సంక్రాంతి తరువాత టీడీపీలోకి చేరికలే చేరికలు!!

Publish Date:Jan 10, 2019

Advertisement

 

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇన్నిరోజులు ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపైనే ఎక్కువ దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఇక నుంచి పార్టీ కార్యకలాపాలపైన ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చంద్రబాబు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది. వైసీపీ, జనసేన పార్టీల ప్రభావం ఉన్నచోట ప్రత్యామ్నాయంగా ఎవరిని తెరపైకి తీసుకురావాలి అనే అంశాలపై ఇప్పటికే చంద్రబాబు ఫోకస్ పెట్టారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు, మాజీమంత్రి అహ్మదుల్లా, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరిలను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు.

అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీలో చేరతానని చంద్రబాబుకు స్పష్టం చేశారు. టీడీపీ సముచిత స్థానం కల్పిస్తానని చంద్రబాబు సైతం ఆమెకు హామీ ఇచ్చారు. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు సైతం త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. మాజీమంత్రి అహ్మదుల్లా సైతం అధికార టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన అహ్మదుల్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ముస్లిం సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేపథ్యంలో ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలోనే అహ్మదుల్లా టీడీపీలో చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి సైతం టీడీపీలో చేరేందుకు ఆసక్తి  చూపుతున్నారు. ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో చంద్రబాబును సబ్బం హరి ప్రశంసిస్తూ వస్తున్నారు. పలుమార్లు కలిసి అభినందించారు కూడా. ఇటీవలే డిసెంబర్ 31న చంద్రబాబును ఆయన నివాసంలో సబ్బం హరి కలిశారు. తాను టీడీపీలో చేరతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైతం టీడీపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు పని తీరును మెచ్చుకున్న కొణతాల.. జనవరి 18న టీడీపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా కమెడియన్ అలీ కూడా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతి తరువాత టీడీపీలోకి భారీగానే చేరికలు ఉండేలా ఉన్నాయి.

By
en-us Political News

  
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.