వాళ్ళందరి నోళ్ళు కేసీఆరే మూయించాలి

Publish Date:May 6, 2015

Advertisement



తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఏం మాట్లాడినా దాన్ని కామెడీగా చూడటం, కామెంట్లు చేయడం చాలామందికి అలవాటైపోయింది. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు, ఆచరణ సాధ్యం కాని మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఒకపక్క కేసీఆర్ బంగారు తెలంగాణను సాధించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దీనికి అర్థం చేసుకోలేని చాలామంది ఆయన మాట్లాడిన మాటలకు పెడర్థాలు తీస్తూ ఆనందిస్తున్నారు. అలాంటి వారినోళ్ళు మూయించాల్సిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వుంది. ఆమధ్య కేసీఆర్ ఒక్క ఎకరం భూమిలో వ్యవసాయం చేసి కోటి రూపాయలు సంపాదించవచ్చని తన ఫామ్ హౌస్ సాక్షిగా చెప్పినా నమ్మకుండా ఎటకారంగా, ఏళాకోళంగా కామెంట్లు చేశారు. ఈ వేసవిలో హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయిస్తానని అంటే అది అయ్యేపని కాదని అన్నారు. సచివాలయాన్ని మారుస్తానంటే అర్థంలేని పని అన్నారు. అసలు ఇలాంటివాళ్ళ ఉద్దేశమేంటి? కేసీఆర్ ఏం మాట్లాడినా దాంట్లోంచి పెడర్థాలు తీయడమేనా? లేటెస్ట్‌గా కేసీఆర్ తాను 70 వేల నుంచి 80 వేల పుస్తకాలు చదివానని చెప్పగానే ఈ విమర్శకులు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

కేసీఆర్ చెప్పిన ఈ మాటను పట్టుకుని ప్రతిపక్ష నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఎటకారంగా మాట్లాడుతున్నారు. పుట్టిన దగ్గర్నుంచి రోజుకో పుస్తకం చదివినా అన్ని పుస్తకాలు చదవడానికి వీలు కాదని అంటున్నారు. కేసీఆర్ చెప్పిన వందలాది అబద్ధాలలో మరో అబద్ధం చేరిందని విమర్శిస్తున్నారు. ఇలా విమర్శించడం అన్యాయం, దారుణం, ఘోరం. కేసీఆర్ని విమర్శించేవారు 70 నుంచి 80 వేల పుస్తకాలు చదవలేరేమోగానీ, కేసీఆర్ చదవగలరు. ఆయనకు ఆ శక్తి వుంది. ‘రోబో’ సినిమాలో రజనీకాంత్‌లా చదివే శక్తి ఆయనకు వుందేమో. ఆయన్ని విమర్శించేవాళ్ళకు ఈ విషయం తెలియకపోవచ్చు కదా. కేసీఆర్ నిజంగానే 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివే వుంటారు. నో డౌట్ ఎందుకంటే, ఆయన ప్రదర్శించే అపారమైన జ్ఞానం, చక్కని మాటతీరు, సంస్కారబద్ధంగా వుండే ప్రవర్తన, ఇతరులను గౌరవించే తీరు... ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి వుంటాయనుకుంటున్నారు? ఆయన చదివిన 70 నుంచి 80 వేల పుస్తకాల నుంచే వచ్చి వుంటాయి. అంచేత, కేసీఆర్ని విమర్శిస్తు్న్నవాళ్ళు ఇప్పటికైనా తమ తప్పు  తెలుసుకోవాలి. కేసీఆర్ శక్తిని తక్కువ అంచనా వేయడం మానుకోవాలి. కేసీఆర్ గారూ, మీరు విమర్శకులను ఎంతమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకిప్పుడు 65 సంవత్సరాలు. మీరు నిండు నూరేళ్ళు బతుకుతారు. బ్యాలన్స్ వున్న ఈ 35 ఏళ్ళలో మిగిలిన ఆ 20 నుంచి 30 వేల పుస్తకాలు కూడా చదివేసి, మొత్తం లక్ష పుస్తకాలు చదివిన ఘనతని సొంతం చేసుకోండి. విమర్శకుల నోళ్ళు మూయించండి.

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.