ఓవర్ కాన్ఫిడెన్సే కేసీఆర్ కొంపముంచుతుందా?

Publish Date:Nov 6, 2018

Advertisement

 

ఓవర్ కాన్ఫిడెన్స్.. కొన్నిసార్లు తీసుకెళ్లి కొండమీద కూర్చోబెడితే, కొన్నిసార్లు కొంపముంచుతుంది. ప్రస్తుతం ఆ ఓవర్ కాన్ఫిడెన్సే కేసీఆర్ కొంపముంచేలా కనిపిస్తోంది. 2014 లో కేసీఆర్ గెలిచి సీఎం అయ్యారు. తెలంగాణలో ఎదురులేని నేతగా పేరుతెచ్చుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే అధికారం అనుకున్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే వంద సీట్లకు పైగా గెలుస్తామంటూ 8 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. తొలివిడతలో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు చూపించారు. అధికారం మళ్ళీ తమదే అని ధీమాగా ఉన్నారు. కానీ ఇక్కడ నుంచే పరిస్థితులు ఒక్కొక్కటిగా కేసీఆర్ కి వ్యతిరేకంగా మారడం మొదలు పెట్టాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. దీంతో కూటమి రూపంలో కేసీఆర్ కి బలమైన ప్రత్యర్థి వచ్చింది. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు తెలంగాణలో కాంగ్రెస్ అంతోఇంతో బలంగా ఉంది కానీ.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అనే అభిప్రాయం ఉండేది. కానీ కూటమి బలంతో కాంగ్రెస్ బలం రెట్టింపు అయింది. ముఖ్యంగా టీడీపీ కేడర్ బలం కాంగ్రెస్ కి కలిసొస్తుంది. సర్వేలు కూడా మహాకూటమికే విజయావకాశాలు ఎక్కువున్నాయని చెప్తున్నాయి. ఇదే కేసీఆర్ కి మింగుడుపడటం లేదు. దీనికి తోడు కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్న మరో అంశం గ్రామాల్లో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎదురవుతున్న నిరసన సెగ.

కేసీఆర్ తాను సర్వేలు చేయించుకున్నాను. అన్ని సర్వేల్లో వందకి పైగా సీట్లు వస్తాయని తేలింది అన్నారు. తమ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ప్రజలు తెరాస ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. కారు గుర్తు కనిపిస్తే చాలు ఓట్లు గుద్దేస్తారు అనుకున్నారు. అందుకేనేమో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా.. 'కేసీఆర్ బ్రాండ్ తో ఈజీగా గెలవొచ్చు' అనే కాన్ఫిడెన్స్ తో మార్చకుండా దాదాపు వారినే అభ్యర్థులుగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆ కాన్ఫిడెన్సే కొంపముంచింది అనిపిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేసారని ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నారు? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. కొందరు నేతలని అయితే అసలు గ్రామాల్లోనే అడుగు పెట్టనివ్వట్లేదు. అభ్యర్థులను మార్చలేక, ఈ అభ్యర్థులతో ఎలా గెలవాలో తెలియక కేసీఆర్ తల పట్టుకుంటున్నారు. కేసీఆర్ బలమైన నేత. ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వ్యక్తి. మరి అలాంటి కేసీఆర్ రాంగ్ స్టెప్ ఎలా వేశారు?. ఆయన పక్కన ఉన్నవారే మీ ఫోటో ఉంటే చాలు అభ్యర్థి ఎవరైనా ప్రజలు కళ్ళు మూసుకొని కారు గుర్తుకి ఓటేస్తారని ఆయనని ఇలా రాంగ్ స్టెప్ వేసేలా చేసారా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన మెప్పు కోసం ఎన్నైనా చెప్పి ఉండొచ్చు. కానీ ప్రజల్లో ఎమ్మెల్యేల మీద, పార్టీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నిజం చెప్తేనే కదా ఆయనకి తెలిసేది. అదీగాక ఆయన మీడియాకి కూడా అంత స్వేచ్ఛ ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీడియాకి స్వేచ్ఛ ఇస్తేనే కదా మంచి చేసినప్పుడు పొగడ్త.. తప్పు చేసినప్పుడు విమర్శ చేసి ప్లస్ లు, మైనస్ లు తెలిసేలా చేస్తుంది. ఇప్పుడు అనుకోని ఏం లాభం. నెలలో ఎన్నికలు ఉన్నాయి. మరి ఎన్నికల్లో కేసీఆర్ ఒకప్పటిలా దూసుకుపోతారో లేదో చూడాలి.

By
en-us Political News

  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.