బెంబేలెత్తిస్తున్న అర్నాబ్: హుద్ హుద్ గుర్తొస్తోంది.. డిజిటల్ మీడియాతో తుపాను గమనం ట్రాక్.!
Publish Date:Oct 27, 2026
Advertisement
అర్నాబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ ను బెంబేలెత్తిస్తున్నది. మరీ ముఖ్యంగా విశాఖ, ఉత్తరాంధ్ర వాసులకు హుద్ హుద్ రోజులను గుర్తుకు తెస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేయడానికి తుపాను గమనం, తీవ్రతను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చింది. అర్నాబ్ తుపాను కదలికలను, తీవ్రతను, గమనాన్ని, దిశను ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియం ద్వారా ట్రాక్ చేసే వెసులుబాటును కల్పించింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఏపీ సర్కార్.. ప్రజలు, ప్రయాణికులు తుపాను సమయంలో ఆందోళన చెందకుండా ఉండేందుకు, ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా క్షణక్షణం అప్‌డేట్స్ అందించే ఏర్పాట్లు చేసింది. మొబైల్ ఫోన్, కంప్యూటర్ ద్వారా వివిధ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను సందర్శించి తుఫాన్ ఎక్కడ కేంద్రీకృతమై ఉందనే విషయాలను మ్యాపింగ్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ఆన్‌లైన్ ట్రాకింగ్ విధానం ద్వారా తుఫాన్ తీరం దాటే సమయం, గంటకు ఎంత వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయనే కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకంగా రాడార్ ఇమేజ్‌లు, శాటిలైట్ మ్యాప్‌లను పరిశీలించడం ద్వారా ప్రజలు తమ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకోవచ్చు. అనవసర వదంతులను నమ్మకుండా, కేవలం ప్రామాణికమైన సమాచారాన్ని మాత్రమే నమ్ముతూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వ విపత్తు నిర్వహణ, వాతావరణ శాఖ సంయుక్తంగా ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికలు, అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారా కూడా తుఫాన్ కదలికలను నోటిఫికేషన్ రూపంలో పొందే అవకాశం కూడా కల్పించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు డిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం కూడా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఆన్‌లైన్ హెచ్చరికలను ప్రజలకు చేరవేస్తోంది. [AP Cyclone Updates Online, Andhra Pradesh Weather Tracking, Cyclone Live Tracking, IMD Cyclone Warning, Telugu One]
http://www.teluguone.com/news/content/ap-cyclone-updates-online-43-235477.html





