భారతంపై భారతీయుడి కామెంట్స్ తప్పా... ఒప్పా!

Publish Date:Mar 17, 2017

Advertisement

భారత దేశం ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ వుండేవారికి భావప్రకటనా స్వాతంత్ర్యం వుంటుంది. దీనిపై ఎవరికీ సందేహం లేదు. కాని, మనకున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ని ఎలా వాడుకోవాలి? దీనిపైనే అసలు సమస్యంతా ఆధారపడి వుంది! మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు తమ భావప్రకటన ఎలా చేయాలి? ఇందులో ఎలాంటి క్లారిటీ లేదు. అందుకే, రంగులు మార్చే రాజకీయ నేతలు మొదలు రంగులు వేసుకునే సినిమా వాళ్ల వరకూ అందరూ రోజుకో వివాదాస్పద వ్యాఖ్య చేస్తుంటారు. జనం గగ్గోలు పెడుతుంటారు. కొన్నాళ్లకి అంత కూల్ అయిపోతుంది. మళ్లీ మరో గొడవ మొదలవుతుంది!

 

కమల్ హసన్ మన దేశానికి ఖచ్చితంగా గర్వకారణమే.కాని ఆయన పుట్టక ముందు నుంచే గర్వకారణం మహాభారతం! గత 5వేల సంవత్సరాలుగా మహాభారతం భారతీయ జీవన విధానంలోఅంతర్భాగం. అటువంటి ప్రపంచపు అతి పెద్ద ఇతిహాసాన్ని అపహాస్యం చేశాడు కమల్! ధర్మరాజు ద్రౌపతి పావులా పెట్టి జూదం ఆడి తప్పు చేశాడనీ... అలాంటి గ్రంథాన్ని భారత ప్రభుత్వం గౌరవిస్తోందని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడట. ఇంకేముంది తమిళ హిందూ సంస్థలు అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి! భగ్గున మండాయి! 

 

అసలు మహాభారతాన్ని విమర్శించి కమల్ సాధించదలుచుకున్నది ఏమిటి? అందులో జూదం వున్నందు వల్ల ఇప్పుడు సమాజం ఏమైనా ప్రభావితం అవుతోందా? ఆయన చెప్పినట్టే ఒక స్త్రీని జూదంలో పెట్టి ఆడటం తప్పు అనుకుందాం! అయినా కూడా లక్ష శ్లోకాల మహాభారతంలో ఇంకేం మంచే లేదా? ఎక్కడో ఒకటి అరా తప్పుల్ని పట్టుకుని వారసత్వ సంపద లాంటి మహాభారతాన్ని వదిలేద్దామా? ఎవరో అతివాద వామపక్ష భావజాలం వున్న వాళ్లు నోరు పారేసుకుంటే ఫర్వాలేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల టికెట్ల డబ్బులతో సెలబ్రిటీ అయిన కమల్ ఈ విధంగా మాట్లాడటం సబబేనా? ఇంతా చేసి ఆయన చేసిన విమర్శ ఏమైనా సమాజాన్ని ఉద్ధరిస్తుందా? మహాభారతం సమస్యలకి కారణమైతే బైబిల్ , ఖురాన్ ల సంగతేంటి? వాట్ని కమల్ తన భావ ప్రకటనలో భాగంగా ఇలాగే విమర్శిస్తాడా? విమర్శిస్తే కూడా మళ్లీ ఆయనకు రక్షణనిచ్చి కాపాడాల్సింది .. మహాభారతాన్ని గౌరవిస్తోందని ఆయన విమర్శించిన సో కాల్డ్ భారత ప్రభుత్వమే!

 

హిందూ సమాజం ఐక్యంగా వుండదు. కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా విడిపోయి, విభజింపబడి వుంటుంది. దాని వల్ల హిందూత్వంపై , హిందూ వారసత్వంపై , హిందూ సమాజంపై ఏ ఆరోపణలు, ఏ విమర్శలు  చేసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. ఏవో కొన్ని ప్రతి విమర్శలు తప్ప దాడులు జరిగేటంత భయం లేదు. బెంగా లేదు. అందుకే, కమల్ మహాభారతాన్ని టార్గెట్ చేస్తాడు. వర్మ గణఫతిని, శివుడ్ని టార్గెట్ చేస్తాడు. ఎంఎఫ్ హుస్సేన్ అయితే ఏకంగా దేవీదేవతల బొమ్మలు నగ్నంగా గీస్తాడు. అలాంటి వాళ్లని అందర్నీ స్వేచ్ఛావాదులు, అభ్యుదయవాదులు వెనకేసుకొస్తుంటారు. కాని, పురాణాలు, ఇతిహాసాలు, మనుస్మృతులు దాటుకుని చాలా దూరం వచ్చిన హిందూ సమాజంపై అనవసరంగా ఇలా విషం గక్కటం ఎంత వరకూ సమంజసమో కమల్ లాంటి వారే ఆలోచించాలి! మహాభారతం పై చేసినట్టే ఆయన అంబేద్కర్ మీదో, జీసస్ మీదో, మదర్ థెరిసా మీదో కామెంట్స్ చేస్తే రియాక్షన్ ఎలా వుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుని కమల్ ఇక మీదట వ్యాఖ్యానాలు చేస్తే బావుంటుంది. కాలుష్యం గురించో, అవినీతి గురించో, ఉగ్రవాదం గురించో నాలుగు మంచి మాటలు చెబితే ఆయన స్థాయికి తగ్గట్టుగా వుంటుంది! 

By
en-us Political News

  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.