దేవినేని మరణం : బెజవాడ రక్త చరిత్రకి THE END!

Publish Date:Apr 17, 2017

Advertisement


దేవినేని రాజశేఖర్… ఉరఫ్ దేవినేని నెహ్రు…. గుండెపోటుతో మరణించారు. ఇది ఏపీ రాజకీయాలకి, మరీ ముఖ్యంగా, రాజధాని విజయవాడకి తీరని లోటే. ఆయన ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ కి అధికారికంగా సెలవు ప్రకటించకున్నా కొడుకు అవినాష్ ను రంగంలోకి దింపి రెస్ట్ తీసుకోవాలనే అనుకున్నారు. కాని, కాలేజీ రోజుల్నుంచే అనూహ్య మలుపులు తిరుగుతూ వచ్చిన ఆయన జీవితం చివరి దశలో కూడా అనూహ్యంగానే అంతమైంది!

 

దేవినేని కేవలం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక నేత, మంత్రిగా కూడా పని చేసిన నాయకుడు మాత్రమే కాదు. అంతే అయితే, ఆయన గురించి పెద్దగా చెప్పుకోటానికి ఏం వుండేది కాదు. దేవినేని సత్తా అంతా ఆయన రాజకీయం కన్నా విజయవాడ యుద్ధ భూమిలో నెట్టుకురావటంలోనే కనిపిస్తుంది మనకు! అసలు దేవినేని కుటుంబంలో నెహ్రులా సహజ మరణం పొందనే లేదు ఆయన అన్న, తమ్ముడూ …. ఇద్దరూ కూడా! దేవినేని నెహ్రు అన్నయ్య గాంధీని, మురళిని వంగవీటి వర్గం హత్య చేసింది. అలా సోదరులిద్దరూ అర్ధాంతరంగానే అసువులు బాసినా నెహ్రు దశాబ్దాల పాటూ పోరాటం చేస్తూ ప్రాణాలు కాపాడుకుంటూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు! అదే ఆయన అసలు విజయం…

 

కంకిపాడు నియోజకవర్గం నుంచి దేవినేని పదే పదే గెలవటం నిజంగా విశేషమేం కాదు. సహజమే. టీడీపీలో వున్నా, కాంగ్రెస్ లో వున్నా, ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వచ్చినా జనం ఆయన వెంట ఎప్పుడూ వున్నారు. అందుక్కారణం ఎప్పుడో కాలేజీ రోజుల్లో మొదలైన వర్గ పోరాటాన్ని ఎక్కడ ఆపకుండా చివరిదాకా నిర్భయంగా, తెలివిగా నడపటమే. వంగవీటి మోహన రంగ లాంటి విపరీతమైన ఫాలోయింగ్ వున్న ప్రమాదకర ప్రత్యర్థి వున్నా దేవినేని నెహ్రు ఒకవైపు రౌడీయిజాన్ని, మరో వైపు రాజకీయాన్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. వంగవీటి వర్గం తన అన్నని, తమ్ముడ్ని చంపేసినా ఆయన ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. వంగవీటి మోహనరంగ హత్య కేసులో ఆయనకు సీబీఐ నుంచి క్లీన్ చిట్ వచ్చినా… జనం మాత్రం దేవినేని నెహ్రునే రంగ హత్యకి కారణమని నమ్ముతుంటారు!

 

రంగ హత్యకి నెహ్రు కారణం అయినా కాకున్నా విజయవాడ రక్త చరిత్రని రంగ హత్యతో ఆగిపోయేలా నెహ్రు చూశారు. తరువాతి కాలంలో వంగవీటి కుటుంబంపై దేవినేని కుటుంబం దాడులు చేయలేదు. వంగవీటి వర్గం కూడా రంగ హత్య తరువాత నెమ్మదించింది. ఇప్పుడు దేవినేని మరణంతో 1970లలో మొదలైన విజయవాడ వర్గ పోరాటం అధికారికంగా అంతమైనట్టే! వంగవీటి కుటుంబం నుంచి రాధాకృష్ణ, దేవినేని కుటుంబం నుంచి అవినాష్ రాజకీయాల్లో వున్నా … రాజధానిగా మారిపోయిన ప్రస్తుత విజయవాడలో తిరిగి గతం తాలూకూ పరిస్థితులు రావటం అసాధ్యమే! కాబట్టి దేవినేని మరణం… ఒక రక్త చరిత్రకి సహజ సమాప్తం!

By
en-us Political News

  
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.