8వ వేతన సంఘం: బెంగళూరు భేటీలో ఉద్యోగ సంఘాల డిమాండ్లేంటంటే.?

Publish Date:Oct 6, 2026

Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం బుధ, గురు వారాల్లో (అక్టోబర్7, 8)   ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో   బెంగళూరులో  భేటీ కానుంది. ఈ భేటీలో వేతన సవరణ, ఫిట్‌మెంట్ర్, అలవెన్సులు, పెన్షన్ తదితర అంశాలపై ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నాయి.

8వ కేంద్ర వేతన సంఘాన్ని 2025 నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ కమిషన్కి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ చైర్‌పర్సన్‌ కాగా,  ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్‌టైమ్ సభ్యుడిగా, పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. కమిషన్‌కు తన సిఫార్సులను సమర్పించేందుకు 18 నెలల గడువు ఉంది. 

బెంగళూరు భేటీ నేపథ్యంలో  ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఇప్పటికే కమిషన్‌కు సమర్పించాయి. ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (ఐఆర్టీఎస్ఏ) కనీస వేతనాన్ని  52 వేల600 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేసింది.   ప్రస్తుతం అమల్లో ఉన్న వేతన నిర్మాణాన్ని సమీక్షించి ఉద్యోగుల బాధ్యతలు, పని పరిస్థితులు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కనీస వేతనాన్ని నిర్ధారించాలని కోరుతోంది.  

ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఫిట్‌మెంట్  కీలక అంశంగా ఉంది. ఐఈర్టీఎస్ఏ  వివిధ పే లెవల్స్‌కు వేర్వేరు ఫిట్‌మెంట్ లను ప్రతిపాదించింది. లెవెల్స్ 1–5కు 2.92, లెవెల్స్ 6–8కు 3.50, లెవెల్స్ 9–12కు 3.80, లెవెల్స్ 13–16కు 4.09, లెవెల్స్ 17–18కు 4.38 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కోరినట్లు తెలుస్తోంది.  

అలాగే, వేతన నిర్మాణంతో పాటు ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్‌ను ఐదు శాతానికి పెంచాలని ఉద్యోగ సంఘాలు ప్రతిపాదిస్తున్నాయి. అదే విధంగా  జూనియర్ ఇంజినీర్లు, సీనియర్ సెక్షన్ ఇంజినీర్లకు కెరీర్ ప్రోగ్రెషన్, ప్రమోషన్లు, ఎమ్ఏసీపీఎస్ లో మార్పులు చేయాలని కోరుతున్నాయి. నైట్ షిఫ్ట్, ఓవర్‌టైమ్, రిస్క్, పనులకు సంబంధించిన అలవెన్సులను కూడా పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

ఇక పోతే పెన్షనర్లకు సంబంధించిన అంశాలు కూడా బెంగళూరు భేటీలో ప్రముఖంగా ప్రస్తావనకు రానున్నాయి. రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రాథమిక వేతనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, తద్వారా పదవీ విరమణ ప్రయోజనాలు మెరుగుపడేలా చూడాలని కోరుతోంది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అలవెన్సులను కాలానుగుణంగా సవరించాలని, పెన్షనర్లకు ఆర్థిక భద్రతను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నది.  

[8th Pay Commission, Central Government Employees, Fitment Factor, Minimum Pay, Pension, Salary Hike, Bengaluru Pay Commission Meeting, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.