నాసిరకం రోడ్లు: ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్లే బాధ్యులు.. ఒడిశా సర్కార్ నూతన నిబంధనలు.!

Publish Date:Sep 26, 2026

Advertisement

రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రయాణికులు,  పాదచారుల భద్రతకు ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. తప్పుడు డిజైన్లు, నాసిరకం నిర్మాణాలు,  సరైన నిర్వహణ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి పాదచారులు మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా, ఆ పరిణామాలకు పూర్తి బాధ్యత ఆ రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఇంజినీర్లు,  నిర్మాణ సంస్థలదేనంటూ నిబంధనలను రూపొందించింది. ఈ కొత్త నిబంధనల ముసాయిదాను ఒడిశా సర్కార్  గురువారం (సెప్టెంబర్ 24) విడుదల చేసింది. రోడ్ల నాణ్యత లోపం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న వైనాన్ని అరికట్టే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఈ ప్రతిపాదిత  నిబంధనల ప్రకారం మోటర్‌ వాహనాల చట్టంలోని సెక్షన్‌ 198ఏ కింద ఈ తరహా దుర్ఘటనల్లో బాధ్యులైన కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం విచారణతో సరిపెట్టకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిర్మాణ సంస్థలను ప్రస్తుత ఒప్పందాల నుంచి పూర్తిగా తొలగించడంతో పాటు వాటిని బ్లాక్‌ లిస్టులో చేర్చాలని   యోచిస్తున్నది. అలాగే  నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లకు రావాల్సిన తదుపరి చెల్లింపులను  నిలిపివేయాలని ప్రతిపాదిత నిబంధనల్లో పేర్కొంది.  రోడ్డు నిర్మాణ రంగంలో పారదర్శకతను తీసుకురావడానికి ,  జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ చర్యలు  దోహదపడతాయని చెబుతున్నది.  

ఈ  విధానంలో భాగంగా ప్రతి రోడ్డు ప్రాజెక్ట్‌ పూర్తికాగానే తుది అనుమతి లేదా చివరి ఆర్థిక చెల్లింపు జరిగే ముందు  ప్రధాన ఇంజినీర్లు,  కాంట్రాక్టర్లు వ్యక్తిగత చట్టపరమైన బాధ్యతను  అంగీకరిస్తూ భద్రత సమ్మతి ప్రకటనపై తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుంది. రోడ్డు భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నివారించేందుకు ఈ ముసాయిదా నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు మరియు పాదచారుల మరణాలు పెరుగుతున్న తరుణంలో, ఒడిశా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ముసాయిదా నిబంధనలు ఇతర రాష్ట్రాలకు కూడా ఒక రోడ్‌మ్యాప్‌గా నిలుస్తాయని పరిశీలకులు అంటున్నారు. 

[Odisha Government, Substandard Roads, Pedestrian Safety, Road Accidents, Contractor Liability, Motor Vehicles Act. Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.