రాహుల్‌కు ముందే పుట్టిన మగబిడ్డ.. తొలి కాన్పుపై సోనియా భావోద్వేగ జ్ఞాపకాలు.!

Publish Date:Nov 11, 2026

Advertisement

నా బిడ్డను నదిలో పడేయడమా?: ఆత్మకథలో సోనియా సంచలన విషయాలు.!

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన జీవితంలోని అత్యంత విషాదకరమైన  ఎవరికీ తెలియని రహస్యాలను తన తాజా ఆత్మకథ ద్వారా వెలుగులోకి తెచ్చారు. రాజకీయ రంగానికి దూరంగా ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదురైన కఠిన సత్యాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

తాను రచించిన ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకంలో సోనియా గాంధీ తన ప్రథమ సంతానానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాను తొలిసారి తల్లికాబోతున్నానని తెలిసినప్పుడు గాంధీ కుటుంబంలో నెలకొన్న ఆనందోత్సాహాలను ఆమె గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ అత్యంత గంభీరంగా కనిపించే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైతం ఆ వార్త విని ఎంతో సంతోషించారని తెలిపారు.

అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణీత గడువు కంటే రెండు నెలల ముందే తనకు సాధారణ ప్రసవం జరిగిందని, ఆ సమయంలో జన్మించిన మగబిడ్డ కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే జీవించి లోకాన్ని వీడాడని ఆమె తెలిపారు. ఇంక్యుబేటర్‌లో ఉన్న ఆ పసికందు మొదటి ఏడుపు తాము విన్నామని, ఆనందం ఆవిరైపోవడానికి ఎంతో సమయం పట్టలేదని ఆమె కంటతడి పెట్టారు.

చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో బతుకుతుందనే ఆశలు సన్నగిల్లాయని వైద్యులు చెప్పిన క్షణాలు తమను కుంగదీశాయని సోనియా పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం రాజీవ్‌ గాంధీ తన వద్దకు వచ్చి బిడ్డను కాపాడుకోలేకపోయినట్లు చెప్పగానే తాము గుండె పగిలేలా రోదించామని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ తన పర్యటనలను తక్షణమే రద్దు చేసుకుని వచ్చి తమను ఓదార్చారని చెప్పారు.

ఆ పసికందు అంత్యక్రియల విషయంలోనూ కుటుంబం ఎన్నో సంకట పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చిందని సోనియా తెలిపారు. హిందూ, క్రిస్టియన్‌ లేదా పార్సీ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలపై చర్చలు జరిగాయని, ఆ పసికందు మృతదేహాన్ని నదిలో వదిలేయాలనే యోచన కూడా వచ్చిందని పేర్కొన్నారు. అయితే తన బిడ్డను నదిలో పడేసేందుకు తాను ఏమాత్రం అంగీకరించలేదని స్పష్టం చేశారు.

చివరకు ఆ చిన్నారి పార్థివ దేహాన్ని మెహ్రౌలీలోని ఫిరోజ్‌ గాంధీ వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశామని సోనియా వెల్లడించారు. ఆ తీవ్ర విషాదం నుంచి కోలుకుంటున్న తరుణంలో ప్రతిపక్ష పత్రికల్లో వచ్చిన కొన్ని విమర్శనాత్మక కథనాలు తన మనసును మరింతగా గాయపరిచాయని ఆమె వాపోయారు. కాలక్రమేణా ఆ బాధను దిగమింగుకుంటూ ముందుకు సాగామని తెలిపారు.

ఈ ఒడుదొడుకుల తర్వాత మళ్లీ అదే ఏడాది అక్టోబర్‌లో తాను గర్భం దాల్చినట్లు రాజీవ్‌కు చెప్పానని సోనియా గుర్తుచేసుకున్నారు. భయంతో కూడిన ఆందోళనల నడుమ చివరకు 1970 జూన్‌ 19న రాహుల్‌ గాంధీ జన్మించారని ఆమె తెలిపారు. నాటి ఆ సంక్షోభాలు, కుటుంబ మద్దతు రాజకీయ నేపథ్యంలో ఓ చారిత్రక అధ్యాయంగా నిలిచాయని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి:  విజయసాయి కొత్త పార్టీ పీఆర్ పీ: ఏపీ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యమని ప్రకటన.!

 

 

 

[ Sonia Gandhis autobiography, Belonging a Journey of Love, Rajiv Gandhi Sonias first child, Indira Gandhis daughter-in-law, Sonia Gandhis personal life, Telugu One, Telugu News ]


 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.