జగన్ పొలిటికల్ కామెడీ...

Publish Date:Jan 20, 2015

Advertisement

 

కొంతకాలం తర్వాత గూగుల్‌లోకి వెళ్ళి Political comedian అనే మాట కొట్టి ఎంటర్ చేస్తే వైసీపీ అధినేత జగన్ ఫొటోలు కొన్ని లక్షలు కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయన చేస్తున్న కామెడీ స్థాయి అలా వుంది మరి. జగన్ తాను చేసే కామెడీలో బోలెడన్ని విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. వాటన్నిటి గురించి వీలువెంబడి మెల్లమెల్లగా ప్రస్తావించుకుందాం. ఇప్పుడు మాత్రం జగన్ చేస్తున్న ఒక కామెడీ స్కిట్ గురించి ముచ్చటించుకుందాం.

 

జగన్ ఎప్పుడు జైల్లోకి వెళ్తాడో అనే సందేహాలు ఆయన పార్టీ ఎమ్మెల్యేలలోనే వుంది. అతి త్వరలోనే జగన్ పార్టీ షట్టర్ క్లోజ్ చేసే అవకాశం కూడా వుందన్న అనుమానాలు వారిలో కలుగుతున్నాయి. అందుకే కలుగులోంచి బయటకి వచ్చే ఎలుకల మాదిరిగా జగన్ పార్టీ నుంచి బయటపడిపోతున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులు వైసీపీకి బైబై చెప్పేశారు. మరికొంతమంది తెలుగుదేశం, బీజేపీలతో బేరసారాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా ఏం చేస్తాడు? పార్టీలోంచి బతుకుజీవుడా అనుకుంటూ పారిపోతున్న వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళలో తనమీద నమ్మకం పెంచుకునేలా చేస్తాడు. అయితే జగన్ మాత్రం అలా లేడు. పార్టీలోంచి పారిపోతున్నవాళ్ళని ఆపే ప్రయత్నాలు ఎంతమాత్రం చేయడం లేదు. అయినా మన అమాయకత్వంగానీ, జగన్ ఆపినా వాళ్ళు ఆగుతారా...! తన పార్టీలో పరిస్థితి ఇలా వుంటే, జగన్ మాత్రం మరోలా ఆలోచిస్తూ కామెడీ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీలో చీలిక తెచ్చి, చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడానికి పావులు కదుపుతున్నాడు.

 

నేను ముఖ్యమంత్రినైతే 30 ఏళ్ళు పరిపాలిస్తా అని జగన్ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు ఆలు లేదు చూలు లేదు అల్లుడిపేరు జగన్ అనే కొత్త సామెత జనాల మైండులో తక్షణం పుట్టుకొచ్చింది. ఇప్పుడు జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యే ఆలోచనను పక్కన పెట్టేసి, చంద్రబాబుని ముఖ్యమంత్రి సీటు మీద నుంచి దించేసే పనిలో బిజీగా వున్నాడు. కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలతో ‘టచ్’లోకి వెళ్ళిన జగన్ వారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడట. ఆ ఆఫర్ సారాంశం ఏంటంటే, కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ ఒక్కటై తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి బయటకి రావాలి. అలా బయటకి వచ్చిన గ్రూపుకి జగన్ మద్దతు ఇస్తాడు. అలా ఆ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. అప్పుడు ముఖ్యమంత్రి పదవి జగన్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలోంచి విడిపోయిన గ్రూపు నాయకుడే ముఖ్యమంత్రి అయిపోవచ్చు.... ఇదీ జగన్ సార్ ఐడియా. ఆ ఐడియా విన్న సదరు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌ని కిందనుంచి పైకి, పైనుంచి కిందకి ఎగాదిగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. వెళ్తూ వెళ్తూ తమ చెవుల్లో జగన్‌‌కి పూలుగానీ కనిపిస్తున్నాయా అనుకుంటూ, చెవులు తడుముకుంటూ వెళ్ళిపోయారట. ఇదండీ జగన్ పథకం. వేరే పార్టీ వాళ్ళని తన పార్టీలోకి వచ్చేలా చేయడాన్ని ‘ఆకర్ష’ పథకం అంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక గ్రూపును చీల్చి, తాను ఆ గ్రూపుకి తోకలాగా వుండాలనుకుంటున్న జగన్ పథకాన్ని ‘తోకర్ష’ పథకం అనొచ్చేమో!

By
en-us Political News

  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.