అర్నబ్ ఎఫెక్ట్: కోనసీమ కకావికలు..125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు.!

Publish Date:Oct 27, 2026

Advertisement

అర్నబ్ తుపాను కోనసీమ జిల్లాను కకావికలం చేసింది. పెను తుపాను ప్రభావంతో గంటకు నూటపాతిక కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన పెనుగాలులకు వేల సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలుల వేగం తీవ్రత  గంటకు150 కిలోమీటర్ల వరకూ ఉంది.  ఈ ప్రచండ గాలులకు జిల్లాలోని అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ గాలుల ధాటికి వేల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 

అమలాపురం, అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, అయినవిల్లి, మామిడికుదురు  ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం సహా పలు మండలాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షపాతం నమోదైంది. ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి.  

కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఆరువేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇంచుమించుగా జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ దాదాపు స్తంభించిపోయింది.  జిల్లా   యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. విరిగిపడిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. అలాగే రహదారులకు అడ్డంగా పడిపోయిన చెట్లు తొలగించి రవాణా పునరుద్ధరించే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.  

[Cyclone Arnab Effect On Konaseema District, Damage, Amalapuram, Ambajipet, Traffic, Power, Trees, Current, Poles, Telugu One] 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
  అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఉప్పాడ  తీరంలో సముద్రం ప్రళయ భీకరంగా మారింది. రాకాసి అలల తాకిడికి  బీచ్ రోడ్డు కోతకు గురైంది. బండరాళ్లు సైతంకొట్టుకుపోయాయి. పల్లిపేట, రంగంపేట గ్రామాలను సముద్ర నీరు ముంచెత్తింది.  తుపాను తీరం దాటినా దాని ప్రభావం మరో 12 గంటల పాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అర్నబ్ తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
మూడు దశాబ్దాల తర్వాత కడప జడ్పీ పీఠం టీడీపీకి దక్కేనా.?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.