జగన్ మెడికల్ రాజకీయం.. సెల్ఫ్ గోల్ అవుతుందా?

Publish Date:Oct 9, 2025

Advertisement

 ఫ్యాన్ పార్టీ మరో తప్పటడుగు వేస్తోందా ? తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి  పెట్టాలన్న తొందరలో అనాలోచితంగా వ్యవహరించి సెల్ఫ్ గోల్ చేసుకోబోతోందా?   అంటే అనకాపల్లి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా  ప్రజలు అవుననే అంటున్నారు.  ఎప్పుడైనా నాయకుడు పూర్తి చేసిన భవనం, పథకం గురించి పర్యటించి గొప్పగా చెప్పుకుంటారు గాని, అందుకు  భిన్నంగా అసంపూర్ణంగా ఉన్న మెడికల్ కాలేజ్ భవనం చూపించి జగన్ ఏం చేయాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకు ఆయన   కేవలం రాజకీయం మాత్రమే చేయబోతున్నారనీ, ఇది ఒకరకంగా వైసీపీకి   సెల్ఫ్ గోల్ అవుతుందని ఫ్యాన్ పార్టీ నాయకులు కూడా మధనపడుతున్నారు

 ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ నిర్మాణాలకు ప్రతిపా దనలు చేశారు అందులో ప్రస్తుత అనకాపల్లి లో నిర్మాణానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు కానీ ఆ స్థలం వివాదం కావడంతో అనకాపల్లికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలం భీమబోయిన పాలెం వద్ద 52.15 ఎకరాల భూమిలో 20 22 డిసెంబర్ 28న జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం 500 కోట్ల రూపాయలఅంచనాతో ఏడు అంతస్తులలో మెడికల్ కాలేజీ భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు జరిగాయి. కానీ మూడు అంతస్తులకు మాత్రమే వేయడం జరిగింది . మిగిలిన నాలుగు ఐదు భవనాలకు పిల్లర్లు వేశారు. కాంట్రాక్టర్ నిర్మాణ పనులను ఎన్నికల ముందే నిలిపివేశారు. ఇప్పటి వరకు దాదాపు పాతిక కోట్ల రూపాయలను ఈ మెడికల్ కాలేజ్ భవన నిర్మాణానికి వెచ్చించినట్టు అధికారులు తెలిపారు.

అయితే కేంద్రం ప్రతి నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణ ప్రతిపాదన చేసింది. కానీ నర్సీపట్నంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీకి సంబంధించి కేంద్రం అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు .  ఏపీలో ఏడు మెడికల్ కాలేజీలకు  దరఖాస్తులు రాగా పిడుగురాళ్ల, పాడేరు మచిలీపట్నం లో మెడికల్ కాలేజ్ నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేంద్రం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా నిర్మాణ పనులు పూర్తి చేపట్టాలని కొన్నిసార్లు ప్రభుత్వాలు భావిస్తాయి. నర్సీపట్నం మెడికల్ కాలేజీ విషయంలో కూడా అదే రీతిన జగన్ ప్రభుత్వం పనులు ప్రారంభించిందని భావించారు. అయితే తాజా కూటమి ప్రభుత్వం అసంపూర్ణంగా మిగిలిన మెడికల్ కాలేజీ లను పిపిపి పద్ధతిలో పూర్తి చేయాలని ప్రతిపాదన చేసింది.

దీన్ని సహజంగానే ఫ్యాన్ పార్టీ వ్యతిరేకించింది. ఇప్పటికే  ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి  ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయి విద్యార్థులు అడ్మిషన్ లు జరిగిన కాలేజీని కాక   అసంపూర్ణంగా ఉన్న నర్సీపట్నం కాలేజీని ఎంచుకోవడం కేవలం రాజకీయం కోసమే అని పరిశీలకులే కాదు,  కొందరు వైసిపి నాయకులు కూడా అంటున్నారు.  కేవలం స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియోజవర్గంలో రాజకీయం చేసేందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన  పెట్టుకున్నారనీ, దీని వల్ల సెల్ఫ్ గోల్ చేసుకోవడం వినా మరో ప్రయోజనం సిద్ధించదని చెబు తున్నారు.  

By
en-us Political News

  
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.