కేటీఆర్, హరీశ్‌ల మధ్య చిచ్చుపెట్టిన స్టీఫెన్ రవీంద్ర

Publish Date:Jul 1, 2016

Advertisement

స్టీఫెన్ రవీంద్ర..మొండితనానికి, ముక్కుసూటి తనానికి, నిజాయితీకి మారుపేరైన అధికారిగా ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలో పేరుంది. ఎక్కడ..ఏ ప్లేస్‌లో పోస్టింగ్ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేయడం ఆయన స్టైల్.  తెలంగాణ ఉద్యమ సమయంలో మనోడి పేరు ఓ రేంజ్‌లో వినపడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దౌర్జన్యాలకు దిగి తెలంగాణవాదుల నుంచి "కర్కోటకుడు" అన్న పేరు పొందారు . అలాంటి స్టీఫెన్ రవీంద్ర మళ్లీ వార్తల్లోకెక్కారు . పరిపాలనా సౌలభ్యం, భద్రతల పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను ఈస్ట్ , వెస్ట్‌గా విభజించింది తెలంగాణ ప్రభుత్వం. దానికి పలువురు ఐపీఎస్ అధికారులను కేటాయించింది.

 

అలా స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ వెస్ట్ జాయింట్ కమిషనర్‌గా నియమించింది. ప్రభుత్వోద్యోగులు అన్నాకా ట్రాన్స్‌ఫర్‌లు ఉంటాయి..సస్పెన్షన్‌లు ఉంటాయి దీనిలో పెద్ద వింతేముంది అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది పెద్ద కథ. సైబరాబాద్ వెస్ట్ జాయింట్ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రను మంత్రి కేటీఆర్ ఏరి కోరి తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేయాలనుకుంటున్న కేటీఆర్..విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. విదేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే  తమ ఉద్యోగుల భద్రత విషయానికి పెద్ద పీట వేస్తున్నాయి. అలాంటి కీలకమైన ఐటీ కారిడార్‌లో భద్రతా విధులు పర్యవేక్షించాలంటే సమర్థుడైన అధికారి ఉండాలని భావించిన కేటీఆర్ అందుకు తగిన వ్యక్తిగా స్టీఫెన్ రవీంద్రను భావించారు.

 

అయితే ఈ నిర్ణయం కేటీఆర్ బావ..మరో మంత్రి హరీశ్‌రావుకు రుచించలేదు. ఎందుకంటే హరీశ్‌రావుకు..స్టీఫెన్ రవీంద్రకు మధ్య జరిగిన కోల్డ్‌వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం..మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో విద్యుత్ సౌధలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన హరీశ్‌రావును అప్పుడు డీసీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర తన సిబ్బందితో అడ్డుకున్నారు.  దీనిపై ఆగ్రహించిన హరీశ్ స్టీఫెన్‌ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు "ఇడియట్",  "యూజ్‌లెస్ ఫెలో" అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో హల్‌చల్ చేసింది. అలాంటి స్టీఫెన్ రవీంద్రను కేటీఆర్ ఏరికోరి ఎంచుకోవడంపై హరీశ్‌రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

 

స్టీఫెన్‌ విషయంలో మనసు మార్చుకోవాలని హరీశ్, కేటీఆర్‌కు సూచించగా..దానికి కేటీఆర్ ససేమిరా అన్నట్లు సమాచారం. చివరికి ఈ పంచాయతీ అటు తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. ఉద్యమంలో ఇవన్నీ మామూలే..రాష్ట్రాభివృద్ధి కోసం కేటీఆర్ నిర్ణయాన్ని సమర్థించకతప్పదు అంటూ కేసీఆర్, హరీశ్‌రావుకు ఫుల్లుగా క్లాస్ పీకి పంపినట్టు గులాబీ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి. తండ్రి, కొడుకులిద్దరూ కలిసి తనకు ఇష్టం లేని అధికారిని వెనకేసుకురావడం పట్ల హరీశ్ లోలోపల కుమిలిపోతున్నారు. మరో పక్క సీఎం కేటీఆర్‌ మాటకు ఇస్తున్న విలువ తన మాటకు ఇవ్వకపోవడంతో హరీశ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అసలే ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న హరీశ్, కేటీఆర్‌ల మధ్య స్టీఫెన్ రవీంద్ర మరో చిచ్చు పెట్టినట్లైంది. 

By
en-us Political News

  
ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా,   దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది.  ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది.  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.