తమిళనాడు అసెంబ్లీలో కుప్పం ఎయిర్ పోర్టు ప్రస్తావన.. లింకేంటి?

Publish Date:Aug 13, 2026

Advertisement

ఏపీ సీఎం చంద్రబాబు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ముందుు సాగుతున్నారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు చేయతలపెట్టింది. అయితే కుప్పంలో ఏపీ ప్రభుత్వంనిర్మించతలపెట్టిన  విమానాశ్రయం  తమిళనాడు రాజకీయాల్లో హీట్ పెంచింది. తమిళనాడుఅసెంబ్లీ వేదికగా హోసూరు విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణంపై జరిగిన చర్చలో కుప్పం విమానాశ్రయం ప్రస్తావనకు వచ్చింది. 
తమిళనాడు శాసనసభ సమావేశాల సందర్భంగా డిఎంకె ఎమ్మెల్యే శ్రీనివాసన్ హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడులోని హోసూరు సమీపంలో ఎయిర్‌పోర్ట్ రాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ    ఆరోపణలు చేశారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధితో పాటు పారిశ్రామిక పురోగతికి హోసూరు ఎయిర్‌పోర్ట్   కీలకమని, ఇతర రాష్ట్రాల వ్యూహాల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందని ఆయన ఆరోపించారు.

శాసనసభలో ఎడీఎంకే మ్మెల్యే   ఈ ఆరోపణలను  తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి   తోసిపుచ్చారు. హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును ఇతర పొరుగు రాష్ట్రాలేవీ అడ్డుకోవడం లేదంటూ.. సోషల్ మీడియా  ప్రచారాలనూ, నిరాధార వార్తలనూ నమ్మి అసెంబ్లీ వేదికగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి నిష్కర్షగా చెప్పారు.  హోసూరు విమానాశ్రయ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి   ఆధారాలతో మాట్లాడాలన్నారు. అసలు కుప్పంలో విమానాశ్రయం, హోసూరు ఎయిర్ పోర్టులకు లింకేంటి?  కుప్పం విమానాశ్రయం గురించి తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తిన అభ్యంతరమేంటి? అంటే.. 
వాస్తవానికి హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు   పలు సాంకేతిక  సవాళ్లను ఎదుర్కొంటోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి హోసూరు అత్యంత సమీపంలో ఉంటుంది. విమానయాన నిబంధనల ప్రకారం ఒక ప్రధాన విమానాశ్రయానికి నిర్ణీత దూరంలో మరొక విమానాశ్రయాన్ని నిర్మించడంపై పరిమితులు ఉన్నాయి. దీనికితోడు హోసూరు ప్రాంతంలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్  పరిశోధనా కేంద్రాలు, సంస్థలు ఉండటం వల్ల  ఆ  పరిసరాల్లో విమానాల రాకపోకలపై  భద్రత దృష్ట్యా ఆంక్షలు  ఉన్నాయి. ఈ కారణాల వల్ల హోసూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇవ్వడానికి ముందు వెనుకలాడుతోంది. 
అయితే బెంగళూరుకు సమీపంలోనే నిర్మించతలపెట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం ఎయిర్‌పోర్ట్   ప్రాజెక్టు కు సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది. దీంతో కుప్పం విమానాశ్రయ సాధ్యాసాధ్యాల అధ్యయనం జాప్యం లేకుండా పూర్తయ్యింది. 

కుప్పం వద్ద విమానాశ్రయం నిర్మాణం చేపడుతుండటంతో ప్రాజెక్టుకు దాదాపు 1,788 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సుమారు 1,300 ఎకరాల భూసేకరణను   పూర్తి చేసింది. ఈ ఎయిర్‌పోర్ట్‌ను క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్  నమూనాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విమానాశ్రయ నిర్మాణం, తదనంతర నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షించేలా నిర్ణయం జరిగింది. 

కుప్పం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు పరిసర సరిహద్దు ప్రాంతాల రూపురేకలు మారిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కుప్పం ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా మారడమే కాకుండా, ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం పెరుగుతుంది.   స్థానిక రైతులకు, ఉద్యానవన పంటల సాగుదారులకు ఈ విమానాశ్రయం ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. తాజా పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశీ మార్కెట్లకు వేగంగా ఎగుమతి చేయడానికి   దోహదపడుతుంది.

ఒకే భౌగోళిక ప్రాంతానికి సమీపంలో ఉన్న కుప్పం విమానాశ్రయం అనుమతులు సాధించి పనుల్లో ముందంజ వేస్తుండగా..  హోసూరు ఎయిర్‌పోర్ట్  ప్రాజెక్టు పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇదే తమిళనాడు రాజకీయాలలో కాకరేపుతోంది.   

Kuppam Airport, Tamil Nadu Assembly, Hosur Airport, Andhra Pradesh Infrastructure, Bengaluru Airport NOC

By
en-us Political News

  
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.