భారత్, పాక్, బంగ్లాదేశ్ కామన్ కరెన్సీ?

Publish Date:Dec 28, 2015

Advertisement

 

ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ ఆకస్మిక పర్యటనతో ఇరు దేశాల సంబంధాలు మళ్ళీ మెరుగుపడతాయనే భావన ఇరు దేశాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. జనవరి 15వ తేదీన ఇస్లామాబాద్ లో ఇరు దేశాల విదేశాంగ శాఖల ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగబోతుండటంతో ప్రజల అంచనాలు పెరిగిపోయాయి.

 

అయితే అప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని ఆశించడం సరికాదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ యొక్క విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. మొదట ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు అవసరమయిన చర్యలు చేపడతామని, వాటిలో భాగంగా సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ అమలు గురించి జనవరి 15న జరిగే సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.

 

బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ “భవిష్యత్తులో భారత్ పాక్, బంగ్లాదేశ్ మూడు మళ్ళీ ఏకం అయిపోతాయని జోస్యం చెప్పారు. దానిని మరింత వివరిస్తూ “అలాగని ఆ రెండు దేశాలను భారత్ లో బలవంతంగా కలిపేసుకొంటామని కాదు దానర్ధం. మూడు దేశాల ప్రజల అభీష్టంతో అది సాధ్యం అవవచ్చునని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.

 

ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న లోక్ జన్ శక్తి పార్టీ అధినేత, మరియు కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ “భవిష్యత్తులో భారత్ పాక్, బంగ్లాదేశ్ మూడు మళ్ళీ ఏకం అవుతాయో లేదో తెలియదు కానీ, ఈ మూడు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడి, ఉగ్రవాదం బెడద తగ్గాలంటే మూడు దేశాలు చేతులు కలపవలసిన అవసరం ఉంది. వీలయితే మూడు దేశాలు ఒకే కరెన్సీని ప్రవేశపెట్టగలిగితే మంచిది. అలాగే  స్వేచ్చా వాణిజ్యం అమలు చేయగలిగితే దాని వలన మూడు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. తద్వారా మూడు దేశాల ప్రజల మధ్య సంబంధాలు బలపడతాయి. అప్పుడు ఉగ్రవాదం మటుమాయం అవుతుంది,” అని అన్నారు.

 

రామ్ మాధవ్ జోస్యం నిజం అయ్యే అవకాశాలు ఏమాత్రం లేకపోయినా రామ్ విలాస్ పాశ్వాన్ సూచిస్తున్నట్లుగా "స్వేచ్చా వాణిజ్యం" ‘కామన్ కరెన్సీ’ని ప్రవేశపెట్టడం మంచి ఆలోచనలేనని చెప్పవచ్చును. కానీ సాధారణంగా ఒకే స్థాయిలో ఉన్న దేశాల మధ్యనే కామన్ కరెన్సీ వంటి ప్రయోగాలు సఫలం అవుతాయి. ఉదాహరణకి ఇంచుమించు సమానంగా అభివృద్ధి చెందిన యూరప్ దేశాలన్నీ కలిసి ‘యూరో’ కామన్ కరెన్సీని ప్రవేశపెట్టుకొన్నాయి. నేటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని అవి అధిగమించి కామన్ కరెన్సీని చెలామణి చేసుకోగలుగుతున్నాయి. కానీ భారత్ తో పోలిస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు అభివృద్ధిలో చాలా వెనుకపడి ఉన్నాయి కనుక పాశ్వాన్ సూచన అమలు చేయడం కూడా కష్టమే కావచ్చును. కానీ పాశ్వాన్ సూచిస్తున్న " మూడు దేశాల మధ్య స్వేచ్చా వాణిజ్యం" అమలు చేయడానికి అవకాశాలున్నాయి. 

By
en-us Political News

  
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.