రోజాకు పోటీగా జయసుధ.. గ్లామర్ ను గ్లామర్ తోనే కొట్టాలనా..?
Publish Date:Jan 19, 2016
Advertisement
ముల్లును ముల్లుతోనే తీయాలి.. గ్లామర్ ను గ్లామర్ తోనే కొట్టాలి.. ఇదెక్కడి సామెత అనుకుంటున్నారా.. ప్రస్తుతం రాజకీయ వర్గాల టాక్ ఇదే. ఈ సామెత ప్రకారమే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ధీటుగా జయసుధను టీడీపీలోకి ఆహ్వానించినట్టు ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.
సినీ నటి జయసుధ గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ మద్దతుతో "మా" ఎన్నికల్లో నిలబడి ప్రత్యర్ది సినీనటుడు రాజేంద్రప్రసాద్‌పై ఓటమిపాలైయ్యారు. ఇక ఆతరువాత
నుండి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలిగా పనిచేస్తున్నారు. అయితే మళ్లీ ఇప్పుడు టీడీపీ చేరికపై మురళీ మోహన్ ఆమెతో చర్చించడం.. టీడీపీలోకి చేరాలని కోరడంతో ఆమె కూడా దానికి అంగీకరించి టీడీపీలోకి చేరారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా జయసుధ ఎంట్రీకి ఏమాత్రం బ్రేక్ వేయకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే గతంలో రోజా టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా చురుకుగా ఉండేవారు. ఆతరువాత రోజా పార్టీ మారిపోయారు. ఇక టీడీపీలో ఉన్న కవిత, మంత్రి పీతల సుజాత ఉన్నా.. వారు రోజాకు ధీటుగా విరుచుకుపడటానికి ప్రయత్నిస్తున్నా అవేమి వర్కవుట్ కావట్లేదు. జయప్రద కూడా తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేసి..ఎంపిగా డిల్లీ స్దాయిలో వెళ్లారు. తరువాత మారిన రాజకీయ సమీకరణాలలో రోజా తెలుగుదేశం పార్టీకి దూరమై సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఇక అందుకే గ్లామర్ ను గ్లామర్ తోనే కొట్టాలని చంద్రబాబు కూడా ఆలోచించి.. తమ పార్టీలోకి చేరాలనుకున్న జయసుధకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అంతేకాదు రోజాను ఢీకొట్టడానికి జయసుధను వాడుకోబోతున్నారంట.. ఈ నేపథ్యంలోనే ఆమెను ఏపీ రాజకీయల్లో కీలకంగా చేసి రోజాపై జయసుధను అ్రస్తంగా తయారు చేయటానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట. మరి రోజా ముందు జయసుధ తట్టుకోగలదా.. రోజా మాటలకి జయసుధ అంతే ధీటుగా సమాధానం చెప్పగలదా.. చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుద్దా అన్న సందేహాలు వస్తున్నాయి. మరి చూద్దాం.. జయసుధ ఎలా రోజాను ఎదుర్కొంటుందో..
http://www.teluguone.com/news/content/jayasudha-in-tdp-45-54590.html





