అర్నాబ్ ఎఫెక్ట్: కుండపోత, కుంభవృష్టి.. రాకాసి అలలు, పెనుగాలులు.!

Publish Date:Oct 27, 2026

Advertisement

అర్నాబ్ పెను తుపాను కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో సంభవించే తుపానులు అపారనష్టం కలిగిస్తాయి. గతంలో సంభవించిన తుపానులను గుర్తు చేసుకుంటూ తీరప్రాంత వాసులు బెంబేలెత్తిపోతున్నారు. అర్నాబ్ ప్రభావంతో  తీర ప్రాంతాల్లో ఇప్పటికే అల్లకల్లోల వాతావరణం నెలకొంది. సముద్రంఅల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు పోటెత్తుతున్నాయి. పెను గాలులు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో  నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

భారత వాతావరణ శాఖ  అంచనాల ప్రకారం, అర్నాబ్  తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల ప్రభావంతో సముద్ర అలలు చెలియలకట్ట దాడి వస్తాయన్న ఆందోళన తీర ప్రాంత వాసులలో వ్యక్తమౌతోంది. దివిసీమ, కోససీమ ఉప్పెనలను గుర్తు చేసుకుంటూ భయాందోళనలకు గురౌతున్నారు. బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య,   యానాం సమీపంలో అర్నాబ్ తుపాను తీరం దాటే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి.  

ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక శాఖలను, అధికారులను అప్రమత్తం చేసింది. తీర ప్రాంత జిల్లాలలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, పునరావస కేంద్రాలను సిద్ధం చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. 

ఇదిలావుంటే, ఈ తుపాను ఉద్ధృతి కారణంగా రవాణా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది.  విమానాశ్రయాల్లోనూ అధికారుల పర్యవేక్షణ పెరిగింది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఇప్పటికే న్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్  బృందాలను తుపాను ప్రభావిత ప్రాంతాలలో మోహరించింది.  ఆస్తినష్టం, ప్రాణనష్టాన్ని వీలైనంత వరకు తగ్గంచడమే లక్ష్యంగా యంత్రాగం సర్వసన్నద్ధంగా ఉంది.             


[Heavy Rains Supertides Shewer Cost Andhra, , Cyclone Arnab Andhra Pradesh, AP Cyclone High Alert, Telugu One]              

By
en-us Political News

  
ఎండల తీవ్రత, ఎల్ నినో ఎఫెక్ట్ తో జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుతుండటంతో తిరుమలలో భక్తులకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం  అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా నీటి పొదుపు, సమర్థవంతమైన నీటి యాజమాన్య చర్యలను ప్రారంభించింది
మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించామనీ   ఆ హామీకి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్  స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియ సాగే కొద్దీ బడ్జెట్ అంచనాలు సవరించబడతాయని చెప్పారు.
హత్యాయత్నం  కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న బీటెక్ రవి,  పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ తానే స్వయంగా డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  
వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించి  నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు  అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.   నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు.
తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 
1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  
ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20)  నాటికి  సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. 
గత ఆరు గంటల వ్యవధిలో గంటకు  3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను,   చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం,  విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  
 తుపాను తీరం దాటే సమయంలో సముద్రం  అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం   రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ పేర్కొంది.  
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు.  తుపాను కదలికలు,  తీవ్రత,  రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.