తెలిసి తెలిసీ తప్పుడు ఆరోపణలు.. వైసీపీ నైజం అదేనా?

Publish Date:Feb 18, 2026

Advertisement

జనం సొమ్ముతో మంత్రి జల్సాలు అంటూ   కొలంబోలో భారత్, పాకిస్థాన్  మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించడానికి వెళ్లిన మంత్రి లోకేష్ పై వైసీపీయులు   చేసిన ప్రచారంపై లోకేష్ ఫ్లైట్ టికెట్టూ నాదే.. మ్యాచ్ టికెట్టూ నాదే... నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా.. జగన్ అంటూ తనదైన స్టైల్ లో స్పందించారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా  కొలంబో మ్యాచ్ వీక్షించేందుకు మంత్రి లోకేశ్ ప్రభుత్వ ధనంతో వెళ్లారనే వార్తలో ఎలాంటి వాస్తవం స్పష్టత ఇచ్చింది. 

వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.  టీమ్ ఇండియా, పాకిస్థాన్  మధ్య జరిగిన టి20 వరల్డ్  కప్ మ్యాచ్ చూడడానికి కొలంబో వెళ్లిన లోకేష్ అందుకైన ఖర్చు మొత్తం  స్వయంగా భరించారు, రాష్ట్ర ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా  ఇందుకోసం వ్యయం చేయలేదు. అయితే వైసీపీ మాత్రం ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ విమర్శలు గుప్పించింది.  అయితే ఫ్యాక్ట్ చెక్ లో వైసీపీ ప్రచారమంతా అవాస్తవమని విస్పష్టంగా తేలింది. రాష్ట్ర ఖజానా నుంచి లోకేష్ కొలంబో పర్యటనకు ఒక్క రూపాయి కూడా వినియోగించలేదని తేటతెల్లమైపోయింది. గతంలో కూడా తన సొంత పర్యటనల కోసం ప్రభుత్వం సొమ్ము వినియోగించడం లేదని పలు సందర్భాలలో లోకేష్ చెప్పారు. అయినా వైసీపీ విమర్శలు చేస్తూ ప్రతిష్ఠ దిగజార్చుకుంటోంది.

 మసిగుడ్డ మీదేస్తాం.. మీరే తుడుచుకోండి అన్న చందంగా వైసీపీ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో జగన్ అధికారంలో ఉండగా... ఆయన సతీసమేతంగా చేసిన విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును వినియోగించిన సందర్భాలను పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  గతంలో అంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో తన పెద్ద కుమార్తె హర్ష ప్యారిస్ లోని అత్యంత ప్రతిష్టాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్లో పోస్ట్  గ్రాడ్యుయేషన్ (ఎంబీఎ) పూర్తి చేసిన సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొనేందుకు జగన్ రెడ్డి సతీ సమేతంగా ప్యారిస్ వెళ్లారు.   తన కుమార్తె  పట్టా పుచ్చుకునే వేడుకను చూడాలనుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. అయితే అందుకోసం ఆయన ప్యారిస్ వెళ్లడానికి జనం సొమ్ము ఖర్చు చేయడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతిని పరిశీలకులు చెబుతున్నారు.  

అప్పటి ఆయన పారిస్ పర్యటన నాలుగు రోజులు సాగింది. ఇందు కోసం రానూ పోనూ విమాన ఖర్చులే రూ.10 కోట్లు అని అప్పట్లో గట్టిగా వినిపించింది. అప్పట్లో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ఉద్యోగులకు వేతనాలు సమయానికి చెల్లించే పరిస్థితి కూడా లేదు. అలాగే సంక్షేమ పథకాలకే ప్రభుత్వం కోత పెడుతున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో  ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వ సొమ్ము రూ. 10 కోట్లు ఖర్చు చేయడాన్ని జగన్, ఆయనపార్టీ నేతలూ ఎలా సమర్థించుకోగలరని ప్రశ్నిస్తున్నారు. తన హయాంలో జనం సొమ్మును జగన్ పాకెట్ మనీగా వాడుకున్నారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.