బ్రహ్మోస్ క్షిపణులు: పాకిస్థాన్ కు కంటిమీద కునుకు కరవు.!

Publish Date:Sep 26, 2026

Advertisement

ఇండియా రక్షణ రంగ తయారీ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తయారవుతున్న అధునాతన బ్రహ్మోస్ క్షిపణులు శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా చెప్పారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో   ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (యూపీఐటీఎస్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన అమిత్ షా.. యూపీ గడ్డపై తయారవుతున్న బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు  పాకిస్తాన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మారుతున్న పారిశ్రామిక, భద్రతా వాతావరణానికి ఇది నిదర్శనంగా అభివర్ణించారు. అలాగే అమేథీలో తయారవుతున్న ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ ఉగ్రవాదులు, నక్సలైట్లకు సింహస్వప్నంగా మారాయన్నారు.

గతంలో యూపీలో  నేరాలకు నిలయంగా ఉన్న  పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్న అమిత్ షా. ఒకప్పుడు నాటు తుపాకులు తయారైన చోట, ఇప్పుడు రక్షణ రంగ కారిడార్లు ఏర్పడి అత్యాధునిక ఆయుధాలు తయారవుతున్నాయన్నారు. ఝాన్సీ, లక్నో, కాన్పూర్, ఆగ్రా, అలీఘర్, చిత్రకూట్ వంటి   ప్రాంతాల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. దేశ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయని, భారత రక్షణ రంగం అంతర్జాతీయంగా బలమైన శక్తిగా ఎదుగుతోందని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సంక్షోభాలను తట్టుకుని నిలబడిందనీ, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై పుష్కరం పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ..  ఇండియా ఇప్పుడు  అగ్రగామి ఆర్థిక వ్యవస్థల సరసన సగర్వంగా నిలిచిందన్నారు.  ఒకప్పుడు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన యూపీ యువత..  నేడు 'ఒక జిల్లా..  ఒక ఉత్పత్తి' (ఓడీఓపీ) వంటి వినూత్న పథకాల ద్వారా స్వరాష్ట్రంలోనే ఉపాధి పొందుతున్నదన్నారు.  

శాంతిభద్రతల పరిరక్షణే పెట్టుబడులకు మొదటి మెట్టున్న అమిత్ షా.. రాష్ట్రంలో మెరుగైన శాంతిభద్రతల కారణంగానే నేడు భారీగా విదేశీ, స్వదేశీ పెట్టుబడులు తరలివస్తున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో భారత్ అన్ని రంగాల్లోనూ ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలవాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని, ఆ సంకల్పాన్ని సాధించే దిశగా దేశం మునుపెన్నడూ లేనంత వేగంతో ముందుకు సాగుతోందని చెప్పారు.  


[Amit Shah, BrahMos missiles, Uttar Pradesh, Pakistan, UPITS 2026, Pakisthan, Fear, MakeinIndia, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.