రైలు 5 గంటలు లేట్: ప్రయాణికుడికి రూ. 500 జరిమానా..ఎందుకంటే.!

Publish Date:Oct 5, 2026

Advertisement

భారతీయ రైల్వే శాఖకు సంబంధించిన విచిత్రమైన నిబంధనలు, కొన్నిసార్లు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా ముంబైలోని ప్రముఖ కళ్యాణ్ జంక్షన్‌లో జరిగిన ఒక అనూహ్య ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తన కుటుంబ సభ్యులను సురక్షితంగా రైలు ఎక్కించేందుకు వచ్చిన ఒక వ్యక్తి, రైలు ఆలస్యం కావడంతో చివరకు రూ. 500 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ విచిత్ర ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులను సాగనంపేందుకు నిబంధనల ప్రకారం ప్లాట్‌ఫాం టికెట్ కొనుగోలు చేసి స్టేషన్‌లోకి ప్రవేశించాడు. అయితే ఆ కుటుంబం ఎక్కాల్సిన రైలు సమయానికి రాకపోగా, ఏకంగా ఐదు గంటల పాటు ఆలస్యంగా నడిచింది.

ప్రయాణికుడు ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించాలనే దురుద్దేశంతో కాకుండా, తన కుటుంబ సభ్యులకు సాయంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్లాట్‌ఫామ్‌పై సుమారు ఐదు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. రైలు రాక కోసం ఓపికగా ఎదురుచూసి, చివరికి కుటుంబం రైలు ఎక్కిన తర్వాత అతను బయటకు వెళ్తున్న సమయంలో టికెట్ కలెక్టర్ (TTE) అతన్ని అడ్డుకున్నారు. అతని వద్ద ఉన్న ప్లాట్‌ఫాం టికెట్‌ను పరిశీలించగా, దాని గడువు ముగిసిందని తేలింది. సాధారణంగా ప్లాట్‌ఫాం టికెట్ కేవలం నిర్దిష్ట గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రైళ్లు గంటల తరబడి ఆలస్యం కావడం రైల్వే శాఖ అధికారుల చేతుల్లో ఉండే విషయమైనప్పటికీ, ఆ ఆలయానికి ప్రయాణికుడిని బాధ్యుడిని చేస్తూ అధికారులు ఏకంగా రూ. 500 జరిమానా విధించడం వివాదాస్పదమైంది.

రైలు ఐదు గంటలు ఆలస్యం కావడం వల్లనే తాను ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ సమయం ఉండాల్సి వచ్చిందని ఆ వ్యక్తి వాపోయినప్పటికీ, అధికారులు  చలించలేదు. ప్లాట్‌ఫాం టికెట్‌కు, రైళ్ల రాకపోకల సమయానికి ఎలాంటి సంబంధం ఉండదని, నిర్ణీత గడువు దాటితే జరిమానా కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో  వివరాలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రైల్వే శాఖ వైఫల్యం వల్ల ట్రైన్లు గంటల తరబడి ఆలస్యమైతే, దానికి ప్రయాణికులను శిక్షించడం ఎంతవరకు కరెక్టు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, నిబంధనలు నిబంధనలేనని, నిర్దిష్ట సమయం దాటితే మరో టికెట్ తీసుకోవాలి కదా అని కొంతమంది వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, రైల్వే విచిత్ర నిబంధనలు  ప్రయాణికుల ఇబ్బందులు  మరోసారి దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపింది.

 

[ Indian Railways, Platform Ticket Fine, Train Delay, Kalyan Junction, Viral News, Passenger Rights, Mumbai, PM MODI, Telugu One, Telugu News ]  
 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.