అడగకుండా, ఇస్తున్నది రుణం అని కూడా చెప్పకుండా సొమ్ములిచ్చి, ఇప్పడు అది అప్పు తీరుస్తారా, ఛస్తారా అంటూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రధాని ఇంటికి వచ్చి వెడితే మేలు జరుగుతుందనుకున్నాం, కానీ ఇలా ఇక్కట్లు, ఇబ్బందుల పాలౌతామని అనుకోలేదని మీరా మాఝీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:  బ్యాలెట్ లోనూ కాంగ్రెస్ జీరోయే: గ్రాండ్ ఓల్డ్ పార్టీ రాజకీయ దైన్యతకు దర్పణం.!

మతి ఉండే చేస్తున్నారా: కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీం ఫైర్.!

[Meera Majhi Family in Trouble After Modi Visit, Ayodhya, PM Modi Tea Guest, PMEGP Loan Recovery, Financial Struggle, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.