ప్చ్.. పాపం ఈటెల...

Publish Date:Nov 7, 2014

Advertisement

 

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఎంత పవర్ ఫుల్ నాయకుడో అందరికీ తెలిసిందే. ఆయన సీమాంధ్రుల మీద మాటల ఈటెలు విసిరారంటే ఆ ఈటెలు డైరెక్టుగా సీమాంధ్రుల గుండెల్లో దిగబడతాయి. ఆయన మాటల కారణంగానే ఈటెల టీఆర్ఎస్‌లో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఇంత పవర్‌ఫుల్ వ్యక్తి కాబట్టి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చాలా సన్నిహితుడు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఆయన మాట వేదంలా చెల్లుతుందని ఎవరైనా అనుకుంటారు. బట్.. ఈటెలకి ప్రభుత్వంలో అంత సీన్ లేదని, ఆయన మాటకు గడ్డిపోచంత విలువ కూడా లేదని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను విశ్వసనీయ వర్గాలు బయటకి లీక్ చేశాయి.

 

ఈటెల రాజేందర్ మంత్రి అయిన తర్వాత ఆయన బంధువులు కొంతమంది ఆయన దగ్గరకి వచ్చి ‘‘రాజేందరన్నా.. రాజేందరన్నా... మేం తెలంగాణలో ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నాం. మమ్మల్ని ఆ ఫలానా చోట నుంచి ఈ ఫలానా చోటకి ట్రాన్స్‌ఫర్ చేయించవా... ప్లీజ్’’ అని రిక్వెస్ట్ చేసుకున్నారట. వారి రిక్వెస్టులకి కరిగిపోయిన ఈటెల ‘‘మీరు కోరినట్టే ట్రాన్స్‌ఫర్ చేయిస్తా పొండి’’ అని వాళ్ళకి హామీ ఇచ్చేశారట. సదరు బంధువులు ఇక తాము ట్రాన్స్‌ఫర్ అయిపోయినట్టే అనుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయారట. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఈటెలకి బుర్ర తిరిగిపోయేలా చేశాయట. మా బంధువులని కాస్త ట్రాన్స్‌ఫర్ చేసిపెట్టరూ అని ప్రభుత్వంలో ఎవరిని అడిగినా పని కాలేదట. సీఎం కేసీఆర్ చెబితేనే ట్రాన్స్‌ఫర్ చేస్తామని అధికారులు నిర్మొహమాటంగా చెప్పడంతో ఈటెల బిత్తరపోయారట. అయినప్పటికీ గుండె రాయి చేసుకుని కేసీఆర్‌కి కూడా ఈ విషయాన్ని విన్నవించుకుంటే, ఆయన చాలాకాలంగా ఏ విషయమూ తేల్చకుండా ఇష్యూని పక్కన పెట్టేశారట. ఈ ట్రాన్స్‌ఫర్లు జరక్కపోతే తన బంధువర్గంలో తన పరువు ఫినాయిల్‌, యాసిడ్‌తో కడిగినట్టుగా పోతుందని ఈటెల ఫీలైపోయారట.

 

సరే, నామాట ఎలాగూ చెల్లడం లేదు. నా ఫ్రెండ్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెబితే అయినా పని అవుతుందేమోననని ఈ విషయాన్ని జగదీశ్వర్ రెడ్డి చెవిలో వేశారట. తన సహచర మంత్రి ఈటెల ఆవేదనను విని గుండె చెరువైపోయిన జగదీశ్వర్‌రెడ్డి ఈటెలకి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యారట. సీఎం కేసీఆర్ మూడ్ బాగున్నప్పుడే నీ బంధువుల ట్రాన్స్‌ఫర్ విషయం సీఎం దగ్గర ప్రస్తావించి పనయ్యేట్టు చూస్తానని జగదీశ్వర్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఈటెల హ్యాపీగా ఫీలయ్యారట. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తన మిత్ర ధర్మం ప్రకారం ఓ సందర్భంలో కేసీఆర్ మూడ్ బాగుందని అనుకుని ఈ ట్రాన్స్‌ఫర్ల వ్యవహారం ఆయన దగ్గర ప్రస్తావించారట. అంతే, కేసీఆర్ ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమైపోయి అక్కడే వున్న ఓ అరడజను మంది ఐఏఎస్ ఆఫీసర్ల ముందే జగదీశ్వర్‌రెడ్డిని ‘‘ఈటెల ట్రాన్స్‌ఫర్ల వ్యవహారం గురించి నా దగ్గర ప్రస్తావిస్తున్నావ్.. నువ్వేమైనా తురుంఖాన్‌వా‌? ఈటెల చెప్పడమేంటి.. నువ్వు నాకు చెప్పడమేంటి’’ అని చెడామడా క్లాస్ పీకేశారట. దాంతో జగదీశ్వర్‌రెడ్డి ముఖం చెల్లని చిల్లుకాణీ అంత అయిపోయిందట. మొగుడు తిట్టినందుకు బాధలేదు.. తోడికోడలు నవ్విందనే బాధ అన్నట్టుగా, కేసీఆర్ చెడామడా క్లాస్ పీకినందుకు బాధ లేదుగానీ, ఐఏఎస్ ఆఫీసర్ల ముందే క్లాస్ పీకారని జగదీశ్వర్‌రెడ్డి ఈటెలతో ఆవేదనగా చెప్పుకున్నారట. ఆ తర్వాత ఇద్దరూ తమ పరిస్థితి ఇలా అయిపోయిందేంటా అని జాయింటుగా బాధపడి, ఒకర్నొకరు ఓదార్చుకున్నారట.

By
en-us Political News

  
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.