కేంద్ర ఎన్నికల సంఘంలో అసలు జరిగిందేంటి: సీఈసీ జ్ణానేశ్వర్ కుమార్ ఏం చేశారు.?

Publish Date:Sep 26, 2026

Advertisement

కొద్ది నెలలుగా  ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై విపక్షాలు, పౌర సమాజం నుంచి వస్తున్న ప్రశ్నలు ఒకెత్తయితే, తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. సర్ ప్రక్రియ తీరుతెన్నులపై ఏకంగా ఎన్నికల సంఘంలోనే  తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమైన విషయం వెల్లడైంది. ఇది సంచలనం సృష్టిస్తోంది.   కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి లు.. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, పునరుద్ధరణ, ఓటరు నమోదు ప్రక్రియలో మార్పులు, ఎన్నికల డేటా కేంద్రీకరణ వంటి కీలక నిర్ణయాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్   జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న చర్యలను గట్టిగా వ్యతిరేకించారు.

పది నెలల వ్యవధిలో వారు కనీసం  14 సార్లు లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం  చేశారు.   ఈ అభ్యంతరాలు, విభేదాలూ ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు.   పది నెలల కాలంలో ఏకంగా 14 సార్లు  ఒకే రోజు ఏకంగా నాలుగు సార్లు  ఇద్దరు కమిషనర్లు రికార్డుల్లో తమ అభ్యంతరాలను నమోదు చేశారు. 

తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏకపక్ష  నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఓటర్ల చేర్పులు, తొలగింపుల ప్రక్రియ పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.   కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే  ఫారమ్-6 మార్పుల విషయంలోనూ ఇదే వివాదం తలెత్తింది. 2000వ దశకం ప్రారంభంలో జరిగిన ఎస్ఐఆర్   నాటి ఓటరు జాబితాతో దరఖాస్తుదారుడికి లేదా వారి తల్లిదండ్రులు, తాతామామలకు ఉన్న సంబంధాన్ని నిరూపించాలని సవరించిన ఫారమ్‌లో కొత్త నిబంధన చేర్చారు.   ఈ మార్పు చట్టవిరుద్ధమని, అనధికారికమని తేల్చేసిన   ఇద్దరు కమిషనర్లు.. వెంటనే దీనిని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, వారి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఆ మార్పులు అలాగే కొనసాగడం గమనార్హం.   

 ఈ పరిణామాలు పెను సంచలనానికి  తెరలేపాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయగా, ఆయనను పదవి నుంచి తొలగించేందుకు విపక్షాలు పార్లమెంటరీ తీర్మానానికి సన్నాహాలు చేస్తున్నాయి.   మరోవైపు, ఇలాంటి అంతర్గత అభ్యంతరాలు ఉన్నంత మాత్రాన తుది నిర్ణయాలు ఏకాభిప్రాయం లేకుండా జరిగాయని అనలేమని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి రిగ్గింగ్ జరగలేదని భారతీయ జనతా పార్టీ  సమర్థించే ప్రయత్నం చేస్తోంది. మరో వైపు కాక్రోచ్ జనతా పార్టీ జ్ణానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో వచ్చే నెల 2 నుంచి దేశ వ్యాప్తం ఉద్యమానికి పిలుపునిచ్చింది. 


[Election Commission Controversy, ECI Internal Disputes, Special Intensive Revision SIR, Gyanesh Kumar Resignation DemanD, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.