లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు.. జగన్ సంగతేంటి?

Publish Date:Aug 17, 2026

Advertisement

ఏపీ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టినా.. మండిలిలో ఆ పార్టీ సభ్యులు హాజరయ్యారు.   ఈ క్రమంలో రాష్ట్రంలో  మెగా డీఎస్సీ-2025 నిర్వహణ, ఫలితాలు, వైసీపీ విమర్శలు, ఆరోపణలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.  అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ, పరీక్షల నిర్వహణ, ర్యాంకింగ్ విధానం, క్రీడల కోటా కేటాయింపులపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.  అర్హులైన అభ్యర్థులకు  అన్యాయం జరిగే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టారు. 

 మండలిలో విపక్ష సభ్యులు లేవనెత్తిన సాంకేతిక సందేహాలకు సాంకేతిక ఆధారాలతోనే సమాధానం ఇచ్చారు.   ప్రతిపక్షం కేవలం రాజకీయ లబ్ధి కోసమే సభలో రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తోందని, నిరుద్యోగుల్లో అనవసర అయోమయాన్ని సృష్టించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

అదే సమయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీరును దుయ్యబట్టారు.  అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై మాట్లాడే ధైర్యం లేక జగన్ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్సీ లేదా ఇతర అభివృద్ధి, సంక్షేమ అంశాలపై నిజంగా చిత్తశుద్ధి, బాధ్యత ఉంటే అసెంబ్లీ వేదికగా ముఖాముఖి చర్చకు రావాలని సవాల్ విసిరారు. సాకులు చెబుతూ సభను బహిష్కరించి పారిపోవడం  ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. 

వైసీపీ  హయాంలో నిరుద్యోగులను ఏ విధంగా వంచించారో ప్రజలందరికీ తెలుసని   లోకేష్ విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల హయాంలో  ఉద్యోగాల భర్తీని పక్కనపెట్టి నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ ప్రకటన చేసి, రికార్డు స్థాయిలో పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, అభ్యర్థులకు త్వరితగతిన నియామక పత్రాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ ఉద్ఘాటించారు.  

సభావేదికగా లోకేష్ మోగా డీఎస్సీ విషయంలో వైసీపీ ఆరోపణలు, విమర్శలను తిప్పి కొట్టారు. అదే సమయంలో జగన్ కు సవాల్ విసిరారు. లోకేష్ డీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీ తనంపై క్లారిటీ ఇచ్చారు. ఇక మిగిలింది జగన్.. ఆయన సభకు హాజరై గళమెత్తుతారా?  లేక ఇదే పలాయన వాదంతో సభకు ఆవల విమర్శలకు పరిమితమౌతారా తేల్చుకోవాలి. 

Nara Lokesh,  Jagan, MegaDSC,  AP Legislative Council, AP Assembly Sessions, Clarity, Challange

By
en-us Political News

  
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.