నౌకాదళంలో స్వదేశీ సత్తా: విశాఖలో జల ప్రవేశం చేసిన తొలి ఫ్లీట్ సపొర్ట్ షిప్.!

Publish Date:Oct 5, 2026

Advertisement

భారత రక్షణ రంగంలో స్వదేశీ నౌకల నిర్మాణ సామర్థ్యానికి మరో కీలక మైలురాయి నమోదైంది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో నిర్మించిన తొలి  ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్1)ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం (అక్టోబర్ 5) జలప్రవేశం చేయించారు. భారత నౌకాదళానికి అవసరమైన దీర్ఘకాలిక సముద్ర కార్యకలాపాలకు ఈ  నౌకలు కీలకంగా మారనున్నాయి. కాగా ఈ కార్యక్రమంలో   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ తదితరులు హాజరయ్యారు.

భారత నౌకాదళం కోసం హెచ్ఎస్‌ఎల్ మొత్తం ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లను నిర్మిస్తోంది. వాటిలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1ను స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే జలప్రవేశం చేయడం ప్రాజెక్టు అమలు వేగానికి నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు.   43 వేల 500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలోనే ఇతర యుద్ధనౌకలకు అవసరమైన సరఫరాలను అందిస్తాయి.

ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ల ప్రధాన ఉద్దేశం సముద్రంలో సుదీర్ఘకాలం విధుల్లో ఉండే నౌకాదళ యుద్ధనౌకలకు ఇంధనం, నీరు, ఆహారం, మందుగుండు, ఇతర అవసరమైన సామగ్రిని అందించడం. దీనివల్ల యుద్ధనౌకలు తరచూ తీరానికి రావాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళం కార్యకలాపాల పరిధి, సముద్రంలో కొనసాగే సామర్థ్యం పెరుగుతుంది. ఇదే కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS5)కు కీల్ లేయింగ్ చేశారు. అంటే ఐదు నౌకల నిర్మాణ ప్రాజెక్టు సిరీస్ ప్రొడక్షన్ దిశగా ముందుకు సాగుతోంది. ఈ నౌకల నిర్మాణం పూర్తిగా స్వదేశీ డిజైన్‌తో చేపడుతున్న ప్రాజెక్టుల్లో ఒకటి.

ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ల నిర్మాణం వల్ల విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా అవకాశాలు పెరుగుతాయి. 2024లో ప్రాజెక్టు ప్రారంభమైన సమయంలో హెచ్ఎస్‌ఎల్ అధికారులు ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 550 ఎంఎస్ఎంఈలకు వ్యాపార అవకాశాలు, మూడు వేల  మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మొత్తంగా చూస్తే..  విశాఖలో ఎఫ్ఎస్ఎస్ 1 జలప్రవేశం కే  ఒక భారీ నౌక నిర్మాణ ఘట్టం మాత్రమే కాదు. భారత నౌకాదళం సముద్ర సామర్థ్యాల విస్తరణకు, దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ బలోపేతానికి  నిలువెత్తు నిదర్శనం.  


[Fleet Support Ship FSS1, Hindustan Shipyard Limited, Rajnath Singh, Visakhapatnam, Indian Navy, Visakha, Defence Sector, Indigenous Ship Construction, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.