అర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి.!

Publish Date:Oct 27, 2026

Advertisement

అర్నబ్ తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. తుఫాన్‌ సన్నద్ధతపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ తుఫాన్‌ సన్నద్ధతపై నిరంతరం సమీక్షిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తుఫాన్‌ ప్రభావం శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ఉండే అవకాశం ఉందని, తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నాయని తెలిపారు. కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు.

కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరప్రాంతాల్లో సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంత గ్రామాల ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకుని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. అవసరమైన వారు తుఫాన్‌ షెల్టర్లకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

290 తుఫాన్‌ షెల్టర్లు.. 84,396 మందిని తరలింపు.!

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు 290 షెల్టర్లను ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు 84,396 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు 24 గంటలూ పనిచేస్తున్నాయని, ప్రతి గంటకూ తుఫాన్‌ హెచ్చరికల బులెటిన్‌ జారీ చేస్తున్నామని చెప్పారు.

మత్స్యకారులకు చెందిన 30 వేలకుపైగా బోట్లను సముద్రం నుంచి వెనక్కి రప్పించామని తెలిపారు. ఒడిశాలోని గోపాల్‌పూర్‌ వద్ద ఏపీకి చెందిన 93 బోట్లు, వాటి సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. వైద్య సేవల కోసం 1,316 అంబులెన్సులను సిద్ధం చేశామని, సుమారు 5 వేల మంది గర్భిణులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులకు తరలించినట్లు వివరించారు.

విద్యుత్‌ అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు.!

తుఫాన్‌ కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేందుకు 8,400 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచామని సీఎం చెప్పారు. సుమారు 15 వేల విద్యుత్‌ స్తంభాలు పడిపోయే అవకాశం ఉందన్న అంచనాతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తాగునీటి సరఫరాకు ట్యాంకర్లు, జనరేటర్లను సిద్ధం చేశామని తెలిపారు.

భారీ వర్షాలతో నాగావళి, వంశధార నదులకు వరదలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు హెచ్చరించారు. వివిధ జిల్లాల్లో వాగులు, వంకల్లో నీటి ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, చెరువులకు గండ్లు పడితే వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ముంపు గ్రామాలకు ఆహారం, ఔషధాలు సరఫరా చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

వ్యవసాయానికి నష్టం జరగకుండా చర్యలు.!

తుఫాన్‌ ప్రభావంతో సుమారు 7.16 లక్షల హెక్టార్ల వ్యవసాయ పంటలు, 16 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని సీఎం తెలిపారు. అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు, బాలింతలకు అవసరమైన ఆహారం అందించడంతో పాటు రేషన్‌ సరఫరాకు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పారు. క్యాచ్‌మెంట్‌ ప్రాంతాల్లో కురిసే వర్షపు నీటిని రిజర్వాయర్లలోకి మళ్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

తుఫాన్‌ వల్ల కలిగే నష్టాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అంచనా వేసి, నష్ట నివారణ చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌, నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌ బృందాలను అప్రమత్తం చేశామని తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు.!

గతంలో బుడమేరు వరదల సమయంలో విజయవాడ కలెక్టరేట్‌లో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రజలు సుమారు రూ.500 కోట్ల మేర విరాళాలు అందించారని తెలిపారు. హుద్‌హుద్‌ తుఫాన్‌తో పోలిస్తే ప్రస్తుత తుఫాన్‌ తీవ్రత తక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే, పరిస్థితిని తేలికగా తీసుకోవద్దని సూచించారు.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో రాత్రి కూడా నిరంతరం సమీక్షలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తీరప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజలు తుఫాన్‌ షెల్టర్లకు వెళ్లాలని, భారీ వర్షాలు, బలమైన గాలుల సమయంలో ప్రయాణాలు చేయవద్దని సూచించారు. నదులు, వాగులు, వరద నీటి ప్రవాహాల వైపు వెళ్లకూడదని హెచ్చరించారు.“ప్రజలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది” అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

 

 

[ CM Chandrababu reviews Arnab storm, Cyclone Arnab, Chandrababu Naidu, Andhra Pradesh Government, AP Cyclone Alert, Andhra Pradesh Weather, Cyclone Preparedness, AP CM Press Meet, Heavy Rainfall Alert, North Andhra Cyclone, Coastal Andhra, Srikakulam, Vizianagaram ]

By
en-us Political News

  
ఎండల తీవ్రత, ఎల్ నినో ఎఫెక్ట్ తో జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుతుండటంతో తిరుమలలో భక్తులకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం  అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా నీటి పొదుపు, సమర్థవంతమైన నీటి యాజమాన్య చర్యలను ప్రారంభించింది
మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించామనీ   ఆ హామీకి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్  స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియ సాగే కొద్దీ బడ్జెట్ అంచనాలు సవరించబడతాయని చెప్పారు.
హత్యాయత్నం  కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న బీటెక్ రవి,  పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ తానే స్వయంగా డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  
వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించి  నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు  అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.   నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు.
తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 
1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  
ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20)  నాటికి  సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. 
గత ఆరు గంటల వ్యవధిలో గంటకు  3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను,   చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం,  విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  
 తుపాను తీరం దాటే సమయంలో సముద్రం  అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం   రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ పేర్కొంది.  
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు.  తుపాను కదలికలు,  తీవ్రత,  రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.